భీమవరం- గాజువాకలో ఓడిపోతానని ముందే తెలుసు: పవన్ కల్యాణ్

Pawan Kalyan On Defeat: పవన్ కల్యాణ్ గత ఎన్నికలు, భీమవరం- గాజువాకలో ఓటమి పాలవ్వడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఓటమి గురించి ముందే తెలుసు అంటూ కామెంట్స్ చేశారు.

Pawan Kalyan On Defeat: పవన్ కల్యాణ్ గత ఎన్నికలు, భీమవరం- గాజువాకలో ఓటమి పాలవ్వడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఓటమి గురించి ముందే తెలుసు అంటూ కామెంట్స్ చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పోటీకి సంబంధించి క్లారిటీ ఇచ్చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నాను అంటూ కుండ బద్దలు కొట్టేశారు. తన పోటీకి సంబంధించి స్వయంగా పవన్ కల్యాణ్ అధికారిక ప్రకటన చేశారు. కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలు, తన ఓటమిపై పవన్ కల్యాణ్ ఓపెన్ కామెంట్స్ చేశారు. తాను గత ఎన్నికల్లో ఓడిపోతానని తనకు ముందే తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్ పోటీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నాను అంటూ అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ సమావేసంల గత ఎన్నికల గురించి మాత్రమే కాకుండా.. రెండు స్థానాల్లో తాను ఓడిపోవడంపై కూడా ఓపెన్ కామెంట్స్ చేశారు. “గత ఎన్నికల్లో నేను 30 స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలి అనుకున్నాను. కానీ, నన్ను కూర్చోబెట్టి అలా కాదు అని అన్ని స్థానాల్లో పోటీ చేయాలి అంటు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నేను భీమవరంలో ఓడిపోతాను అని నాకు ప్రచారం ముగియగానే అర్థమైంది. గాజువాకలో ఎటూ ఓడిపోతానని ముందే తెలుసు. అయితే నేను కర్మయోగిగా ఉండిపోయాను. ఫలితాన్ని ఆశించకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను” అంటూ పవన్ కల్యాణ్ తన ఓటమిపై స్పందించారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చూస్తే.. తాను రాజకీయంగా ఎలాంటి స్థానంలో ఉన్నారో ఆయనే చెప్పేశారు. ఒక రాజకీయ నాయకుడు గెలవడం కోసమే పోటీ చేస్తాడు. కానీ, పవన్ కల్యాణ్ లో ఎప్పుడూ ఏ విధంగా కూడా గెలుపు కోసం పోరాడుతున్న తపన కనిపించదు. ప్రజల్లోకి వెళ్లేది లేదు. ప్రజల కష్టాలు వినేది లేదు. ఒకవైపు సినిమాలు చేసుకుంటూ.. పార్టీ నడుపుకోవడానికి డబ్బులు కావాలని సినిమాలు చేస్తున్నాను అంటారు. అలాంటి పార్ట్ టైమ్ పాలిటీషియన్ ని ప్రజలు నమ్మరు, ఓట్లు వేయరు అనే విషయంపై పవన్ కల్యాణ్ కి గత ఎన్నికల్లోనే క్లారిటీ రావాల్సింది. కానీ, ఇప్పటికీ ఆ జ్ఞానోదయం అయినట్లు మాత్రం అనిపించడం లేదు.

రెండు స్థానాల్లో ఓడిపోతానని ముందే తెలిసిన పవన్ కల్యాణ్.. తాను ఒక పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడిని కాదు అనే విషయాన్ని కూడా గ్రహిస్తే బాగుంటుంది అంటూ నెటిజన్స్ ఎద్దేవా చేస్తున్నారు. ప్రజా ప్రతినిధి అవ్వాలి అంటే ముందు ప్రజల్లో ఉండాలి అంటూ హితవు పలుకుతున్నారు. పవన్ కల్యాణ్ ఎప్పుడైతే తన తీరు మార్చుకుంటారో అప్పుడు కాస్తో కూస్తో ప్రజలు తనని నమ్మే ప్రయత్నం చేస్తారని చెబుతున్నారు. ఇలాంటి ఎన్నికల వ్యూహాలు, ప్రణాళికలతో ఎన్ని భీమవరం, గాజువాక మాత్రమే కాదు.. పిఠాపురంలో కూడా సేమ్ ఫలితమే రిపీట్ అవుతుంది అంటున్నారు. మారాల్సింది స్థానం కాదు.. పవన్ కల్యాణ్ తీరు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఓడిపోతానని ముందే తెలుసు అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments