iDreamPost
android-app
ios-app

100 అడుగులు వెనక్కు వెళ్లిన సముద్రం.. ఎక్కడంటే..?

దసరా సెలవులు కావడంతో పిల్లల్ని తీసుకుని సముద్రం ఒడ్డుకు వెళ్లారు పేరెంట్స్. ఎగసి పడిన అలల్ని చూసి మురిసిపోతున్నారు. అంతలోనే ఊహించని పరిణామం..

దసరా సెలవులు కావడంతో పిల్లల్ని తీసుకుని సముద్రం ఒడ్డుకు వెళ్లారు పేరెంట్స్. ఎగసి పడిన అలల్ని చూసి మురిసిపోతున్నారు. అంతలోనే ఊహించని పరిణామం..

100 అడుగులు వెనక్కు వెళ్లిన సముద్రం.. ఎక్కడంటే..?

దసరా సెలవులు కావడంతో.. సముద్ర తీరంలో సేద తీరేందుకు వెళ్లారు పర్యాటకులు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కేరింతలు కొడుతూ సాగరంలో ఆడుకుంటున్నారు. కెరటాలు చేసే చప్పుళ్లతో మైమరిచిపోతున్నారు. అంతలో ఒక్కసారిగా అలజడి. తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు ఉన్నట్టుండి వెనక్కి వెళ్లాయి. సముద్రం వెనక్కు వెళ్లిపోవడంతో పర్యాటకులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతలోనే ఆందోళన చెందారు. సునామీ మిగిల్చిన ఆనవాళ్లు.. ఒక్కసారిగా మదిలో మెదిలాయి. మళ్లీ ఉపద్రవం ఏదైనా వస్తుందన్న భయంతో పరుగులు తీశారు. ఈ దృశ్యాలు తమిళనాడులోని తిరుచందూర్ ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. 100 మీటర్ల మేర సముద్రం వెనక్కు వెళ్లింది. దీంతో ఇసుకతో బీచ్ నిండిపోయింది. పచ్చిక బయళ్లు బయటపడ్డాయి.

తిరుచందూర్ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉంది. ఇక్కడ చరిత్రల నాటి ఆరుల్మిగు సుబ్రమణ్య స్వామి టెంపుల్ ఉంది. దీని ఆనుకుని సముద్రం తీరం ఉంది. దసరా సెలవులు కావడంతో యాత్రికులు, పర్యాటకులు, స్థానికులు పెద్ద యెత్తున మురుగన్ దర్శనంతో పాటు సముద్రాన్ని తిలకించేందుకు వచ్చారు. అయితే అంతలోనే సముద్రం 100 మీటర్ల మేర వెనక్కు వెళ్లింది. దీంతో ఆశ్చర్యంతో చూసిన స్థానికులు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇన్ని అడుగులు లోనికీ వెళ్లలేదని చర్చించుకుంటున్నారు. సాధారణంగా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఇలా కెరటాలు వెనక్కు వెళ్లడం తెలుసునని,కానీ ఈ సమయంలో ఇలా జరగడం ఏంటని భయపడుతున్నారు. నీళ్లు వెనక్కు వెళ్లడంతో రాళ్ల గుట్టలతో, పచ్చిక బయళ్లతో మరింత ఆహ్లాదంగా కనిపిస్తుంది బీచ్. దీంతో భారీ ఎత్తున చూసేందుకు వస్తున్నారు. అయితే ఇది వాతావరణ ప్రభావమే అంటున్నారు నిపుణులు.

ఇక తమిళనాడులో భారీ వానలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నై మీదుగా ప్రయాణిస్తోంది. చెన్నైతో సహా తిరవళ్లూరు, కాంచీపురం,చెంగల్ పట్టుతో సహా పలు జిల్లాల్లో ఆకాశానికి చిల్లులు పడినట్లుగా వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో నదులు నీట మునిగాయి. ఇంకా తమిళనాడును వర్షాలు ముంచెత్తనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో చెన్నై నగర వాసుల్లో ఆందోళన నెలకొంది. చిన్నపాటి వానకే చెన్నై మహా నగరం నీట మునిగిపోతుంది. ఇప్పుడు ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండటంతో మళ్లీ గతం నాటి పరిస్థితులు ఎదురౌతాయా అన్న టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలకు ఉప్రకమించింది. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఐటి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచించింది. చేపల వేటకు వెళ్లొద్దని తెలిపింది. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా ఇలాంటి వాతావరణం ఉన్న నేపథ్యంలోనే సముద్రం వెనక్కు వెళ్లినట్లు భావిస్తున్నారు పర్యావరణ వేత్తలు.