హార్దిక్ పాండ్యా గుజరాత్ టీమ్ ను వీడటంతో.. ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. తాజాగా పాండ్యా బాటలోనే ఓ స్టార్ క్రికెటర్ కూడా వెళ్లనున్నాడన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. మరి ఆ ప్లేయర్ ఎవరు?
హార్దిక్ పాండ్యా గుజరాత్ టీమ్ ను వీడటంతో.. ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. తాజాగా పాండ్యా బాటలోనే ఓ స్టార్ క్రికెటర్ కూడా వెళ్లనున్నాడన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. మరి ఆ ప్లేయర్ ఎవరు?
IPL 2024 సీజన్ లో సంచలనం సృష్టించిన అంశం ఏదైనా ఉందంటే? అది హార్దిక్ పాండ్యా గుజరాత్ ను వదిలి ముంబై ఇండియన్స్ కు వెళ్లడమే. క్యాష్ ఆన్ డీల్ లో భాగంగా ఈ ప్రక్రియ ముగిసింది. పాండ్యాకు కాంట్రాక్ట్ ధర రూ. 15 కోట్లతో పాటుగా భారీ మెుత్తంలో ట్రాన్స్ ఫర్ ఫీజును గుజరాత్ టైటాన్స్ కు చెల్లించింది ముంబై యాజమాన్యం. ఇక ఇదే బాటలో మరో స్టార్ ప్లేయర్ కూడా నడవనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే తమ జట్టులోని ఓ స్టార్ క్రికెటర్ ను ట్రేడ్ చేసుకుంటామని ఓ ఫ్రాంచైజీ తమను సంప్రదించిందని గుజరాత్ టీమ్ సీఈవో కల్నల్ అర్విందర్ సింగ్ చెప్పడం సంచలనంగా మారింది. మరి పాండ్యా బాటలో నడవనున్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? ఆ వివరాలు..
హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు వెళ్లడంతో గుజరాత్ టైటాన్స్ కు భారీ షాక్ తగిలింది. ఒకసారి ఛాంపియన్ గా, రెండోసారి రన్నరప్ గా జట్టును నిలిపిన పాండ్యా ముంబైకి బదిలీ కావడంతో.. గుజరాత్ కు కోలుకోలేని దెబ్బతగిలింది. తాజాగా మరో ప్లేయర్ కూడా పాండ్యా బాటలోనే నడవనున్నాడని సమాచారం. అడెవరో కాదు.. వరల్డ్ కప్ హీరో టీమిండియా పేస్ సంచలనం మహ్మద్ షమీ. అవును షమీ కూడా పాండ్యాలాగే ఫ్రాంచైజీ మారనున్నాడని తెలుస్తోంది. కాగా.. షమీని ట్రేడ్ చేసుకుంటామని ఓ ఫ్రాంచైజీ తమను సంప్రదించిందని గుజరాత్ టైటాన్స్ సీఈవో కల్నల్ అర్విందర్ సింగ్ తెలిపాడు.
అయితే ఈ విషయంపై డైరెక్ట్ గా మమ్మల్ని సదరు మేనేజ్ మెంట్ సంప్రదించలేదు. వాళ్లు సపోర్ట్ స్టాఫ్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. ఇలా అప్రోచ్ కావడం ఐపీఎల్, బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ నిబంధనలకు పూర్తిగా విరుద్దమని గుజరాత్ సీఈవో పేర్కొన్నాడు. ఆ ఫ్రాంచైజీ సపోర్ట్ స్టాఫ్ తో కాకుండా.. డైరెక్ట్ గా మాతో అప్రోచ్ అయితే.. ఈ డీల్ గురించి మాట్లాడేవాళ్లమని ఆయన తెలిపాడు. అయితే షమీ కోసం సంప్రదించిన సదరు ఫ్రాంచైజీ పేరును మాత్రం వెల్లడించలేదు అర్విందర్ సింగ్. షమీ ఆసక్తి చూపించడంతోనే ఆ యాజమాన్యం అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ ముగిసినా.. ట్రేడింగ్ కు డిసెంబర్ 12 వరకు అవకాశం ఇచ్చారు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ యాజమాన్యం వరల్డ్ కప్ లో దుమ్మురేపిన షమీని జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నట్లు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Which Franchise Can Request GT For Mohammed Shami ? pic.twitter.com/kEjRyGTTQe
— Junaid Khan (@JunaidKhanation) December 6, 2023