Krishna Kowshik
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొత్తులో భాగంగా టీడీపీ-జనసేన కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులతో కూడిన తొలి ఉమ్మడి జాబితాను విడుదల చేశాయి. ఈ జాబితా విడుదల కావడంతో ఇరు పార్టీల్లో అసమ్మతి రాజుకుంది. ముఖ్యంగా జన సేన నేతల్లో..
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొత్తులో భాగంగా టీడీపీ-జనసేన కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులతో కూడిన తొలి ఉమ్మడి జాబితాను విడుదల చేశాయి. ఈ జాబితా విడుదల కావడంతో ఇరు పార్టీల్లో అసమ్మతి రాజుకుంది. ముఖ్యంగా జన సేన నేతల్లో..
Krishna Kowshik
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో టీడీపీ, జనసేనత పొత్తు రాజకీయాలు షురూ చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ఫైనల్ చేస్తూ ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు, జన సేన అధిపతి పవన్ కళ్యాణ్. శనివారం మొత్తం 118 స్థానాలను ప్రకటించగా.. జన సేన పార్టీకి కేవలం 24 సీట్లు కేటాయించారు. అలాగే 3 ఎంపీ స్థానాలు ఇచ్చారు. దీంతో టీడీపీ, జనసేన నేతల్లో అసమ్మతి మొదలైంది. ముఖ్యంగా జన సేన నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తి రాజ్యమేలుతోంది. కొంత మంది ఎమ్మెల్యే సీటు వస్తుందని ఆశించి భంగపడ్డారు.
టీడీపీ, జన సేన పొత్తుల్లో భాగంగా.. పలు నియోజకవర్గాలను అభ్యర్థులను ఖరారు చేస్తూ ఉమ్మడిగా తొలి జాబితాను విడుదల చేశారు చంద్రబాబు, పవన్. అప్పటి నుండి అసంతృప్తిలో మునిగిపోయారు జన సేన నేతలు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా జనసేన కోసం, తనను నమ్ముకుని పని చేసిన ముఖ్య నేతలకు మొండి చేయి చూపించారు ఈ మెగా పవర్ స్టార్. సీటు ఆశించిన పని చేసిన వారికి కూడా భంగపాటు తప్పలేదు. సీటు దక్కకపోవడంతో గుండెలు పగిలిపోయేలా విలపిస్తున్నారు ఆశావాహులు. పొత్తుల్లో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజక వర్గం టీడీపీ కేటాయించింది ఉమ్మడి సేన. ఈ స్థానానికి టీడీపీ నేత జ్యోతుల నెహ్రుకు కేటాయించడంతో జన సేన నేతల్లో అసమ్మతి నెలకొంది.
ముఖ్యంగా జన సేన జగ్గంపేట ఇన్ చార్జ్ సూర్యం చంద్ర పాఠం శెట్టి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తనకు సీటు కేటాయించకపోవడంపై భోరున విలపించారు. కాళ్లకు రబ్బరు చెప్పులు కూడా లేని ఎమ్మెల్యే టికెట్ ఆశించడం తప్పు అంటూ అనుచరుల్ని పట్టుకుని రోదించారు. పవన్ తీసుకున్న ఈ చర్యతో జనసేన అనుచరుల్లో కూడా తీవ్ర నైరాశ్యం కూరుకుపోయింది. పేద కుటుంబం నుండి వచ్చిన సూర్య చంద్ర.. పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు నచ్చి పార్టీలోకి వచ్చారు. ఎన్నో ఏళ్ల నుండి పని చేస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పవన్ తనకు ఈ నియోజకవర్గం నుండి సీటు ఇస్తారని ఆశపడ్డాడు సూర్య చంద్ర.
కానీ అనూహ్యంగా ఈ సీటు టీడీపీకి కేటాయించడంతో ఖంగుతిన్నాడు. నమ్మకున్న వారికి న్యాయం చేస్తారని అనుకున్న సమయంలో.. అతడికి మొండి చేయి చూపించడంతో కిర్లంపూడి మండలం నుండి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ పొత్తు రాజకీయాల వల్ల పవన్ హ్యాపీగా ఉన్నారేమో కానీ.. చివరకు అతడ్ని నమ్ముకుని.. అతడి వెంట నడిచిన మద్దుతుదారులను నడి రోడ్డుపై వదిలేశారు. వారిని నిండా ముంచినట్లైంది. అతడి తీరుతో జన సేన నేతలు అసమ్మతి రాగాన్ని ఆలపిస్తున్నారు. ఈ జాబితాతో జన సేన అసంతృప్తి నేతల సంఖ్య పెరిగిపోతుంది. పవన్ ను నమ్ముకొని వచ్చిన నేతల బతుకుల్ని నడి బజారున పడేసినట్లైంది.