Dharani
Dharani
2019 ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి హామీని నెరవేరుస్తూ.. ప్రజలందరికి సంక్షేమ పాలన అందిస్తూ.. జనాల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ప్రజల్లో జగన్ మీద పెరుగుతున్న అభిమానం చూసి.. విపక్షాలకు వెన్నులో వణుకుపుడుతుంది. జగన్‌ని అడ్డుకోవడం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ని ఓడించడం కోసం విపక్షాలు కలిసి కట్టుగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించాయి. అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టయినప్పటికి.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారికే మద్దతివ్వడం, పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు.
అయితే టీడీపీ-జనసేన కలిసి వచ్చినా.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనమే కొనసాగుంతుందని.. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ప్రభంజనం సృష్టించనుందని.. ఆ సునామీకి ప్రతిపక్ష పార్టీలేవి కనపించకుండా కనుమరుగవుతాయని టైమ్స్ నౌ సర్వే బల్లగుద్ది మరీ చెబుతోంది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన సర్వే ఫలితాలను టైమ్స్ నౌ తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం.. ఏపీలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగినా సరే.. మరోసారి అధికార వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని వెల్లడించింది. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలుండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 51.10 శాతం ఓట్లను సాధించి.. మొత్తం 25 స్థానాల్లో గెలుస్తుందని సర్వేలో తేలింది. ఫ్యాన్ తుపాన్‌లో టీడీపీ, జనసేన, ఎన్డీయే, ఇతర పక్షాలు గల్లంతు కావడం ఖాయమని స్పష్టం చేసింది.
అవినీతి కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టై జైలులో ఉన్న నేపథ్యంలో టీడీపీ 36.40 శాతం ఓట్లకే పరిమితం అవుతుందని టైమ్స్ నౌ సర్వే తేల్చింది. ప్రజల్లో సానుభూతి పొందేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఈ సర్వే రిపోర్ట్ చూస్తే అర్థం అవుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ మహా అయితే ఒక ఎంపీ స్థానంలో మాత్రమే ఒకింత ఉనికి చాటుకునే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన 10.1 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటుందని.. ఇక లోక్‌సభ స్థానాల్లో పోటీకి వస్తే.. కనీసం ఒక్క చోట కూడా పోటీని ఇవ్వలేదని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో బీజేపీ 1.30 శాతం ఓట్లకు పరిమితం కాగా సీపీఐ, సీపీఎం సహా వామపక్షాలు 1.10 శాతం ఓట్లకు పరిమితం అవుతాయని సర్వే పేర్కొంది.
The @TimesNow -ETG survey predicts clean sweep for @YSRCParty in AP with 24 -25 Lok Sabha seats.#YSJaganAgain#YSRCPAgainhttps://t.co/G6dY75KvHE
— YSR Congress Party (@YSRCParty) October 3, 2023