వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా మరో విక్టరీ కొట్టింది. సౌతాఫ్రికాపై ఏకంగా 243 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో సచిన్ 49 సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేశాడు.
వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా మరో విక్టరీ కొట్టింది. సౌతాఫ్రికాపై ఏకంగా 243 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో సచిన్ 49 సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేశాడు.
సచిన్ టెండూల్కర్.. క్రికెట్ దేవుడిగా పేరొందిన లెజెండరీ ప్లేయర్. మన దేశంలో జెంటిల్మన్ గేమ్‌కు ఆదరణ పెంచినా.. తన గేమ్‌తో క్రికెట్‌కు వన్నె తెచ్చినా అది అతడికే చెల్లింది. వందల మ్యాచులు ఆడిన మాస్టర్ బ్లాస్టర్.. వేల పరుగులు, లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు. వరల్డ్ క్రికెట్లో టీమిండియా ఎదుగుదలలో సచిన్ పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి క్రికెటర్ రిటైరైన తర్వాత మరో సచిన్ భారత్‌కు దొరుకుతాడా? మాస్టర్ బ్లాస్టర్ లేని వెలితి ఎలా తీరుతుందోననే బాధ అభిమానుల్లో ఉండేది. కానీ ఆ ప్రశ్నకు సమాధానంగా గన్‌లోని బుల్లెట్ మాదిరిగా రివ్వున దూసుకొచ్చాడు విరాట్ కోహ్లీ. అలుపన్నదే లేకుండా పరుగుల యంత్రంలా రన్స్ చేస్తూ పోతున్నాడు.
పరుగుల ఆకలి తీరని విరాట్ కోహ్లీ.. ఇప్పుడు వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డులో గ్రేట్ సచిన్ టెండూల్కర్ సరసన చేరాడు. తన బర్త్ డే నాడు ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. వన్డేల్లో 49 సెంచరీలు చేసిన ప్లేయర్స్ సచిన్ కంటే ముందు ఎవరూ లేరు. కానీ మాస్టర్ బ్లాస్టర్ ఆ ఘనత సాధించిన 11 ఏళ్లకే విరాట్ దాన్ని అందుకున్నాడు. 49వ సెంచరీని సచిన్ 452వ (463 మ్యాచ్) ఇన్నింగ్స్‌లో అందుకున్నాడు. కానీ కోహ్లీ మాత్రం 277వ (289 మ్యాచ్) ఇన్నింగ్స్‌లోనే ఆ రికార్డు సమం చేశాడు. దీన్ని బట్టే అతడి దూకుడు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సచిన్ సెంచరీలు చేసిన 49 మ్యాచుల్లో టీమిండియా 33 గెలిచింది. కానీ కోహ్లీ 40 సెంచరీలు భారత్ విజయాలు సాధించిన మ్యాచుల్లో వచ్చినవే.
భారత్‌లో 23 సెంచరీలు చేసిన కోహ్లీ.. విదేశాల్లో 26 సెంచరీలు బాదడం విశేషం. వన్డే క్రికెట్లో సచిన్ (18,426) తర్వాత అత్యధిక రన్స్ చేసిన టీమిండియా ప్లేయర్ కోహ్లీ (13,626)నే. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో విరాట్‌దే అగ్రస్థానం. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్ శర్మ మినహా మరే ప్లేయరూ 10 వేల రన్స్ చేయలేదు. అలాంటి కోహ్లీ ఆదివారం సౌతాఫ్రికాపై సెంచరీ బాదాక ఎమోషనల్ అయ్యాడు. ‘నా హీరో సచిన్ రికార్డును సమం చేయడం నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. నేనెప్పటికీ సచిన్ అంత బాగా క్రికెట్ ఆడలేను. మా ఇదర్నీ కంపేర్ చేయడం చాలా మందికి ఇష్టం. కానీ పోల్చడమనేది నాకు నచ్చదు. సచిన్‌ను ఇంతగా ఇష్టపడటానికి కారణం బ్యాటింగ్‌లో అతడి పర్ఫెక్షన్. నేను నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. టీమ్‌ను గెలిపించడమే నా పని. సచిన్ నుంచి ప్రశంసలు అందుకోవడం హ్యాపీగా ఉంది’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. మరి.. కోహ్లీ వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పాక్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ సెటైర్లు.. వాళ్లలా ఉన్నారంటూ..!
Virat Kohli talking about his idol Sachin Tendulkar….!!! 🐐
– The best video of the World Cup. pic.twitter.com/zJ4LFxfmzw
— Johns. (@CricCrazyJohns) November 5, 2023