IPL.. ప్రపంచ వ్యాప్తంగా ఈ టోర్నీకి ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ టోర్నీని చూసే వరల్డ్ వైడ్ గా ఎన్నో దేశాలు ఐపీఎల్ లాంటి టీ10, టీ20 టోర్నీలను ప్రారంభించాయి.ఇలాంటి చరిత్ర కలిగిన టోర్నీలో మనకంటూ ఓ టీమ్ ఉండాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. తాజాగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఏపీకి కూడా ఓ IPL జట్టు ఉండాలని, అందుకు సంబంధించిన విషయాలు చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ లో ఏపీకి కూడా జట్టు ఉండాలని అందుకు సంబంధించిన అంశాలను చూడాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. తాజాగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ..”ముందుగా ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో నిర్వహించే క్రీడలను ప్రతి సంవత్సరం నిర్వహించాలి. ఇందుకోసం ప్రతి మండలంలోనూ గ్రౌండ్స్ ను ఏర్పాటు చేయాలి. క్రీడాకారులకు క్రికెట్ కిట్లు అందించాలి. ఇక రాష్ట్రంలో మూడు క్రికెట్ గ్రౌండ్స్ ను శిక్షణ కార్యక్రమాల కోసం చెన్నై సూపర్ కింగ్స్ కు అప్పగించబోతున్నాం. భవిష్యతో లో ముంబై ఇండియ్స్ టీమ్ లాంటి జట్ల సహాయం కూడా తీసుకుంటాం” అని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఇక నియోజకవర్గానికో ఇండోర్ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తామని జగన్ తెలిపారు. ఇక ఇందుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అంబటి రాయుడు, కేఎస్ భరత్ లాంటి వారు రాష్ట్ర యువతకు ఆదర్శం. వీరి సహాయంతో ఏపీకి ఐపీఎల్ లో ఓ జట్టును ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇక సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాబోయే కాలంలో ఐపీఎల్ టోర్నీలో ఏపీ జట్టును చూడబోతున్నాం అంటున్నారు క్రీడా పండితులు.