APలో ఒకలా.. తెలంగాణలో మరోలా.. పవన్‌ తీరుపై కార్యకర్తల అసహనం

పొత్తుల అంశంలో పవన్‌ కళ్యాణ్‌ తీరుపై సామాన్యులు మాత్రమే కాక.. చివరకు ఆ పార్టీ కార్యకర్తల కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ నిర్ణయాల వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదంటున్నారు. ఎందుకంటే..

పొత్తుల అంశంలో పవన్‌ కళ్యాణ్‌ తీరుపై సామాన్యులు మాత్రమే కాక.. చివరకు ఆ పార్టీ కార్యకర్తల కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ నిర్ణయాల వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదంటున్నారు. ఎందుకంటే..

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడే కాక ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలన్ని ఎన్నికల కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. అయితే తెలంగాణ ఎన్నికల సమరంలో కాషాయ పార్టీ కాస్త వెనకబడిందని చెప్పవచ్చు. ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థుల లిస్ట్‌ వెలువడలేదు. ప్రచార కార్యక్రమాలు ప్రారంభించలేదు. పొత్తుల అంశమే ఈ రోజు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకైతే.. తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఉంటుందని క్లారిటీ వచ్చింది. అయితే బీజేపీతో పొత్తు నేపథ్యంలో.. పవన్‌ తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారంట. అసలు పవన్‌ తీసుకునే నిర్ణయాల పట్ల కనీసం తనకైనా క్లారిటీ ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నారని టాక్‌.

తెలంగాణలో బీజేపీతో పొత్తుకు రెడీ అయ్యారు పవన్‌ కళ్యాణ్‌. మరి ఏపీలో అంటే.. బీజేపీతో పొత్తు లేదని ఇప్పటికే కన్ఫామ్‌ అయ్యింది. ఏపీలో టీడీపీ-జనసేనల మధ్య పొత్తు కుదిరింది. అయితే టీడీపీతో పొత్తుకు బీజేపీ సుముఖంగా లేదు. దాంతో ఆ పార్టీ పొత్తుకు దూరంగానే ఉంటుంది. పవన్‌ కూడా దీని మీద పెద్దగా స్పందించడం లేదు. ఏపీలో తనకు టీడీపీనే ముఖ్యమన్నట్లు వ్యహరిస్తున్నారు. అదే తెలంగాణ విషయానికి వస్తే.. ఇందుకు పూర్తి రివర్స్‌ సీన్‌ కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీతో పొత్తు కోసం పవన్‌ సుముఖంగానే ఉన్నారు. నేడు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ తర్వాత.. దీనిపై క్లారిటీ వచ్చింది.

రెండు చోట్ల రెండు రకాల పొత్తులు..

అయితే రెండు రాష్ట్రాల్లో పొత్తుల నేపథ్యంలో పవన్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై కార్యకర్తలే అసంతృప్తితో ఉన్నారు. అసలు పవన్‌ మనసులో ఏం ఉంది.. కనీసం ఆయనకైనా తన ఆలోచనల మీద ఓ క్లారిటీ ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేనకు తెలంగాణ కన్నా 2024లో ఏపీలో జరగబోయే ఎ న్నికలే కీలకం. ఈసారి కూడా సత్తా చాటకపోతే.. ఇక జనసేన భవిష్యత్తు కష్టమని స్వయంగా కార్యకర్తలే అనుకుంటున్నారట.

ఇలాంటి సమయంలో రెండు రాష్ట్రాల్లో రెండు రకాల పొత్తులు పెట్టుకోవడం సరైన నిర్ణయమే అవుతుందా అనే ప్రశ్న వినిపిస్తోంది. అంతేకాక వేర్వురు పొత్తులతో ప్రజల్ని కన్విన్స్‌ చేయడం కష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రజల కన్నా ముందు కార్యకర్తలే గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు.

ఇక పవన్‌ నిర్ణయాలు చూస్తే.. ఆయన రాజకీయంగా మెరుగుపడే చాన్స్‌ లేదంటున్నారు రాజకీయ పండితులు. ఇప్పటికే పవన్‌ది పూటకో మాట అంటూ ప్రత్యర్థులు విమర్శలు చేస్తుండగా.. ఆయన తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్ల పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందంటున్నారు. అంతేకాక పవన్‌కు పొత్తు ఆలోచనల్లోనే ఇంత గందరగోళం ఉంటే.. ఇక వ్యూహం, మేనిఫెస్టో మాటేంటి అంటున్నారు రాజకీయ పండితులు. పవన్‌ ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్నాయి అంటున్నారు.

కనీసం ఇప్పటికైనా పవన్‌ పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని.. కాదని మొండిగా ముందుకు వెళ్తే పరువు పొగొట్టుకోవాల్సి వస్తుంది అంటున్నారు రాజకీయ పండితులు. మరి రెండు రాష్ట్రాల్లో వేర్వురు పార్టీలతో పొత్తు గురించి పవన్‌ క్యాడర్‌కి క్లారిటీ ఇస్తారా.. లేక కన్ఫ్యూజ్‌ చేస్తారో చూడాలి అంటున్నారు.

Show comments