iDreamPost
android-app
ios-app

IND vs ENG: వీడియో: రోహిత్‌ శర్మకు ఊహించని షాకిచ్చిన అభిమానులు! అలా చేయొద్దంటూ..

  • Published Feb 19, 2024 | 9:45 AM Updated Updated Feb 19, 2024 | 9:45 AM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అభిమానులు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అభిమానులు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 19, 2024 | 9:45 AMUpdated Feb 19, 2024 | 9:45 AM
IND vs ENG: వీడియో: రోహిత్‌ శర్మకు ఊహించని షాకిచ్చిన అభిమానులు! అలా చేయొద్దంటూ..

రాజ్​కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అభిమానులు ఊహించని షాకిచ్చారు. దీంతో హిట్​మ్యాన్​కు కూడా ఏం చేయాలో పాలుపోలేదు. కానీ అతడు తను ఏదైతే అనుకున్నాడో అది చేసేశాడు. ఫ్యాన్స్ కాసేపు టెన్షన్ పెట్టినా టీమ్​ మేనేజ్​మెంట్​తో కలసి తీసుకున్న నిర్ణయానికే భారత కెప్టెన్ కట్టుబడ్డాడు. ఇది టీమిండియా రెండో ఇన్నింగ్స్​ టైమ్​లో చోటుచేసుకుంది. యంగ్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (214 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (68 నాటౌట్) బౌండరీలు, సిక్సుల వర్షం కురిపిస్తూ మంచి దూకుడు మీద ఉన్నారు. జైస్వాల్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకొని ఊపు మీద ఉండగా.. రెండో హాఫ్ సెంచరీ బాదిన సర్ఫరాజ్.. దంచుడే దంచుడు అంటూ జోష్​లో కనిపించాడు. ఆ టైమ్​లో రోహిత్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు.

భారత ఇన్నింగ్స్ 98 ఓవర్ల వద్ద ఉన్నప్పుడు డిక్లరేషన్ ప్రకటించాడు రోహిత్. అప్పటికి మన జట్టు స్కోరు 4 వికెట్లకు 430. లీడ్ 556గా ఉంది. ఆ స్కోరును ఇంగ్లండ్ ఛేజ్ చేయడం ఇంపాజిబుల్ అని తేలిపోయింది. దీంతో డిక్లేర్ చేయాలని డిసైడ్ అయిన హిట్​మ్యాన్.. డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. జైస్వాల్, సర్ఫరాజ్​ను గ్రౌండ్​ నుంచి వచ్చేయాలంటూ చేతులు ఊపుతూ సైగ చేశాడు. అయితే అప్పటికే ఆ ఇద్దరు బ్యాటర్లు మంచి ఊపు మీద ఉండటం, ఇంకొన్ని ఓవర్లు ఛాన్స్ ఇస్తే సర్ఫరాజ్ సెంచరీ కొట్టడం ఖాయంగా కనిపిస్తుండటంతో డిక్లరేషన్ వద్దని ఫ్యాన్స్ అరిచారు. చేతులు ఊపుతున్న రోహిత్​ను వారిస్తూ.. ప్లీజ్ డిక్లేర్ చేయొద్దంటూ కేకలు వేశారు. జైస్వాల్-సర్ఫరాజ్ సూపర్బ్​గా ఆడుతున్నారని.. మరికొద్ది సేపు వాళ్ల బ్యాటింగ్ చూస్తామని కోరారు. కానీ హిట్​మ్యాన్ వాళ్ల మాట వినలేదు. గెలుపు ముఖ్యమని భావించాడు.

ఇంగ్లండ్ కొమ్ములు వంచాలన్నా, మ్యాచ్​ను త్వరగా ఫినిష్ చేయాలన్నా బౌలర్లకు ఎక్కువ ఓవర్లు ఇవ్వాలి. అందుకే కరెక్ట్ టైమ్​లో డిక్లేర్ చేశాడు రోహిత్. దీంతో తీవ్ర ఒత్తిడి మధ్య బ్యాటింగ్ స్టార్ట్ చేసిన పర్యాటక జట్టు 122 పరుగులకే కుప్పకూలింది. అప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయొద్దంటూ అరిచిన ఫ్యాన్స్.. ఆ తర్వాత భారత బౌలర్లు వికెట్ల మీద వికెట్లు తీస్తుంటే ఈలలు, కేకలు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. హిట్​మ్యాన్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడని.. అందుకే మ్యాచ్ నాలుగో రోజే ముగిసిందని అంటున్నారు.

ఇంగ్లీష్ టీమ్​ను చావుదెబ్బ తీశాడని.. ఇది రోహిత్​కు మాత్రమే సాధ్యమంటూ అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు ఫ్యాన్స్. అయితే డిక్లరేషన్ వద్దంటూ భారత కెప్టెన్​ను అభిమానులు షాక్​కు గురిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ అతడు మంచి డెసిషన్ తీసుకున్నాడని మెచ్చుకుంటున్నారు. ఈ మ్యాచ్​లో హిట్​మ్యాన్ సూపర్బ్ కెప్టెన్సీతో అదరగొట్టాడని ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. అతడు ఇదే ఊపును కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు. మరి.. రోహిత్​కు ఫ్యాన్స్ ఊహించని షాక్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌పై జైస్వాల్‌ ఊచకోత! ఏకంగా విరాట్‌ కోహ్లీ సరసన..