iDreamPost

పాక్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ సెటైర్లు.. వాళ్లలా ఉన్నారంటూ..!

  • Author Soma Sekhar Published - 09:11 PM, Sat - 4 November 23

కివీస్ తో జరిగిన మ్యాచ్ లో షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, హసన్ అలీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక వీరి బౌలింగ్ పై సెటైర్లు వేశాడు టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్.

కివీస్ తో జరిగిన మ్యాచ్ లో షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, హసన్ అలీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక వీరి బౌలింగ్ పై సెటైర్లు వేశాడు టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్.

  • Author Soma Sekhar Published - 09:11 PM, Sat - 4 November 23
పాక్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ సెటైర్లు.. వాళ్లలా ఉన్నారంటూ..!

వరల్డ్ కప్ లో సెమీస్ రేస్ మరింత రసవత్తరంగా మారింది. ఇక వరల్డ్ కప్ లో ముందుకు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పాక్ కు వరుణుడు సాయం చేశాడు. దీంతో 21 పరుగుల తేడాతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం విజయం సాధించింది పాక్. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ మ్యాచ్ లో పాక్ బౌలర్లు దారుణంగా విఫలం అయ్యారు. వరల్డ్ క్లాస్ బౌలర్లు మేమే అని విర్రవీగిన పాక్.. గొప్పలు చెప్పుకోవడమే తప్ప చేసింది ఏమీ లేదని కివీస్ తో మ్యాచ్ రుజువుచేసింది. షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, హసన్ అలీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక వీరి బౌలింగ్ పై సెటైర్లు వేశాడు టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్.

వరల్డ్ కప్ లో భాగంగా శనివారం న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం 21 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు మూకుమ్మడిగా విఫలం అయ్యారు. షాహిన్,రౌఫ్, హసన్ అలీ లు పరుగులు ఇవ్వడంలో పోటీ పడ్డారు. కివీస్ బ్యాటర్లు వీరి బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ.. జట్టు స్కోర్ ను 400 దాటించారు. పాక్ పేస్ త్రయాన్ని సమానంగా దంచికొట్టారు కివీస్ బ్యాటర్లు. షాహిన్ తన 10 ఓవర్ల కోటాలో 90 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. హసన్ అలీ 84 రన్స్, రౌఫ్ 85 రన్స్ ఇచ్చారు. వీరు ముగ్గురు కలిపి 257 రన్స్ ఇవ్వడం గమనార్హం.

దీంతో వీరి బౌలింగ్ పై సెటైర్లు గుప్పించాడు టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్. పాకిస్తాన్ బౌలింగ్ చూస్తుంటే.. పళ్లు లేని ముసలి వాళ్లు నవ్వుతున్నట్లు ఉందని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ గా మారింది. సమయం చిక్కినప్పుడల్లా పఠాన్ తన సమయస్ఫూర్తికి పదునుపెడుతూ.. ఇలా చమత్కారాన్ని గుప్పిస్తుంటాడు. ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మీ పోలికకు హ్యాట్సాఫ్ పఠాన్ భాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 402 పరుగులు చేసింది. జట్టులో రచిన్ రవీంద్ర(108), విలియమ్సన్(95) పరుగులతో రాణించారు.

అనంతరం భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన పాక్.. దీటుగానే ఇన్నింగ్స్ ను ఆరంభించింది. ఓపెనర్ అబ్దుల్లా(4) తక్కువ పరుగులకే అవుట్ అయినా గానీ.. మరో ఓపెనర్ ఫకర్ జమాన్(126*) తుపాన్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు. అతడు కేవలం 63 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. అతడికి తోడు కెప్టెన్ బాబర్(66*) రన్స్ తో రాణించాడు. మ్యాచ్ కు మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో.. డక్ వర్త్ లూయిస్ ప్రకారం పాక్ 21 పరుగులతో గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి