iDreamPost

IND vs ENG: చిన్నతనం నుంచి వాళ్లను చూస్తూ పెరిగా! బుమ్రా ఎమోషనల్‌ స్టేట్‌మెంట్‌

  • Published Feb 05, 2024 | 6:53 PMUpdated Feb 05, 2024 | 6:53 PM

ఇంగ్లండ్​తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ విక్టరీలో మిగతా ప్లేయర్ల కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నా అందరికంటే పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషించాడని చెప్పొచ్చు.

ఇంగ్లండ్​తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ విక్టరీలో మిగతా ప్లేయర్ల కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నా అందరికంటే పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషించాడని చెప్పొచ్చు.

  • Published Feb 05, 2024 | 6:53 PMUpdated Feb 05, 2024 | 6:53 PM
IND vs ENG: చిన్నతనం నుంచి వాళ్లను చూస్తూ పెరిగా! బుమ్రా ఎమోషనల్‌ స్టేట్‌మెంట్‌

ఇంగ్లండ్​తో రెండో టెస్టులో విజయం సాధించిన టీమిండియా రివేంజ్ తీర్చుకుంది. మొదటి టెస్టులో ఎదురైన అనూహ్య ఓటమికి తన స్టైల్​లో బదులు తీర్చుకుంది. బజ్​బాల్ క్రికెట్​ బెండు తీస్తూ ఇంగ్లీష్ టీమ్​ను 106 పరుగుల భారీ తేడాతో ఓడించింది. భారత్ గెలుపులో బ్యాటర్ల కంటే బౌలర్ల పాత్రే ఎక్కువ. అందులోనూ పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా రాణించిన తీరును అస్సలు మెచ్చుకోకుండా ఉండలేం. ఈ మ్యాచ్​లో రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి 9 వికెట్లు తీసిన బుమ్రా.. ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అద్భుతమైన బౌలింగ్​తో విధ్వంసం సృష్టించినందుకు అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ పురస్కారం అందుకున్న తర్వాత బుమ్రా ఎమోషనల్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి తాను ముగ్గురు లెజెండరీ పేసర్లను చూసి పెరిగానన్నాడు.

‘చిన్నప్పుడు నేను మొదట నేర్చుకున్న బాల్ యార్కర్. దాన్ని బాగా సాధన చేశా. వకార్ యూనిస్, వసీం అక్రమ్, జహీర్ ఖాన్​ను చూస్తూ పెరిగా. ఈ పేస్ దిగ్గజాలను చూసే యార్కర్ ఎలా వేయాలో నేర్చుకున్నా. నాకు ఏ బౌలర్​తోనూ కాంపిటీషన్ లేదు. ఎందుకంటే నేను అందరు ఫాస్ట్ బౌలర్స్​ బౌలింగ్​ను ఓ పిల్లాడిలా చూస్తూ ఎంజాయ్ చేస్తా. ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. పేస్ బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తే వాళ్లను అభినందిస్తా. నేను రికార్డుల గురించి అస్సలు పట్టించుకోను’ అని బుమ్రా స్పష్టం చేశాడు. నంబర్స్, మైల్​స్టోన్స్​ను పట్టించుకోనని.. వాటిని పట్టించుకుంటే అనవసర ఒత్తిడి కలుగుతుందని తెలిపాడు. ప్రెజర్ పెరిగితే గేమ్​ను ఎంజాయ్ చేయలేమని పేర్కొన్నాడు. కుర్రాడిగా ఉన్నప్పుడు రికార్డులు తనకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చేవని.. కానీ ఇప్పుడు అవి ఎక్స్​ట్రా బ్యాగేజ్​గా అనిపిస్తున్నాయని బుమ్రా చెప్పుకొచ్చాడు.

యంగ్ ఏజ్​లో తాను యార్కర్స్ బాగా ప్రాక్టీస్ చేశానని.. అవి ఇప్పుడు పనికొస్తున్నాయని బుమ్రా అన్నాడు. వకార్, వసీం, జహీర్ ఎలా బౌలింగ్ చేసేవారో నిశితంగా పరిశీలించి ఆ డెలివరీస్ ప్రాక్టీస్ చేసేవాడ్ననని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘టీమ్​లో నేను బౌలింగ్ కెప్టెన్ కాదు. కానీ ఒక సీనియర్​ పేసర్​గా యంగ్​స్టర్స్​కు అండగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. అలాగే పిచ్ కండీషన్స్​కు తగ్గట్లు ఎలా బౌలింగ్ చేయాలి, ఎలాంటి బంతుల్ని సంధించాలో చెప్పే రెస్పాన్సిబిలిటీ నాదే. ఇవే విషయాలను గ్రౌండ్​లో కుర్రాళ్లతో చర్చిస్తా. కెప్టెన్ రోహిత్ శర్మతో డిస్కషన్స్ కూడా మ్యాచ్​కు సంబంధించినవే ఉంటాయి. మేం ఇద్దరమూ కలసి సుదీర్ఘ కాలంగా ఆడుతున్నాం. మా ఇరువురి మధ్య ఎలాంటి వాగ్వాదాలకు చోటు లేదు’ అని బుమ్రా వ్యాఖ్యానించాడు. మరి.. చిన్నతనంలో వకార్, వసీం, జహీర్​లను చూసి బౌలింగ్ నేర్చుకున్నానంటూ బుమ్రా చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి