భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద ఉన్న ఒక రికార్డును ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ బ్రేక్ చేశాడు. వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసి అందర్నీ ఆశ్చర్యపర్చాడు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద ఉన్న ఒక రికార్డును ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ బ్రేక్ చేశాడు. వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసి అందర్నీ ఆశ్చర్యపర్చాడు.
వన్డే వరల్డ్ కప్-2023లో ఆస్ట్రేలియా టీమ్ దూసుకెళ్తోంది. మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడి రేసులో వెనుకపడిన కమిన్స్ సేన.. ఆ తర్వాత స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చింది. హ్యాట్రిక్ విజయాలతో మళ్లీ రేసులోకి వచ్చేసింది ఆసీస్. సెమీఫైనల్ బెర్త్ టార్గెట్‌గా పెట్టుకొని అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది కంగారూ జట్టు. దూకుడు మంత్రాన్ని పాటిస్తూ ఎదురొచ్చిన టీమ్స్‌ను చిత్తుగా ఓడిస్తోంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతోంది. ధర్మశాల వేదికగా కివీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది.
ట్రావిస్ హెడ్ (67 బంతుల్లో 109), డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81) ఆస్ట్రేలియాకు అదిరిపోయే స్టార్ట్‌ను అందించారు. ముఖ్యంగా హెడ్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. దీన్ని బట్టే హెడ్ బ్యాటింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వార్నర్‌తో కలసి ఫస్ట్ వికెట్‌కు అతడు ఏకంగా 175 రన్స్ జోడించాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీదున్న ఒక రికార్డును హెడ్ బ్రేక్ చేశాడు. మొత్తంగా 109 రన్స్ చేసిన ట్రావిస్.. 59 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. దీంతో ఓ అరుదైన ఘనతను తన అకౌంట్లో వేసుకున్నాడు. వరల్డ్ కప్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు హెడ్.
ప్రపంచ కప్‌లో వేగవంతమైన సెంచరీ బాదిన రికార్డు రోహిత్ శర్మ పేరు మీద ఉండేది. ఈ సంవత్సరం వరల్డ్ కప్‌లో ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 63 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ 59 బంతుల్లోనే ఆ ఫీట్‌ను చేరుకొని చరిత్ర సృష్టించాడు. ఇక, వార్నర్, హెడ్‌తో పాటు మిచెల్ మార్ష్ (36), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (41), జోష్ ఇంగ్లిస్ (38), ప్యాట్ కమిన్స్ (37) కూడా రాణించడంతో కివీస్ ముందు 388 రన్స్ టార్గెట్‌ను ఉంచింది ఆసీస్. ఛేజింగ్‌కు దిగిన న్యూజిలాండ్ కూడా బాగానే ఆడుతోంది. ఆ టీమ్ ప్రస్తుతానికి 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 126 రన్స్ చేసింది. రచిన్ రవీంద్ర (21 నాటౌట్), డారిల్ మిచెల్ (34 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మరి.. ట్రావిస్ హెడ్ ఫాస్టెస్ట్ సెంచరీపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
HISTORIC:
Travis Head becomes the fastest to score a century on a World Cup debut. pic.twitter.com/Qkz8S5zgFc
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 28, 2023