చంద్రబాబు ఇల్లు ఉండే వార్డు కూడా వైసీపీ ఖాతాలో! కుప్పం ఇక వైసీపీ అడ్డా!

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన పంచాయతీ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ ఘన విజయం సాధించింది. రానున్న 2024 ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తోందని చెప్పడానికి ఈ ఫలితాలే నిదర్శం అంటున్నారు వైసీపీ నేతలు. ఇక కుప్పంలో అధికార పార్టీ భారీ మెజారిటీ సాధించడంతో వైసీపీ నేతలు మరింత ఎక్కువ సంబరపడుతున్నారు. చంద్రబాబు కంచుకోట కుప్పంలో వైసీపీ సాధించిన ఈ భారీ విజయం.. రానున్న ఎన్నికల ఫలితాలపై అధిక ప్రభావం చూపుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆఖరికి చంద్రబాబు ఇల్లు ఉండే వార్డులో కూడా వైసీపీ గెలిచింది అంటే.. అక్కడ ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇక రాష్ట్రంలో పంచాయితీ ఉప ఎన్నికల్లో భాగంగా 66 గ్రామాల సర్పంచ్ పదవులకు గాను 64 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో 30 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమై.. వైసీపీ మద్దతుదారులకు దక్కాయి. మిగిలిన 34 సర్పంచ్ స్థానాల్లో.. ఏకంగా 23 చోట్ల వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో భాగంగా చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో కూడా ఆరు వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు చూసి టీడీపీ నేతలు తెల్ల మొహం వేస్తున్నారు. ఎందుంటే కుప్పంలోని 6 వార్డుల్లో.. వైసీపీ మద్దతుదారులు.. ఏకంగా ఐదు చోట్ల విజం సాధించారు. కేవలం ఒకే ఒక్క స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలిచారు.

ఇక కుప్పంలో టీడీపీ పరిస్థితి ఎంతలా దిగజారిపోయింది అంటే.. ఆఖరికి చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్న వార్డులో కూడా వైసీపీ మద్దతుదారు గెలుపొందారంటే.. టీడీపీ అధ్యక్షుడి కంచుకోటలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ఈ ఫలితాలపై వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సేమ్‌ ఇదే రిజల్ట్‌ రిపీట్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, జనసేన.. ఎందరూ కలిసి వచ్చినా.. గెలిచేది జగనే అంటున్నారు.

అసలు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో క్లీన్‌ స్వీప్‌ చేసి.. దాన్ని వైసీపీ అడ్డగా మార్చుకుంటామని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ సీఎం అయ్యాక కుప్పంలో పర్యటించడం.. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం వంటి సంఘటనలతో.. కుప్పంలో వైసీపీకి కలిసి వచ్చింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇవన్ని చూస్తే.. రానున్న ఎన్నికల్లో కుప్పం వైసీపీ అడ్డాగా మారడం పక్కా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Show comments