iDreamPost
android-app
ios-app

బిజినెస్ మ్యాన్ చిత్రంలో కాజల్ ఫ్రెండ్‌గా నటించిన ఈ యాక్టర్.. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే.?

  • Published Sep 11, 2024 | 7:00 AM Updated Updated Sep 11, 2024 | 7:00 AM

పోకిరీ తర్వాత మహేష్ బాబు- పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన చిత్రం బిజినెస్ మ్యాన్. ఈ చిత్రంలో కాజల్ ఫ్రెండ్‌గా నటించిన ఈ యాక్టర్ గుర్తుందా.. రింగు రింగుల జుట్టుతో ఆకట్టుకున్న భామ ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

పోకిరీ తర్వాత మహేష్ బాబు- పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన చిత్రం బిజినెస్ మ్యాన్. ఈ చిత్రంలో కాజల్ ఫ్రెండ్‌గా నటించిన ఈ యాక్టర్ గుర్తుందా.. రింగు రింగుల జుట్టుతో ఆకట్టుకున్న భామ ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

  • Published Sep 11, 2024 | 7:00 AMUpdated Sep 11, 2024 | 7:00 AM
బిజినెస్ మ్యాన్ చిత్రంలో కాజల్ ఫ్రెండ్‌గా నటించిన ఈ యాక్టర్.. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే.?

పోకిరీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ బాబు- పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన చిత్రం బిజినెస్ మ్యాన్. 2012లో సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం.. వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి.. ఆ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ నటన ఈ సినిమాకు హైప్ తెచ్చింది. ఇందులో డైలాగ్స్ కూడా పటాసుల్లా పేలుతుంటాయి. డిఫరెంట్ స్టైల్ అండ్ లుక్స్‌లో కనిపిస్తాడు మహేష్. ఆయన సరసన కాజల్ అగర్వాల్ నటించింది. చిత్రగా ఆకట్టుకుంది. ఇక ఇందులో ఆమె స్నేహితురాలు ఆయేషా పాత్రలో మెప్పించిన యాక్ట్రెస్ గుర్తుందా..? రింగుల రింగుల జుట్టుతో వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ, ఫ్లూటిస్టుగా ఆకట్టుకుంది. మహేష్, కాజల్, ఈ మధ్య ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇంతకు ఆమె ఎవరంటే..?

కాజల్ అగర్వాల్ స్నేహితురాలిగా నటించిన ఆ నటి పేరు అయేషా శివ. కెనడాలో పుట్టిన అయేషా శివ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్‌గా మారింది. ఆమె హీరోయిన్ మాత్రమే కాదు.. నిర్మాత కూడా. లాక్ట్ అవుట్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. బ్లోండ్ అండ్ బ్లాండర్, బిజినెస్‌మెన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే స్టార్‌గేట్: అట్లానిస్, కాప్రికా వంటి టీవీ సిరీస్‌లలో, గ్రీన్ స్ట్రీట్ హూలిగాన్స్ 2, డా. డోలిటిల్: మిలియన్ డాలర్ మట్స్ వంటి వీడియోలలో కూడా కనిపించింది. 2017లో వచ్చిన మాత్ర్ సినిమాతో ఆమె నిర్మాతగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్‌గా రాణిస్తుంది. ఎరిక్ మారన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని విదేశాల్లో స్థిరపడింది. తాజాగా ఈ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ మధ్య బేబీ షోవర్ పిక్స్ షేర్ చేసుకుంది ఈ బ్యూటీ.

బిజినెస్ సినిమాలో అయేషా శివ డైలాగ్స్ ఫేమస్ అయ్యాయి. మహేష్ బాబు.. కాజల్, అయేషాలకు తాను రిచ్ పర్సన్ కాదు అంటూ నిజం చెబుతాడు.. అప్పుడు ఈమె ‘మీరు రిచ్ కిడ్ కాదా’ అనగానే కాదు.. రోడ్ సైడ్ కిడ్ అంటూ కౌంటరివ్వగానే నేలమీద డమాల్ అని పడిపోతుంది. మరికొన్ని సన్నివేశాల్లో నవ్వించింది ఈ భామ. సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉండే ఆమె.. గత ఏడాది బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ అయినప్పుడు తన సీన్స్ సోషల్ మీడియాలో పంచుకుని మురిసిపోయింది. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. గుంటూరు కారంతో హిట్ అందుకున్న ఈ అందగాడు.. రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. త్వరలో ఈ సినిమా టైటిల్ అనౌన్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ayesha Shiva (@ayeshashiva)

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet