Satyabhama Movie Review: సత్యభామ రివ్యూ… పోలీసాఫీసర్ పాత్రలో చందమామ మెప్పించిందా..?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తెలుగులో తొలిసారిగా నటించిన ఉమెన్ ఓరియెంట్ మూవీ సత్యభామ. జూన్ 7 నుండి థియేటర్లలో సందడి చేస్తుంది. మరీ కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూ చదివేయండి.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తెలుగులో తొలిసారిగా నటించిన ఉమెన్ ఓరియెంట్ మూవీ సత్యభామ. జూన్ 7 నుండి థియేటర్లలో సందడి చేస్తుంది. మరీ కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూ చదివేయండి.

సత్యభామ

07-06-2024, Crime, U/A Certificate
థియేటర్స్ లో
  • నటినటులు:కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, అనిరుథ్‌ పవిత్రన్‌, సంపద, సత్య ప్రదీప్త, హర్షవర్థన్‌, రవివర్మ తదితరులు
  • దర్శకత్వం:సుమన్ చిక్కాల
  • నిర్మాత:శశి కిరణ్ తిక్క, బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కెళ్లపల్లి
  • సంగీతం:శ్రీ చరణ్ పాకాల
  • సినిమాటోగ్రఫీ:బి విష్ణు

Rating

2.5/5

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో రిస్క్ చేయడం ఎందుకని పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా పోస్టు పోన్ అయ్యాయి. అందులో ఒకటి సత్యభామ. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ చేసిన మూవీ ఇది. తెలుగులో చాలా గ్యాప్ తర్వాత గత ఏడాది భగవంత్ కేసరితో పలకరించిన అమ్మడు.. ఇప్పుడు సత్యభామ అంటూ పవర్ ఫుల్ లేడీ పోలీసాఫీసర్ పాత్రలో మెరవబోతుంది. ఇందులో నవీన్ చంద్ర హీరో. ప్రకాష్ రాజ్, నాగనీడు, హర్షవర్థన్, రవి వర్మ, అనిరుథ్‌ పవిత్రన్‌, సంపద కీలక పాత్రలు పోషించారు. సుమన్ చిక్కాల దర్శకుడు. ఇటీవల కాలంలో హీరోయిన్లు లేడీ ఓరియెంట్ చిత్రాలతో సక్సెస్ అందుకుంటున్నారు..  కాజల్ తొలిసారిగా ఆ జోనర్‌లోకి ఎంటరయ్యింది. ఆమె ఏ మేరకు మెప్పించిందో? ఆమె ఖాతాలో హిట్ పడిందా లేదా ఈ రివ్యూలో చూద్దాం.

కథ

సత్య అలియాస్ సత్యభామ (కాజల్ అగర్వాల్) షీ టీమ్ డిపార్ట్ మెంట్‌లో ఏసీపీగా పనిచేస్తుంది. అమ్మాయిలను ఇబ్బంది కలిగించే పోకిరీ పని పడుతుంది. ఒక కేసు ముట్టుకుందంటే.. అంత సులువుగా వదిలిపెట్టని నైజం ఆమెది. అంతేకాదు షీ సేఫ్ యాప్ ఎలా ఉపయోగించాలో అవగాహన కల్పిస్తూ.. మహిళలకు ఏదీ జరిగిన షీ టీమ్ ఉందన్న ధైర్యాన్ని కల్పిస్తుంది. రచయిత అమరేందర్ (నవీన్ చంద్ర)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. వ్యక్తిగత జీవితాని కన్నా, వృత్తికే అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఉంటుంది. ఓ సారి హసీనా అనే యువతి.. తన భర్త యాదు (అనిరుధ్ పవిత్రన్) చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని సత్యభామను ఆశ్రయిస్తుంది. సత్య.. తాను చూసుకుంటానని హసీనాకు ధైర్యం చెప్పి.. భర్తకు వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపించేస్తుంది. కానీ ఆమె భర్త యాదు చేతిలో హతమవుతుంది. అతడు పారిపోతాడు. అతడ్ని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎదురయ్యే పరిణామాలే మిగిలిన కథ.

విశ్లేషణ :

సత్యభామ ఓ క్రైమ్ థ్రిల్లర్. ఇలాంటి కథలు ఇటీవల కాలంలో తరచుగా వస్తున్నాయి. ట్విస్టులు, టర్నింగ్ పాయింట్లే ఈ సినిమాకు కీలకం. ఈ మూవీ కూడా అలాగే తెరకెక్కించాడు దర్శకుడు. హత్య చేయడం.. ఎలాంటి ఆధారాలు లభించకుండా పోలీసుల్ని మిస్ గైడ్ చేయడం.. అంతలో ఈ హత్య ఎవరు చేసారు అనే కోణంలో విచారణ చేపట్టడం.. నిజాలు ఒక్కొక్కటిగా రివీల్ కావడం కథకి కీలకం. అయితే ఈ సినిమాలో హసీనాను భర్త యాదు చేశాడని ముందే తెలిసిపోతుంది. అతడ్ని వెతికి పట్టుకునే పని. ఇ ది ఓ చేజింగ్ ప్టోరీ. అదే ఇంటెన్సివ్ క్రియేట్ చేస్తుంది. కథ సస్పెన్స్‌తో పాటు ఎమోషనల్‌గా సాగడంతో కొత్తగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు చాలా రోటీన్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కో చోట కథ నెమ్మదిగా సాగుతుందన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఈ హత్య కేసు చేధించే క్రమంలో ఇంకొన్ని కొత్త కథలు వస్తుంటాయి.. కేసును పక్కదారి పట్టిస్తూ ఉంటాయి.

ఎవరెలా చేశారంటే..

ఇప్పటి వరకు గ్లామరస్ పాత్రలో మెరిసిన టాలీవుడ్ చందమామ.. తెలుగులో తొలిసారిగా పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించింది. సత్యభామ పేరుకు తగ్గట్లుగానే ఆమె పాత్రను తీర్చిదిద్దాడు దర్శకుడు. ఫైటింగ్స్, విలన్స్ ఛేజింగ్ సీన్లలో అదరగొట్టింది. సినిమా మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుంది. సినిమా మొత్తం ఆమె భుజాన వేసుకుని నడిపించిందని చెప్పొచ్చు. ఇందులో ఆమె భర్తగా నవీన్ చంద్ర నటించాడు. ఆయన ఇచ్చిన పాత్ర మేరకు మెప్పించాడు. ఇందులో కొన్ని టెక్నీకల్ యాక్సెప్ట్ మైనస్ అయ్యాయి. ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, నాగినీడు తెరపై ఉన్నంత సేపు బాగానే నటించారు. ఇక ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల అందించిన మ్యూజిక్ మంచిగా సెట్ అయ్యింది. కొన్ని కొన్ని డైలాగులు దర్శకుడు ప్రతిభను కొనియాడకుండా ఉండలేదు.

బలాలు

కాజల్ నటన

కొన్ని ట్విస్టులు

బలహీనతలు..

ద్వితీయార్థంలో వచ్చే కొన్ని సన్నివేశాలు

నెమ్మదిగా సాగే కథనం

చివరి మాట: సత్యభామ.. వన్ టైం వాచబుల్

(గమనిక): ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

 

 

Show comments