iDreamPost

IND vs ENG: ఇంగ్లండ్‌పై జైస్వాల్‌ ఊచకోత! ఏకంగా విరాట్‌ కోహ్లీ సరసన..

  • Published Feb 19, 2024 | 8:26 AMUpdated Feb 19, 2024 | 8:26 AM

టీమిండియా నయా సెన్సేషన్ యశస్వి జైస్వాల్ ఇంగ్లండ్​ బౌలర్లను ఊచకోత కోశాడు. సిరీస్​లో మరో డబుల్ సెంచరీ బాదిన జైస్వాల్.. ఏకంగా కింగ్ విరాట్ కోహ్లీ సరసన చోటు దక్కించుకున్నాడు.

టీమిండియా నయా సెన్సేషన్ యశస్వి జైస్వాల్ ఇంగ్లండ్​ బౌలర్లను ఊచకోత కోశాడు. సిరీస్​లో మరో డబుల్ సెంచరీ బాదిన జైస్వాల్.. ఏకంగా కింగ్ విరాట్ కోహ్లీ సరసన చోటు దక్కించుకున్నాడు.

  • Published Feb 19, 2024 | 8:26 AMUpdated Feb 19, 2024 | 8:26 AM
IND vs ENG: ఇంగ్లండ్‌పై జైస్వాల్‌ ఊచకోత! ఏకంగా విరాట్‌ కోహ్లీ సరసన..

రాజ్​కోట్ టెస్టులో భారత్ విజయకేతనం ఎగురవేసింది. మరోమారు బజ్​బాల్ బెండు తీసిన రోహిత్ సేన.. ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో సూపర్బ్ విక్టరీ కొట్టింది. 556 పరుగుల భారీ టార్గెట్​ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్​ను 122 పరుగులకే కట్టడి చేసింది. దీంతో 434 పరుగుల తేడాతో విజయం టీమిండియా సొంతమైంది. భారత టెస్టు క్రికెట్ హిస్టరీలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద గెలుపు కావడం విశేషం. ఈ సక్సెస్​తో సిరీస్​లో 2-1 తేడాతో లీడ్​లోకి వచ్చింది రోహిత్ సేన. ఇక, మూడో టెస్టులో భారత జట్టులో మెయిన్ హైలైట్ అంటే యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ అనే చెప్పాలి. నీళ్లు తాగినంత ఈజీగా సిరీస్​లో మరో డబుల్ సెంచరీ బాదేశాడతను. తద్వారా ఏకంగా కింగ్ విరాట్ కోహ్లీ సరసన చోటు దక్కించుకున్నాడు. అతడి కొత్త ఘనత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రెండో ఇన్నింగ్స్​లో డబుల్ సెంచరీ బాదిన జైస్వాల్ (214 నాటౌట్) కోహ్లీ సరసన చోటు దక్కించుకున్నాడు. ఒకే సిరీస్​లో వరుసగా 2 డబుల్ సెంచరీలు బాదిన రెండో భారతీయుడిగా జైస్వాల్ నిలిచాడు. ఇంతకుముందు కోహ్లీ మాత్రమే ఈ లిస్టులో ఉండేవాడు. ఇప్పుడు ఈ జాబితాలో జైస్వాల్ కూడా ప్లేస్ దక్కించుకున్నాడు. దీంతో అతడ్ని అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రికార్డుల రారాజు విరాట్ సరసన నిలవడం అంత ఈజీ కాదని అంటున్నారు. అది కూడా కెరీర్ స్టార్టింగ్​లోనే ఇలాంటి అరుదైన ఘనత సాధించడం అంటే మాటలు కాదని మెచ్చుకుంటున్నారు. వచ్చే కొన్నేళ్ల పాటు జైస్వాల్ ఇదే రీతిలో అసాధారణంగా బ్యాటింగ్ చేస్తే కోహ్లీ సాధించిన చాలా రికార్డులను అతడు అందుకోవడం లేదా బ్రేక్ చేయడం కంపల్సరీ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Jaiswal's massacre of England! Together with Virat Kohli

ఇక, రాజ్​కోట్ టెస్టులో జైస్వాల్ బాదిన డబుల్ సెంచరీ చాలా స్పెషల్ అనే చెప్పాలి. గాయం కారణంగా మూడో రోజు సెంచరీ తర్వాత రిటైర్డ్ హర్ట్​గా వెళ్లిపోయాడు జైస్వాల్. కానీ నాలుగో రోజు మళ్లీ బ్యాటింగ్​కు వచ్చి బౌండరీలు, సిక్సుల వర్షం కురిపించాడు. సర్ఫరాజ్ ఖాన్ (68 నాటౌట్)తో పోటీపడి మరీ రన్స్ చేశాడు. ఇద్దరూ బ్యాట్లకు పని చెప్పడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. వికెట్లు పడకపోవడం, భారీగా పరుగులు ఇచ్చుకోవడంతో ఇంగ్లండ్ బౌలర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. జైస్వాల్ డబుల్ తర్వాత రోహిత్ శర్మ ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేశాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లీష్ టీమ్ 122 రన్స్​కే ఆలౌట్ అయింది. కాగా, సెంచరీ బాదిన ప్రతిసారి దాన్ని భారీ ఇన్నింగ్స్​గా మలచడం అలవాటు చేసుకుంటున్న జైస్వాల్.. ఇలాగే ఆడితే కోహ్లీ సాధించిన చాలా రికార్డులకు ఎసరు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. కోహ్లీ సరసన జైస్వాల్ చోటు దక్కించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IND vs ENG: వీడియో: సూపర్‌ రనౌట్‌! ధృవ్‌ రూపంలో టీమిండియాలోకి మరో ధోని?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి