iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రోహిత్ విషయంలో BCCI మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయితే T20 కప్పు మనదే!

  • Published Feb 05, 2024 | 8:51 PM Updated Updated Feb 05, 2024 | 8:51 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు జోష్​లో ఉన్నాడు. ఇంగ్లండ్​పై రెండో టెస్టులో విజయంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అయితే హిట్​మ్యాన్ విషయంలో భారత క్రికెట్ బోర్డు మాస్టర్ ప్లాన్ వేస్తోంది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు జోష్​లో ఉన్నాడు. ఇంగ్లండ్​పై రెండో టెస్టులో విజయంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అయితే హిట్​మ్యాన్ విషయంలో భారత క్రికెట్ బోర్డు మాస్టర్ ప్లాన్ వేస్తోంది.

  • Published Feb 05, 2024 | 8:51 PMUpdated Feb 05, 2024 | 8:51 PM
Rohit Sharma: రోహిత్ విషయంలో BCCI మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయితే T20 కప్పు మనదే!

ఇంగ్లండ్​తో రెండో టెస్టులో విక్టరీ సాధించడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ జోష్​లో ఉన్నాడు. బజ్​బాల్​ బెండు తీయడంతో సంతోషంలో మునిగిపోయాడు. ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో స్టోక్స్ సేనను ఓడించి సిరీస్​ను సమం చేయడంతో హ్యాపీగా ఉన్నాడు. సిరీస్​లోని మొదటి టెస్టులో ఓడటంతో హిట్​మ్యాన్ భారీగా విమర్శల్ని ఎదుర్కొన్నాడు. అటు బ్యాటర్​గా ఫెయిలవడం, ఇటు సారథిగానూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో రోహిత్​కు ఏమైందనే కామెంట్లు వినిపించాయి. అతడి పనైపోయిందని కొందరు సీనియర్లు వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో జట్టు అద్భుతంగా పుంజుకొని విజయం సాధించడంతో రోహిత్​కు ఊరట దక్కింది. అయితే హిట్​మ్యాన్ విషయంలో బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది జూన్​లో టీ20 వరల్డ్ కప్​ జరగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పక్కా ప్లాన్​తో వ్యవహరిస్తోందని తెలిసింది. గతేడాది వన్డే ప్రపంచ కప్ మిస్సయింది కాబట్టి కనీసం పొట్టి ఫార్మాట్​లోనైనా కప్పు కొట్టాలనే కసితో ఉంది బోర్డు. అందుకోసం ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తోంది. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ముఖ్యం. కాబట్టి అతడి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని సమాచారం. ప్రస్తుతం ఇంగ్లండ్​తో సిరీస్​లో ఆడుతున్న హిట్​మ్యాన్ ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్​తో బిజీ అయిపోతాడు. క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్ కప్ ప్రిపరేషన్స్​లో బిజీ అయిపోతాడు. అయితే వరుసగా క్రికెట్ ఆడితే అతడు గాయాలపాలయ్యే ప్రమాదం ఉందని బీసీసీఐ భయపడుతోంది.

ఐపీఎల్​కు టీ20 వరల్డ్ కప్​కు మధ్య కొంత గ్యాప్ ఉంది. క్యాష్ రిచ్ లీగ్ షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ మెగా లీగ్ ముగిసిన తర్వాత ప్రపంచ కప్​కు సన్నద్ధం అయ్యేందుకు కనీసం 15 నుంచి 30 రోజుల వరకు టైమ్ దొరికే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ గ్యాప్​లో రోహిత్​ను రంజీల్లో ఆడించే ఆలోచనల్లో భారత క్రికెట్ బోర్డు ఉందట. అయితే ఇప్పటికే సౌతాఫ్రికా టూర్, ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్ ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లండ్​తో 5 టెస్టుల సిరీస్​లో రోహిత్ ఆడుతున్నాడు. ఈ సిరీస్ పూర్తయిన తర్వాత ఐపీఎల్​లో నెలన్నర పాటు ఆడాల్సి ఉంటుంది. అతడికి రెస్ట్ దొరికే ఛాన్స్ లేదు.

వరుస సిరీస్​లతో అలసిపోయిన హిట్​మ్యాన్​ను రంజీల్లో ఆడించాలా? లేదా విశ్రాంతి ఇవ్వాలా? అనే విషయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్​తో పాటు ఇతర బోర్డు మెంబర్స్ తర్జనభర్జనలు పడుతున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే అతడు ఓకే అంటే రంజీల్లో ఆడించాలని అనుకుంటున్నారట. దీని వల్ల రోహిత్ మరింత ఫామ్​ను పుంజుకునే అవకాశం ఉందని.. ఇది టీ20 వరల్డ్ కప్​లో అక్కరకొస్తుందని బోర్డు భావిస్తోందట. ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం హిట్​మ్యాన్ దుమ్మురేపడం ఖాయమని.. పొట్టి కప్పు మనదేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. టీ20 వరల్డ్ కప్​కు ముందు రోహిత్ విషయంలో బీసీసీఐ చేస్తున్న ప్లానింగ్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IND vs ENG: చిన్నతనం నుంచి వాళ్లను చూస్తూ పెరిగా! బుమ్రా ఎమోషనల్‌ స్టేట్‌మెంట్‌