iDreamPost

OTTలోకి కాజల్ కొత్త సినిమా.. ఎప్పుడంటే?

  • Published Jun 26, 2024 | 10:50 AMUpdated Jun 26, 2024 | 10:50 AM

ఇటీవలే టాలీవుడ్ చందమామ కాజల్ ఆగర్వాల్ సత్యభామ అనే లేడి ఓరియెంటెడ్ మూవీలో నటించింది. ఇక ఈ మూవీ థియేటర్లలో కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా డిసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ సత్యభామ మూవీని భారీ హక్కులకు కొనుగోలు చేసుకుంది. అలాగే ఈ మూవీ త్వరలనే ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ రాబోతుంది.

ఇటీవలే టాలీవుడ్ చందమామ కాజల్ ఆగర్వాల్ సత్యభామ అనే లేడి ఓరియెంటెడ్ మూవీలో నటించింది. ఇక ఈ మూవీ థియేటర్లలో కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా డిసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ సత్యభామ మూవీని భారీ హక్కులకు కొనుగోలు చేసుకుంది. అలాగే ఈ మూవీ త్వరలనే ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ రాబోతుంది.

  • Published Jun 26, 2024 | 10:50 AMUpdated Jun 26, 2024 | 10:50 AM
OTTలోకి కాజల్ కొత్త  సినిమా.. ఎప్పుడంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘కాజల్ అగర్వాల్’ ఇటీవలే లేడి ఓరియెంటెడ్ మూవీ ‘సత్యభామ’లో నటించిన విషయం తెలిసిందే. కాగా, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ చిత్రాన్ని సుమన్ చిక్కాల తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ఈనెల అనగా జూన్ 7వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఇందులో కాజల్ మొదటిసారిగా పవర్‌ఫుల్‌ పోలీసు పాత్రలో అలరించింది. ఇకపోతే సత్యభామ మూవీ విడుదలైన తొలి రోజు నుంచే మంచి డీసెంట్ టాక్ తెచ్చుకుంది. కానీ, ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో థియేటర్లలో అంతగా అలరించ లేకపోయింది. దీంతో ఓపెనింగ్స్ తక్కువగానే తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత కూడా పెద్దగా కలెక్షన్స్ ను రాబట్టుకోలేక విజయాన్ని అందుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సినిమా కమర్షియల్ గా అలరించలేకపోయినా క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో ఈ మూవీపై విపరీతమైన హైప్ పెరిగిపోయింది.దీంతో ఈ మూవీని ఓటీటీ హక్కులు కొనుగోలుకు పోటీ ఏర్పడింది.

ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కు ఈ మూవీని కొనుగోలు చేసుకుంది. అయితే తాజాగా ఈ మూవీ త్వరలో ఆ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ విడుదలకు సిద్ధంగా ఉందని టాక్ వినిపిస్తుంది. ఇంతకి ఎప్పుడంటే.. కాజల్ సత్యభామ మూవీ కమర్షియల్ హిట్ అవ్వకపోయిన డిసెంట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాను భారీ డిజిటల్ హక్కులతో ఆహా సంస్థ కొనుగోలు చేసుకున్నట్లు సమాచారం వినిపిస్తోంది. అయితే సత్యభామ సినిమా థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా సత్యభామ చిత్రం ఈనెల అనగా జూన్ 28వ తేదీ నుంచే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమచారం తెలిసింది.

అయితే అనుకున్నా సమయం కంటే ముందుగానే కాజల్ సత్యభామ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉందని టాక్ జోరుగా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక జరిగే ఓటీటీ ప్రియులకు మరో కొత్త సినిమా రాకతో పండగ అనే చెప్పవచ్చు. కానీ ఈ విషయం పై ఇంక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, మరో రెండు రోజుల్లో సత్యభామ మూవీ అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.ఇదిలా ఉంటే.. సత్యభామ సినిమాలో నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్, నాగనీడు, హర్షవర్ధన్, రవి వర్మ తదితరులు నటించారు.ఇకపోతే ఈ సినిమాలో శ్రీనివాసరావు టక్కళ్లపల్లి, బాబీ తిక్క నిర్మించారు.అలాగే శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందిచారు.

ఇక సత్యభామ కథ విషయానికొస్తే.. కాజల్ అగర్వాల్ ఒక షీ టీమ్ లో ఏసీపీగా పనిచేస్తుంటుంది. ఇక ఈ క్రమంలోనే.. హసీనా అనే యువతిని కేసును చేధించే పనిలో కాజల్ ఆగర్వాల్ ఉంటుంది. అయితే ఆ యువతిని ఆమె భర్త యాదు దారుణంగా హత్య చేస్తాడు. ఇక ఆ మర్డర్ తర్వాత యాదు తో పాటు తన తమ్ముడు ఇక్బల్ కూడా కనిపించకుండా పోతాడు. అయితే ఈ మిస్టరీ కేసును ఛేదించే క్రమంలో కాజల్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయి? అసలు హసీనా ఎలా చనిపోయింది? కాజల్ ఈ కేసును ఎలా సాల్వ్ చేసింది ? ఈ విషయాలన్నింటికి సమాధానం తెలియాలంటే ఓటీటీలో కాజల్ సత్యభామ మూవీ చూసేయాల్సిందే. మరి త్వరలో ఓటీటీలో సత్యభామ మూవీ వస్తుందనే టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి