వీడియో:పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్‌! రంగులు, గుర్తులకు అర్థం ఇదే!

Thalapathy Vijay Party Name Tamilaga Vetri Kazhagam: దళపతి విజయ్‌ తన పార్టీ జెండాను, ఆథమ్‌ను ఆవిష్కరించారు. మరి జెండా ఎలా ఉంది? అది దేన్ని ఇండికేట్‌ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Thalapathy Vijay Party Name Tamilaga Vetri Kazhagam: దళపతి విజయ్‌ తన పార్టీ జెండాను, ఆథమ్‌ను ఆవిష్కరించారు. మరి జెండా ఎలా ఉంది? అది దేన్ని ఇండికేట్‌ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

తమిళ స్టార్‌ హీరో, దళపతి విజయ్‌ తన రాజకీయ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కొన్ని నెలల క్రితం రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో పార్టీ పేరును ‘తమిళగ వెట్రి కళగం’గా ప్రకటించారు. తాజాగా పార్టీ జెండాతో పాటు పార్టీ యాంథమ్‌ను సైతం రిలీజ్‌ చేశారు. పనయూర్లోని పార్టీ కార్యాలయంలో ఆయన ఈ కార్యక్రమం నిర్వహించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్‌ సంసిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో కార్యక్రమానికి పక్కా ప్రణాళికతో చేపడుతున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు పార్టీ కార్యక్రమాలు కూడా చూస్తున్నారు. అయితే.. ఒక్కసారి పూర్తిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. సినిమాల్లో నటించనని కూడా విజయ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

విజయ్‌ పార్టీ తమిళగ వెట్రి కళగం జెండా ఎరుపు, పసుపు రంగుల కలయికతో ఉంది. జెండా మధ్యలో ఒక పువ్వు, దాని చుట్టూ నక్షత్రాలు, దానికి రెండు వైపులా ఏనుగులు ఉన్నాయి. ఇలా పార్టీ జెండా అందర్ని ఆకట్టుకునేలా.. ద్రవిడ్‌ సిద్ధాంతాన్ని ప్రతిబింబిచేలా ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పూర్తిని క్షేత్ర స్థాయి నుంచి నిర్మించాలని విజయ్‌ భావిస్తున్నారు. అందులో తొలి అడుగుగా.. త్వరలోనే తిరుచ్చి వేదికగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి.. తన లక్ష్యాలు, పార్టీ సిద్ధాంతాలను తన అభిమానులకు, పార్టీ శ్రేణులకు విజయ్‌ వివరించే అవకాశం ఉంది.

కాగా.. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో విజయ్‌తో పాటు.. తమిళగ వెట్రి కళగం పార్టీ నేతలు, వాలంటీర్లు, విజయ్‌ అభిమానులు భారీగా పాల్గొన్నారు. విజయ్‌ తల్లిదండ్రులు ఎస్‌ఏ చంద్రశేఖర్‌, శోభా చంద్రశేఖర్‌ సైతం ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. ఈ పార్టీని ప్రధాన కార్యదర్శి హోదాలో ఎన్‌ ఆనంద్‌ ఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం వద్ద గతంలో రిజిస్టర్‌ చేయించారు. తమిళనాడులోని పొలిటికల్‌ పార్టీ గ్యాప్‌ను ఫిల్‌ చేసే అవకాశం విజయ్‌కి ఉంది. జయలలిత మరణంతో అన్నాడీఎంకే చాలా బలహీనపడింది. ఒక్క డీఎంకే పార్టీనే ఇప్పుడు తమిళనాడులో బలంగా ఉంది. ఆ పార్టీకి విజయ్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Show comments