iDreamPost

ధోని, దాదా కాదు.. వన్డేల్లో బెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మే.. ఇదిగో ప్రూఫ్​!

  • Author singhj Updated - 05:15 PM, Fri - 27 October 23

క్రికెట్​లో కెప్టెన్సీ అనేది అంత ఈజీ కాదు. అందులోనూ భారత్ లాంటి క్రికెట్​కు ఫుల్ క్రేజ్ ఉన్న దేశ జట్టును సారథిగా ముందుండి నడపడం పెద్ద సవాలే. ఇప్పటికదాకా చాలా మంది లెజెండ్స్ కెప్టెన్లుగా వ్యవహరించారు.

క్రికెట్​లో కెప్టెన్సీ అనేది అంత ఈజీ కాదు. అందులోనూ భారత్ లాంటి క్రికెట్​కు ఫుల్ క్రేజ్ ఉన్న దేశ జట్టును సారథిగా ముందుండి నడపడం పెద్ద సవాలే. ఇప్పటికదాకా చాలా మంది లెజెండ్స్ కెప్టెన్లుగా వ్యవహరించారు.

  • Author singhj Updated - 05:15 PM, Fri - 27 October 23
ధోని, దాదా కాదు.. వన్డేల్లో బెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మే.. ఇదిగో ప్రూఫ్​!

క్రికెట్​లో టీమిండియాకు ఘనమైన చరిత్ర ఉంది. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో ఎందరో గొప్ప క్రికెటర్లను ప్రపంచానికి అందజేసింది భారత్. కపిల్ దేవ్, గవాస్కర్ నుంచి సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వరకు చాలా మంది ప్లేయర్లు తమ అద్భుతమైన ఆటతీరుతో అభిమానులను అలరించారు. అయితే టీమిండియాకు బెస్ట్ కెప్టెన్ ఎవరనగానే అందరూ మహేంద్ర సింగ్ ధోని అనే అంటారు. సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీల పేర్ల ప్రస్తావన కూడా వస్తుంది. ఎందుకంటే దాదా కెప్టెన్సీలోనే మన టీమ్ 2003 వరల్డ్ కప్​లో ఫైనల్స్​కు చేరుకుంది. అతడి సారథ్యంలో బడా టీమ్స్​ను కూడా రెగ్యులర్​గా ఓడించడం అనేది అలవాటుగా మారింది.

గంగూలీ తర్వాత ధోని కెప్టెన్సీలో తన మార్క్ చూపించాడు. టీ20 ప్రపంచ కప్ సహా వన్డేల్లో వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీని కూడా టీమిండియాకు అందించాడు. జట్టును నంబర్ వన్ ర్యాంక్​కు చేర్చాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి ప్లేయర్లకు ఛాన్సులు ఇస్తూ వారు ఈ రేంజ్​కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ధోని తర్వాత కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కోహ్లీ కూడా టీమ్​పై తనదైన ముద్ర వేశాడు. జట్టుకు అటాకింగ్ గేమ్​ను అలవాటు చేశాడు. ఎన్నో మ్యాచుల్లో గెలిపించినా తన కెప్టెన్సీలో టీమ్​కు వరల్డ్ కప్ మాత్రం అందించలేకపోయాడు. విరాట్ తర్వాత కెప్టెన్​గా సెలెక్ట్ అయిన రోహిత్ శర్మ తన స్టైల్​లో దూసుకుపోతున్నాడు.

వన్డే వరల్డ్ కప్-2023లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరుస విజయాలతో సెమీస్ బెర్త్​ను దాదాపుగా ఖాయం చేసుకుంది. హిట్​మ్యాన్ సారథ్యంలో రీసెంట్​గా ఆసియా కప్​ను కూడా భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇలా టీమిండియాకు కెప్టెన్లుగా గంగూలీ, ధోని, కోహ్లీ, రోహిత్​లు ఈ రెండు దశాబ్దాల్లో ఎన్నో విక్టరీలు అందించారు. కానీ బెస్ట్ కెప్టెన్ ఎవరనగానే అందరూ ధోని పేరే చెబుతారు. కానీ భారత్ తరఫున అత్యుత్తమ సారథి రోహిత్ శర్మనే అని ఫ్యాన్స్ అంటున్నారు. దీనికి ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. ఇప్పటిదాకా కెప్టెన్​గా 99 మ్యాచులకు సారథ్యం వహించాడు హిట్​మ్యాన్. వీటిల్లో 73 మ్యాచుల్లో నెగ్గిన భారత్.. 23 మ్యాచుల్లో ఓడిపోయింది. రోహిత్ విన్నింగ్ పర్సంటేజీ 73.73 శాతంగా ఉంది. మరి.. ధోని, దాదా, రోహిత్​ల్లో ఎవరు బెస్ట్ కెప్టెన్ అని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: ఎప్పుడూ లేనిది తొలిసారి ధోని నుంచి ఎమోషనల్‌ కామెంట్స్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి