డర్టీ మైండ్‌ పృథ్వీ మళ్ళీ ఓవరాక్షన్‌! ఈ మనిషి ఇంకా మారలేదట!

Prithvi Raj: వైసీపీ నుంచి వెలి వేస్తే.. టీడీపీ-జనసేన కూటమిలో చేరిన పృథ్వీరాజ్‌.. అధికార పార్టీ నేతల మీద చేస్తోన్న వ్యాఖ్యలు చూసిన జనాలు.. ఈ మనిషి ఇంకా మారలేదు అనుకుంటున్నారు.

Prithvi Raj: వైసీపీ నుంచి వెలి వేస్తే.. టీడీపీ-జనసేన కూటమిలో చేరిన పృథ్వీరాజ్‌.. అధికార పార్టీ నేతల మీద చేస్తోన్న వ్యాఖ్యలు చూసిన జనాలు.. ఈ మనిషి ఇంకా మారలేదు అనుకుంటున్నారు.

వైఎస్సార్‌సీపీలో మోసగాళ్లు ఉన్నారని.. వారందరి చరిత్ర తన డైరీలో రాసుకున్నానని.. త్వరలోనే వారి బాగోతాలను బయటపెడతానంటూ నటుడు పృథ్వీరాజ్‌ చేసిన వ్యాఖ్యలు చూసిన వారు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది అనే సామెత వచ్చింది ఇలాంటి వారిని చూసే అని అంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ జనాలు. లేకపోతే.. గౌరవప్రదమైన ఎస్వీబీసీ చానెల్‌ బాధ్యతలను అప్పగిస్తే.. ఇదే పృథ్వీ మహిళా ఉద్యోగితో ఎంత అసహ్యంగా ప్రవర్తించాడో మర్చిపోయాడా.. ఆయన అసభ్య చర్యలు చూసే కదా జగన్‌ ఆయనను పార్టీ నుంచి వెలివేసింది అని తిట్టిపోస్తున్నారు.

అలాంటి పృథ్వీ ఈ రోజు తానేదో సుద్దపూస అయినట్లు కబుర్లు చెప్పడం విడ్డూరంగా ఉంది అంటున్నారు ఏపీ ప్రజలు. ఓసారి నీ చరిత్ర ఏంటో గుర్తు చేసుకుని.. ఆ తర్వాత ఎదుటి వారి మీద విమర్శలు చేస్తే మంచిదని హితవు పలుకుతున్నారు. పైగా అతడిని జనసేనలో చేర్చుకున్న పవన్‌ కళ్యాణ్‌ని చూసి జాలి పడుతున్నారు.

2019 ఎన్నికల ముందు వరకు పృథ్వీ వైసీపీ కోసం పని చేశాడు. దాంతో జగన్‌.. ఎన్నికల తర్వాత  అతడిని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా నియమించాడు. మరి అంత బాధ్యతాయుతమైన పదవి అప్పగిస్తే.. పృథ్వీ ఏం చేశాడు.. ఆధ్యాత్మిక చానల్ చైర్మన్‌ అనే సంగతి మర్చిపోయి.. ఓ మహిళతో అసభ్యకర సంభాషణ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అతడి చర్యల పట్ల ఆగ్రహించిన జగన్‌.. అతడిని పార్టీ నుంచి వెలివేశారు. కానీ పృథ్వీ మాత్రం.. జగన్‌ను కలిసేందుకు.. వైసీపీలో ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. కానీ జగన్‌ మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు. దాంతో టీడీపీ-జనసేన కూటమిలో చేరాడు.

భార్యను హింసించి..

ఎస్వీబీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే కాక.. అంతకుముందు కూడా పృథ్వీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అతడి వేధింపుల గురించి పృథ్వీ భార్య కోర్టును ఆశ్రయించింది. సినిమాల్లోకి రాకముందు వరకు కూడా బాగానే ఉన్నాడని.. కానీ అవకాశాలు పెరిగిన తర్వాత.. తనను, పిల్లలను పట్టించుకోలేదని కోర్టులో చెప్పుకొచ్చింది. పైగా 2016లో ఆమెను ఏకంగా ఇంట్లో నుంచి తరిమేశాడు. దాంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు.. పృథ్వీరాజ్‌ తన భార్యకు ప్రతి నెల 8 లక్షల రూపాయల భరణం ఇవ్వాలని తీర్పునిచ్చింది. 1984లో విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో పృథ్వీరాజ్‌ వివాహమైంది. వారికి ఒక​ కుమార్తె, కుమారుడు ఉన్నారు.

కడుపున పుట్టిన పిల్లలను పట్టించుకోలేదు, కట్టుకున్న భార్యను నానా హింసలు పెట్టాడు. ఎంతో బాధ్యతగల పదవి అప్పగిస్తే.. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి.. ఆఖరికి పార్టీ నుంచి వెలివేయబడ్డాడు. అలాంటి నీచ చరిత్ర ఉన్న పృథ్వీరాజ్‌.. ఇప్పుడు వైసీపీ నేతల గురించి కామెంట్స్‌ చేయడం హస్యాస్పదంగా ఉంది.. ఈ మనిషి ఇంకా మారలేదు అంటున్నారు.

Show comments