iDreamPost
android-app
ios-app

కెప్టెన్సీ గురించి రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తానెప్పుడూ అదే చేస్తానంటూ..!

  • Author singhj Published - 09:11 PM, Fri - 27 October 23

వరల్డ్ కప్​లో టీమిండియాను సక్సెస్​ఫుల్​గా నడిపిస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. సరైన టైమ్​లో సరైన నిర్ణయాలు తీసుకుంటూ టీమ్ సక్సెస్​లో మెయిన్ రోల్ పోషిస్తున్నాడు.

వరల్డ్ కప్​లో టీమిండియాను సక్సెస్​ఫుల్​గా నడిపిస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. సరైన టైమ్​లో సరైన నిర్ణయాలు తీసుకుంటూ టీమ్ సక్సెస్​లో మెయిన్ రోల్ పోషిస్తున్నాడు.

  • Author singhj Published - 09:11 PM, Fri - 27 October 23
కెప్టెన్సీ గురించి రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తానెప్పుడూ అదే చేస్తానంటూ..!

ప్రస్తుత తరంలో క్రికెట్​లో కెప్టెన్​గా బెస్ట్ అని చెప్పుకునే వారిలో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందు వరుసలో ఉంటారు. విలియమ్సన్ కూల్​గా టీమ్​ను నడిపిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రశాంతతను కోల్పోకుండా జట్టును లీడ్ చేస్తాడు. గెలుపైనా, ఓటమైనా ఒకేలా తీసుకుంటాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మది కూడా దాదాపుగా ఇలాంటి మనస్తత్వమే. టీమ్​మేట్స్ మీద ఉండే ఒత్తిడిని తానే తీసుకొని వాళ్లను కూల్​గా ఉంచుతాడు రోహిత్. తన ఎక్స్​పీరియెన్స్ మొత్తాన్ని బయటకు తీసి కరెక్ట్ టైమ్​లో డేరింగ్ డెసిజన్స్ తీసుకుంటాడు. ఇది ప్రస్తుత వరల్డ్ కప్​లో కూడా చూస్తున్నాం.

వరల్డ్ కప్​లో బ్యాటింగ్​లో దుమ్మురేపుతున్న రోహిత్​.. కెప్టెన్​గానూ ఆకట్టకుంటున్నాడు. బ్యాటర్లు ఫెయిలైనా, బౌలర్లు భారీగా రన్స్ ఇచ్చినా వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు. అందుకే మిడిల్ ఓవర్లలో భారత్ ఎక్కువ వికెట్లు తీస్తోంది. హిట్​మ్యాన్ ప్రోత్సాహం వల్లే శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి వాళ్లు మళ్లీ ఫామ్ అందుకున్నారు. నెక్స్ట్ ఇంగ్లండ్​తో జరిగే మ్యాచ్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు రోహిత్ శర్మ. టీమ్​లోని ప్రతి ప్లేయర్ చెప్పేది వినడం.. వాళ్లను అర్థం చేసుకోవడం కీలకమన్నాడు. టీమ్​కు కెప్టెన్​గా ఉండటం అంత ఈజీ కాదన్నాడు రోహిత్.

ప్లేయర్ల విషయంలో పర్సనల్​గా ఒక్కొక్కర్ని అర్థం చేసుకోవడం.. వారికేం కావాలి? వారి అవసరాలు ఏంటనేది తెలుసుకోవడం అత్యంత కీలకమన్నాడు రోహిత్ శర్మ. ఆటగాళ్ల ఇష్టాయిష్టాలు కనుక్కోవడం కూడా ముఖ్యమన్నాడు హిట్​మ్యాన్. జట్టు గెలుపంటే ఒక్కరు, ఇద్దరు లేదా కొందరి గెలుపు కాదని.. టీమ్​లోని ప్రతి ఒక్కరూ ఇందులో భాగమేనన్నాడు. ఛాంపియన్​షిప్, పెద్ద టోర్నీలు నెగ్గాలంటే ప్రతి ఒక్కరూ తమ రోల్ పోషించాలన్నాడు రోహిత్. అందుకోసం అందర్నీ ఫిజికల్​గా, మెంటల్​గా ఫుల్ ఫిట్​గా ఉంచాలన్నాడు. ప్రతి ఒక్కరి మాట వింటూ వారి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవడం అవసరమని.. తానెప్పుడూ అదే చేస్తానన్నాడు రోహిత్. మరి.. కెప్టెన్సీపై హిట్​మ్యాన్​ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ధోని, దాదా కాదు.. వన్డేల్లో బెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మే.. ఇదిగో ప్రూఫ్​!