iDreamPost
android-app
ios-app

రామ్‌ చరణ్‌కు కొత్త బిరుదు ఇచ్చిన ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు!

  • Published Aug 19, 2024 | 2:46 PM Updated Updated Aug 19, 2024 | 2:46 PM

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాపులారిటీ అంతా ఇంత కాదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు.

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాపులారిటీ అంతా ఇంత కాదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు.

  • Published Aug 19, 2024 | 2:46 PMUpdated Aug 19, 2024 | 2:46 PM
రామ్‌ చరణ్‌కు కొత్త బిరుదు ఇచ్చిన ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు!

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్. తన తండ్రి లాగే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ టైంలోనే వరుస హిట్లతో రికార్డులు సృష్టించిన రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ తో అభిమానులను సంపాదించుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా అభిమానుల మెప్పు పొందారు. రామ్ చరణ్ స్టైల్, ఆయన డ్యాన్స్ కి అయితే విపరీతమైన క్రేజ్ ఉంది.ఎంత కష్టమైన స్టెప్ ని కూడా ఈజీగా వెయ్యగలరు. ఆయన సినిమా నుంచి ఏదైనా సాంగ్ వచ్చిందంటే కచ్చితంగా అది చార్ట్ బస్టర్ అవ్వడం పక్కా.

ఇక రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్‌తో కలిసి నటించిన రామ్ చరణ్ ఈ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇందులో అల్లూరి సీతారామరాజు గెటప్‌లో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాతో గ్లోబల్ లెవెల్ లో గుర్తింపు పొందారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ అవార్డ్ వచ్చింది. దాంతో రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారు. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రామ్ చరణ్ తన భార్యతో కలిసి ఆస్ట్రేలియాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

మెల్‌బోర్న్‌లో ‘ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌’ ఈవెంట్ లో ఈ దంపతులు పాల్గొనడం జరిగింది.ఇందులో భాగంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి సేవలు అందించినందుకు గాను ‘ది అంబాసిడర్ ఫర్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్’ అవార్డును రామ్ చరణ్ అందుకున్నారు. ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ట్రోఫీని ప్రదర్శించింది. ఈ కప్‌తో రామ్ చరణ్ ఫోటోలు దిగారు. వీటిని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. రామ్ చరణ్కు శుభాకాంక్షలు తెలుపుతూ తెగ వైరల్ చేస్తున్నారు. దాంతో రామ్ చరణ్ ఎక్స్ లో ట్రెండ్ అవుతున్నారు.

అయితే అంతా బాగున్నా కానీ ఒక్క విషయంలో మాత్రం మన టాలీవుడ్ అభిమానులు డీప్ గా హర్ట్ అవుతున్నారు. దానికి కారణం క్రికెట్ ఆస్ట్రేలియా తన పోస్ట్‌లో చేసిన ఓ పొరపాటు. ఆ పోస్ట్ లో రామ్‌చరణ్‌ను బాలీవుడ్ మెగాస్టార్‌గా పేర్కొంది. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ స్టార్ట్ చేశారు. రామ్ చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో అని ఆయనను టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ లేదా గ్లోబల్ స్టార్ అని పిలుచుకుంటామని, ఇండియాలో బాలీవుడ్ ఒక్కటే సినిమా ఇండస్ట్రీ కాదని ఇంకా చాలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పోస్ట్ చేసేటప్పుడు వివరాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలని ట్రోల్ చేస్తున్నారు.మరి దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందిస్తుందో లేదో చూడాలి.

https://x.com/CricketAus/status/1825398873864724722

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş