iDreamPost
android-app
ios-app

బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు భారీ షాక్‌.. ఇప్పుడేం చేస్తారో

  • Published Feb 21, 2024 | 8:51 AM Updated Updated Feb 24, 2024 | 1:18 PM

టీడీపీ సీనియర్‌ నేత బుచ్చయ్య చౌదరికి భారీ షాక్‌ ఇచ్చారు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.

టీడీపీ సీనియర్‌ నేత బుచ్చయ్య చౌదరికి భారీ షాక్‌ ఇచ్చారు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.

  • Published Feb 21, 2024 | 8:51 AMUpdated Feb 24, 2024 | 1:18 PM
బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు భారీ షాక్‌.. ఇప్పుడేం చేస్తారో

రానున్న ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీని ఓడించడం కోసం టీడీపీ, జనసేన కూటమి పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తు ప్రకటన అయితే వచ్చింది కానీ.. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న ఇప్పటి వరకు సీట్ల పంపకం ఓ కొలిక్కి రాలేదు. తాజాగా జగన్‌ దూకుడు చూసి భయపడి.. ఇరు పార్టీల అధ్యక్షులు కలిసి 118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఈ జాబితాలో సీనియర్లకు చంద్రబాబు హ్యాండిచ్చాడు.  తన స్వార్థం కోసం ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటి పెట్టుకుని ఉన్న సీనియర్లకు ఇప్పుడు మొండి చేయి చూపించాడు. టీడీపీ సీనియర్‌ నేత బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు భారీ షాక్‌ ఇచ్చాడు. ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగానే ఆయనకు టికెట్‌ కేటాయించలేదు. ఆ వివరాలు..

కొన్ని రోజుల క్రితమే టీడీపీ సీనియ‌ర్ నేత‌, రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రికి పవన్‌ కళ్యాణ్‌ గ‌ట్టి షాక్ ఇచ్చాడు. రాజ‌మండ్రి లోక్‌స‌భ ప‌రిధిలో రాజాన‌గ‌రం, రాజ‌మండ్రి రూర‌ల్ స్థానాల్లో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించాడు. అంతేకాక రాజ‌మండ్రి రూర‌ల్ అభ్య‌ర్థిగా కందుల దుర్గేష్ పేరును పవన్‌ కళ్యాణ్‌ అధికారికంగా ప్ర‌క‌టించాడు. దీనిపై బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ.. రాజమండ్రి రూరల్‌ సీటు తనకే అని క్లారిటీ ఇచ్చాడు. కానీ నేడు ప్రకటించిన జాబితాలో ఆయనకు సీటు దక్కలేదు.

రాజ‌మండ్రి రూర‌ల్ అభ్యర్థిగా దుర్గేష్‌ను ప్రకటించాడు పవన్‌ కళ్యాణ్‌. ఇక నేడు ప్రకటించిన జాబితాలో బుచ్చయ్య చౌదరి పేరు లేదు. రాజమండ్రి రూరల్‌ టికెట్‌ త‌న‌కే అని చాలా కాలంగా బుచ్చయ్య చౌదరి చెప్పుకుంటూ వస్తున్నాడు. అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనను కాద‌ని రాజ‌మండ్రి రూర‌ల్ టికెట్ జనసేనకు ఇచ్చే ప్రసక్తే లేదని ధీమాగా ఉన్న ఆయనకు బాబు భారీ షాక్‌ ఇచ్చాడు.

మరి ఇప్పుడు బుచ్చ‌య్య చౌద‌రి రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏంట‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జనసేన కోసం ఇలా పార్టీలో సీనియర్‌ నేతలను పక్కకు పెట్టడం ఏంటని టీడపీ కేడర్‌ ప్రశ్నిస్తున్నారు. మరి సీట్లు రాని సీనియర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.