Dharani
వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా చోటు చేసుకున్న ఓ సంఘటన మీద ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇంతకు ఏంటా సంఘటన అంటే..
వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా చోటు చేసుకున్న ఓ సంఘటన మీద ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇంతకు ఏంటా సంఘటన అంటే..
Dharani
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఏపీలో ఎన్నిలకు జరగనున్నాయి. ఈ ఎలక్షన్ల కోసం టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. రానున్న ఏపీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. పొత్తులకు సంబంధించి ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన కూడా చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఎన్నికల బరిలో సింగిల్‌గా వస్తున్నారు. తాను అందించిన సంక్షేమ పాలననే ఆయన నమ్ముకున్నారు. అంతేకాక రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్న జగన్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇక జగన్ ఒక్కడిని ఓడించడం కోసం 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు.. అసలు పాలిటిక్స్ అంటే ఏంటో ఇంకా సరిగా అర్థం చేసుకోని జనసేనతో పొత్తు కోసం తహతహలాడటం.. వింతగానే కాక టీడీపీ శ్రేణులకు కూడా కాస్త ఇబ్బందిగానే ఉందనే టాక్ వినిపిస్తోంది. పొత్తు ఉంటుందని ప్రకటించారు కానీ.. రెండు పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం మాత్రం కష్టమే అంటున్నారు రాజకీయ పండితులు.
ఇక పొత్తులు కుదిరిన తర్వాత.. రెండు పార్టీల నేతలు.. టీడీపీ, జనసేన జెండాలను మోయాల్సిందే. రెండు కండువాలు ధరించాల్సిందే. ఈ క్రమంలో తాజాగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన టీడీపీ శ్రేణులు.. మనకు ఇది అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఆ ఫొటోలో ఏం ఉంది అంటే.. బాలయ్య మెడలో టీడీపీ, జనసేన కండువాలు ధరించి ఉన్నాడు. దీనిలో అంతలా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏంది అంటే.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్..
బాలయ్య మెడలో ఉన్న కండువాల్లో టీడీపీది కిండ ఉండగా.. దాని మీద జనసేన పార్టీ కండువా ఉంది. అంటే చూడగానే ముందు జనసేన కండువానే కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు టీడీపీ శ్రేణులకు ఆగ్రహం కలిగిస్తోంది. మనం పొత్తులు పెట్టుకుంది ఏమైనా జాతీయ స్థాయి పార్టీతోనా.. కాదు కదా.. అలాంటప్పుడు జనసేనకు అంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరమా.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న పార్టీ మనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఏపీలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఘనత మనది.
అంతటి అనుభవం ఉన్న మన పార్టీ కండువాను కనుమరుగు చేసి.. జనసేన కండువాను అందరికి కనిపించేలా ధరించడం ఏంటి.. అంటే జనసేనతో పొత్తు లేకపోతే మనం రాణించలేమా.. ఓడిపోతామని భయపడుతున్నారా.. నిన్న కాక మొన్న స్థాపించిన పార్టీకి ఇంతటి ప్రాధాన్యత అవసరమా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఇది సొంత పార్టీని తక్కువ చేయడం మాత్రమే కాక తీవ్ర అవమానంగా పరిగణిస్తున్నారట తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు.
కానీ కొందరు నెటిజనులు మాత్రం.. ఆఖరికి టీడీపీలోని పెద్ద నాయకులు కూడా జనసేన జెండాలు మోస్తున్నారు.. అంటే రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. అసలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణే ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తాడో లేదో అనే అనుమానం అందరిలో ఉంది.. అలాంటి పార్టీతో పొత్తు కోసం.. జనసేన జెండా మొయడం కోసం టీడీపీ నేతలు ఇంతలా ఎదురు చూస్తున్నారంటే.. జగన్ దెబ్బ మాములుగా తగల్లేదని అర్థం అవుతోంది. జగన్ ఒక్కడిని ఢీకొట్టడం కోసం టీడీపీ ఇంతలా శ్రమ పడటం చూస్తే పాపం అనిపిస్తుంది అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఇక వైసీపీ శ్రేణులు మాత్రం మా జగన్నతో పోటీ పడాలంటే మీ స్టామినా సరిపోదు.. ఇంకో పది పార్టీలతో పొత్తు పెట్టుకున్నా గెలిచేది మా జగనన్నే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ కండువాలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్‌కు కారణం అయ్యాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి అంటున్నారు రాజకీయ పండితులు.
జై జనసేన అన్న బాలయ్య pic.twitter.com/gUJ63702YK
— Actual India (@ActualIndia) November 16, 2023