iDreamPost
android-app
ios-app

చందమామ మూవీలోని ఈ రౌడీ రాణి గుర్తుందా..? ఇప్పుడెందుకు కనిపించడం లేదంటే..?

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ హిట్ చిత్రాల్లో ఒకటి చందమామ. ఇందులో నవదీప్, కాజల్ అగర్వాల్, శివబాలాజీ, సింధు మీనన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ నలుగురిలో రౌడీ బేబీగా మెప్పించింది సింధు.. ఇప్పుడు ఆమె ఇప్పుడెందుకు కనిపించడం లేదంటే.?

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ హిట్ చిత్రాల్లో ఒకటి చందమామ. ఇందులో నవదీప్, కాజల్ అగర్వాల్, శివబాలాజీ, సింధు మీనన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ నలుగురిలో రౌడీ బేబీగా మెప్పించింది సింధు.. ఇప్పుడు ఆమె ఇప్పుడెందుకు కనిపించడం లేదంటే.?

చందమామ మూవీలోని ఈ రౌడీ రాణి గుర్తుందా..? ఇప్పుడెందుకు కనిపించడం లేదంటే..?

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చిత్రాల్లో హీరోయిజం కన్నా.. హీరోయిన్ ఎలివేషన్ స్పెషల్‌గా ఉంటుంది. నటిని గ్లామరస్ డాల్‌గా చూపిస్తూనే.. సివంగిలా, ఆడపులిలా క్యారెక్టర్ డిజైనింగ్ ఉంటుంది. డేరింగ్ అండా డాషింగ్ గర్ల్స్‌గా చూపిస్తుంటాడు ఈ వర్సటైల్ దర్శకుడు. అటువంటి చిత్రాల్లో ఒకటి చందమామ. నవదీప్, కాజల్ అగర్వాల్, శివబాలాజీ, సింధు మీనన్ హీరో హీరోయిన్లు. ఇందులో కాజు పాప సాఫ్ట్‌ పాత్రను పోషిస్తే, ఆమె చెల్లి సింధుమీనన్‌ను పల్లెటూరి అమ్మాయిగా.. గడుసు పిల్లగా చూపించాడు కృష్ణవంశీ. ఇందులో రాణి పాత్రలో మెరిసింది సింధు. అప్పటికే తెలుగులో పలు చిత్రాల్లో స్లో అండ్ సాఫ్ట్ రోల్ చేసిన సింధు మీనన్.. ఇందులో రౌడీ పిల్లగా మెప్పించింది. చెప్పాలంటే యాక్టింగ్‌కు ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇదే అనిపిస్తుంది. లంగా వోణిలో ఆకట్టుకున్న ఈ చిన్నది కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని క్విట్ అయ్యింది. ఇప్పుడు ఆ బ్యూటీ ఏం చేస్తుందంటే..?

సింధు మీనన్.. బెంగళూరులో మలయాళ ఫ్యామిలీలో పుట్టింది. చిన్నప్పటి నుండే భరత నాట్యం డ్యాన్సర్ కావడంతో ఓ కాంపిటీషన్‌లో పాల్లొనగా.. విన్నర్ అయ్యింది. అలా కన్నడ దర్శకుడి కళ్లల్లో పడి.. చైల్డ్ ఆర్టిస్టుగా రెండు చిత్రాల్లో నటించింది. కాస్త గ్యాప్ తీసుకుని హీరోయిన్ అయ్యింది. శ్రీహరి హీరోగా వచ్చిన భద్రాచలం మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. చక్కనైన మోము, ఒద్దికగా ఉండే ఆమె నటనతో మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత త్రినేత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో, దెయ్యంగా నటించింది. శ్రీరామ చంద్రులు, ఇన్ స్పెక్టర్, ఆడంతే అదే టైప్ చిత్రాల్లో మెరిసింది. అలాగే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలను చుట్టేసింది. వరుస సినిమాలతో ఏడాదికి 3 నుండి ఐదు సినిమాల వరకు చేసింది.

తెలుగులో నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని చందమామతో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. ఈసారి డిఫరెంట్ రోల్‌తో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఈ మూవీతో ఆమె తెలుగులో ఫుల్ బిజీ అయిపోతుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కేవలం ఒక్కటంటే ఒక్కటే తెలుగు సినిమా చేసింది. అదే జగపతి బాబు హీరోగా వచ్చిన సిద్ధం. ఆమె నటించిన చివరి సినిమా ఈరం. తెలుగులో వైశాలి అనే పేరుతో ఆకట్టుకుంది. ఇందులో ఆమె క్యారెక్టర్ మధ్యలోనే ముగిసిపోతుంది కానీ.. స్టోరీ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. మంజదికూరు అనే మలయాళ చిత్రం సింధు పెళ్లి తర్వాత రిలీజైంది. 2010లో తమిళనాడుకు చెందిన ఐటీని వివాహం చేసుకుంది. అప్పటి నుండి సినిమాలకు దూరం అయ్యింది. ఆమెకు ఓ కూతురు, ఇద్దరు కుమారులున్నారు.  సోషల్ మీడియాలో వారి ఫోటోలను అప్పుడప్పుడు పంచుకుంటూ ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Sindhu Menon Kathikeyan (@sindhu_menon17)