చరిత్ర సృష్టించిన చెన్నై సూపర్ కింగ్స్.. తొలి ఐపీఎల్ టీమ్​గా రికార్డు!

  • Author singhj Published - 01:45 PM, Fri - 18 August 23
  • Author singhj Published - 01:45 PM, Fri - 18 August 23
చరిత్ర సృష్టించిన చెన్నై సూపర్ కింగ్స్.. తొలి ఐపీఎల్ టీమ్​గా రికార్డు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో భారీ ఫ్యాన్​బేస్, క్రేజ్ కలిగిన ఫ్రాంచైజీల్లో ఒకటి చెన్నై సూపర్ కింగ్స్. ఈ జట్టుకు ఉన్న అభిమాన గణం వేరే లెవల్ అనే చెప్పాలి. చెన్నై టీమ్ ఆడుతోందంటే చాలు.. మొత్తం స్టేడియం పసుపుమయం కావాల్సిందే. హోమ్ గ్రౌండ్ లేదా ఇతర గ్రౌండ్.. వేదిక ఏదైనా చెన్నైకి అద్భుతమైన మద్దతు లభిస్తుంది. అందుకు ఆ ఫ్రాంచైజీ సాధించిన విజయాలు ఒక కారణమైతే.. మరో రీజన్ ఎంఎస్ ధోని. ఇప్పటివరకు ఐదుమార్లు ఐపీఎల్​లో ఛాంపియన్​గా నిలిచింది సీఎస్​కే. ఈ ఏడాది కూడా టైటిల్​ను ఎగరేసుకుపోయింది చెన్నై.

పెద్దగా స్టార్ ప్లేయర్లు లేని సీఎస్​కేపై ఈ సీజన్​లో ఎవరికీ నమ్మకం లేదు. ఆ టీమ్ ప్లేఆఫ్స్​కు చేరినా గొప్పేనని అంతా అనుకున్నారు. కానీ తనకు అందుబాటులో ఉన్న బ్యాటింగ్, బౌలింగ్ వనరులను సమర్థంగా వినియోగించుకున్న కెప్టెన్ ధోని మాయ చేశాడు. ఆటగాళ్లను భుజం తట్టి ప్రోత్సహించాడు. వారిలో ఉన్న అత్యుత్తమ ప్రతిభను వెలికితీయడంలో సక్సెస్ అయ్యాడు. చెన్నైకి మరో కప్​ను సాధించి పెట్టిన ధోని.. నెక్స్ట్ ఐపీఎల్​లో ఆడతాడో లేదో అనుమానంగా మారింది. మోకాలి గాయంతో బాధపడుతున్న మాహీ ఇటీవలే సర్జరీ చేయించుకొని, ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చరిత్ర సృష్టించింది. మరో అరుదైన ఘనతను తన పేరు మీద లిఖించుకుంది సీఎస్​కే. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ ఎక్స్​ (ట్విట్టర్)లో 10 మిలియన్ల ఫాలోవర్లను సాధించిన తొలి ఐపీఎల్​ జట్టుగా సీఎస్​కే నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా చెన్నై ఫ్రాంచైజీ ఎక్స్​ వేదికగా ఫ్యాన్స్​తో షేర్ చేసుకుంది. ఈ లిస్టులో మరో పాపులర్ టీమ్ ముంబై ఇండియన్స్ 8.2 మిలియన్ల ఫాలోవర్లతో సెకండ్ ప్లేసులో ఉంది. ముంబై తర్వాతి స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (6.8 మిలియన్లు), సన్​రైజర్స్ హైదరాబాద్ (3.2 మిలియన్లు) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

Show comments