Krishna Kowshik
భర్త కొడితే పడి ఉండాలి అన్న పాత చింతకాయ పచ్చడి ధోరణికీ మంగళం పాడుతున్నారు మగువలు. ఈ ఇతి వృత్తాన్నే తీసుకుని సరికొత్త కథలను తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. అలాంటి ఫ్యామిలీ రివేంజ్ డ్రామా ఓటీటీలో ఉంది చూసేయండి.
భర్త కొడితే పడి ఉండాలి అన్న పాత చింతకాయ పచ్చడి ధోరణికీ మంగళం పాడుతున్నారు మగువలు. ఈ ఇతి వృత్తాన్నే తీసుకుని సరికొత్త కథలను తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. అలాంటి ఫ్యామిలీ రివేంజ్ డ్రామా ఓటీటీలో ఉంది చూసేయండి.
Krishna Kowshik
ఈ మధ్య కాలంలో వైఫ్ అండ్ హస్బెండ్ రివేంజ్ డ్రామాలను తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. మూడు ముళ్లు వేయగానే.. తన ఇంటిని, ఇంటి పేరును వదిలేసి.. భర్తే సర్వస్వంగా భావించి వచ్చే అమ్మాయిని దేవతలా చూసుకోవాల్సిన భర్త.. చిత్ర హింసలకు గురి చేస్తుంటాడు. తొలుత బాధను తట్టుకునే భార్య.. ఆ తర్వాత అతడికి బుద్ది చెబుతుంది. మలయాళంలో ఇటీవల వచ్చిన జయ జయ జయ జయ హేతో పాటు హిందీలో డార్లింగ్స్ అనే మూవీ కూడా ఈ కోవ కిందకు వస్తుంది. ఇందులో అలియా భట్, విజయ్ వర్మ వంటి స్టార్స్ నటించారు. ఇప్పుడు అలాంటి ఓ సినిమా తెలుగులో కూడా వచ్చి ఆకట్టుకుంది. ఇలాంటి ఫ్యామిలీ డ్రామా థిల్లర్ మీరు మిస్ అయ్యింటే.. ఓటీటీలో సందడి చేస్తుంది వాచ్ చేయండి.
ఇటీవల వరుస పెట్టి వెబ్ సిరీస్, సినిమాలు చేసి హిట్ కొడుతున్నాడు నవీన్ చంద్ర. హీరోగా, విలన్‌గా డ్యూయల్ క్యారెక్టర్స్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. అతడు ఈ రెండు క్యారెక్టర్స్ కలిపి నటించిన సినిమానే అమ్ము. 2022లో డైరెక్టుగా ఓటీటీలో రిలీజయ్యి ఆకట్టుకుంది. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మించారు. కల్యాణ్ సుబ్రహ్మణ్యం, కార్తికేయ సంతానంతో కలిసి ఈ మూవీ రూపొందించాడు. చారుకేష్ శేఖర్ దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర, ఐశ్వర్య లక్ష్మి, బాబీ సింహ ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక కథ విషయానికి వస్తే..
రవిచంద్ర అలియాస్ రవి (నవీన్ చంద్ర) పోలీస్ ఆఫీసర్. అతడికి పొరుగింటి ఆముద అలియాస్ అమ్ము (ఐశ్వర్య లక్ష్మి)తో వివాహం జరుగుతుంది. కొన్నాళ్ల పాటు వాళ్ల కాపురం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వెలిగిపోతుంది. మెల్లిగా రవిలో మార్పులు చోటుచేసుకుంటాయి. రవి కోపిష్టితనం, మాట దురుసుతనం వల్ల భార్యా భర్తలకు మధ్య గొడవలు జరుగుతుంటాయి. దీంతో అమ్ముపై చేయి చేసుకుంటాడు. వెంటనే ఆమెకు సర్దిచెప్పి.. నువ్వంటే నాకిష్టం అని చెప్పి సారీ చెబుతాడు. ఇలా పలుమార్లు రిపీట్ అవుతుంది. తల్లికి కూడా భర్త కొట్టాడని విషయం చెప్పగానే.. ఆమె నీకు నచ్చినది చేయి అని చెబుతుంది. దీంతో భర్తకు బుద్ది చెప్పాలని భావిస్తుంది అమ్ము. భర్తకు బుద్ధిచెప్పేందుకు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న అమ్ముకు ప్రభుదాస్‌తో (బాబీ సింహ) పరిచయం ఏర్పడుతుంది. ప్రభుదాస్ ఎవరు? అమ్ముకు అతడు ఏ విధంగా సహాయపడ్డాడు? తన భర్తకు గుణపాఠం చెప్పిందా లేదా ? అనేది మిగిలిన కథ.