iDreamPost
android-app
ios-app

లైవ్‌లో చెప్పులు చూపిస్తూ.. మక్కెలిరగదీస్తానంటూ పవన్‌కు పేర్ని నాని వార్నింగ్‌!

  • Published Jun 15, 2023 | 2:35 PMUpdated Jun 15, 2023 | 2:44 PM
  • Published Jun 15, 2023 | 2:35 PMUpdated Jun 15, 2023 | 2:44 PM
లైవ్‌లో చెప్పులు చూపిస్తూ.. మక్కెలిరగదీస్తానంటూ పవన్‌కు పేర్ని నాని వార్నింగ్‌!

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండంటంతో.. అధికార, విపక్ష పార్టీల నేతలు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే జనేసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ వారహిని రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. దాంతో పాలిటిక్స్‌ మరింత హీటెక్కాయి. అధికార పార్టీ నేతలు, జనసేన అధ్యక్షుడి మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ‍క్రమంలో అధికార వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని.. పవన్‌ కళ్యాణ్‌కు మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఏకంగా మీడియా ముందే చెప్పులు చూపిస్తే.. మక్కెలిరగదీస్తాను.. మాకు కూడా చెప్పులున్నాయి అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇ‍చ్చారు. వారాహి యాత్రలో భాగంగా బుధవారం కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్.. జగన్ సర్కార్‌పై చేసిన విమర్శలకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘‘పవన్ కళ్యాణ్ ఒక చెప్పు చూపిస్తేనే పెద్ద మొగోడినని అనుకుంటున్నాడు.. నేను రెండు చెప్పులు చూపిస్తున్నా.. పవన్ కంటే నేనే పెద్ద మొగోడిని. మా పార్టీ గురించి, సీఎం గురించి అబద్ధాలు ప్రచారం చేస్తే మక్కెలిరగదీస్తానంటూ’’ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ చేప్పిన ప్రతి ఒక్క మాట అబద్ధమే అన్నారు. పవన్ కళ్యాణ్ చేస్తోంది వారాహి యాత్ర కాదు నారాహి యాత్ర అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని.. టీడీపీ కోసం కొత్త డ్రామాలు మొదలు పెట్టారని పేర్ని నాని విమర్శించారు.

పవన్‌.. రోజుకో డైలాగ్ చెప్పి దాన్ని వ్యూహామంటారని మాజీ మంత్రి సెటైర్లు పేల్చారు. పవన్ అసెంబ్లీలోకి అడుగుపెట్టాలంటే నమ్మాల్సిది ప్రజలను.. అంతేకాని, చంద్రబాబు వ్యూహాల్ని కాదంటూ ఎద్దేవా చేశారు.. జనసేనను నడిపిస్తుంది చంద్రబాబు అనే విషయాన్ని చిన్నపిల్లాడిని అడిగినా కూడా చెబుతారన్నారు. పదేళ్ల నుంచి పవన్ పార్టీని చంద్రబాబు నడుపుతున్నారని.. చంద్రబాబు కోసం ఇంత దిగజారడం అవసరమా అని పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ అంటే చేగువేరా కాదు చంద్రబాబు అని.. చేగువేరాది రాజీలేని పోరాటం అని, పవన్‌ది లాలూచీ రాజకీయమంటూ పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తన సినిమాలను అధికార పార్టీ అడ్డుకుంటోందంటూ పవన్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అన్నారు పేర్ని నాని. తాము అడ్డుకున్న ఒక్క సినిమా అయిన చూపించగలరా అంటూ పవన్‌ను సవాల్ చేశారు. అబద్ధాలను ప్రచారం చేస్తే మక్కెలిరిగిపోతాయంటూ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌లో గులాబీ జెండాను జేబులో పెట్టుకొని తిరుగుతున్నది ఎవరని.. అక్కడ మంత్రి హరీష్ రావు ఏపీని తిడుతుంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు పేర్ని నాని.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి