iDreamPost
android-app
ios-app

నవీన్ చంద్ర చేతుల మీదగా ‘యముడు’ టీజర్.. ఆకట్టుకునే విజువల్స్, ఆర్ఆర్

  • Published May 29, 2025 | 4:44 PM Updated Updated May 29, 2025 | 4:44 PM

జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’.నవీన్ చంద్ర చేతుల మీదగా ‘యముడు’ టీజర్ ను రిలీజ్ చేశారు.ఇది వరకే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ జనాల్లో క్యూరియాసిటీని పెంచేసింది.

జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’.నవీన్ చంద్ర చేతుల మీదగా ‘యముడు’ టీజర్ ను రిలీజ్ చేశారు.ఇది వరకే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ జనాల్లో క్యూరియాసిటీని పెంచేసింది.

  • Published May 29, 2025 | 4:44 PMUpdated May 29, 2025 | 4:44 PM
నవీన్ చంద్ర చేతుల మీదగా ‘యముడు’ టీజర్..  ఆకట్టుకునే విజువల్స్, ఆర్ఆర్

రెగ్యులర్ కమర్షియల్, లవ్, యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇలాంటి ట్రెండ్‌లోనే ప్రస్తుతం ఓ మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రం రాబోతోంది. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’. ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది వరకే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ జనాల్లో క్యూరియాసిటీని పెంచేసింది.

తాజాగా ‘యముడు’ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. గురువారం నాడు ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ హీరో నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. టీజర్‌ను చూసిన అనంతరం చిత్రయూనిట్‌ను అభినందించారు. ఇక ఈ టీజర్‌ను గమనిస్తే ఇదొక మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీ అని అర్థం అవుతుంది. సిటీలో ఉన్న అమ్మాయిలు మిస్ అవుతుండటం, నాటకాల్లో యముడు వేషం వేసే వ్యక్తికి ఈ హత్యలకు సంబంధం ఉందేమో అన్నట్టుగా టీజర్‌ను కట్ చేశారు. యముడు భూలోకంకి వచ్చి నరకంలో విధించే శిక్షలన్నీ ఇక్కడే విధిస్తాడేమో అన్నట్టుగా కనిపిస్తోంది.

‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం’ అనే డైలాగ్ చూస్తుంటే, ఈ సినిమా హిందూ ధర్మాన్ని ఆధారంగా చేసుకుని కొత్త దృక్పథాన్ని చూపించబోతుందన్న ఆసక్తి కలుగుతుంది. హిందు ధర్మం నుంచి ఓ కొత్త పాయింట్‌తో ఆసక్తికరంగా సినిమాను మల్చినట్టు అనిపిస్తుంది. టీజర్‌లో విష్ణు రెడ్డి వంగా కెమెరా వర్క్, భవాని రాకేష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ప్రభావవంతంగా అనిపించింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్లను మేకర్లు ప్రకటించనున్నారు.

నటీనటులు : జగదీష్ ఆమంచి, శ్రావణి శెట్టి, ఆకాశ్ చల్లా తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : జగన్నాధ పిక్చర్స్
కథ, దర్శకుడు, నిర్మాత : జగదీష్ ఆమంచి
రైటర్ : హరి అల్లసాని, జగదీష్ ఆమంచి
స్క్రీన్ ప్లే : శివ కుండ్రపు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రజిని ఆమంచి
ఎడిటర్ : కెసిబి హరి
డిఓపి : విష్ణు రెడ్డి వంగా
సంగీతం : భవాని రాకేష్
పీఆర్వో : సాయి సతీష్