Arjun Suravaram
YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అలానే ఆయన బాటలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సాగుతున్నారు. ఏపీలో అమలు చేసిన స్కీమ్స్ ను అమలు చేసేందుకు కూడా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా సీఎం జగన్ బాటలో వెళ్తున్నారు.
YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అలానే ఆయన బాటలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సాగుతున్నారు. ఏపీలో అమలు చేసిన స్కీమ్స్ ను అమలు చేసేందుకు కూడా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా సీఎం జగన్ బాటలో వెళ్తున్నారు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేద, బడుగు, బలహీన వర్గాల వారి అభివృద్ధి కోసం అనేక పథకాలను సీఎం జగన్ ప్రవేశ పెట్టారు. నవరత్నాల పేరుతో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న సీఎం జగన్.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాక దేశంలోనే ఎప్పుడు లేని విధంగా వాలంటీర్ లాంటి వ్యవస్థలను సీఎం జగన్ ప్రవేశ పెట్టారు. ఇలా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలను ఇతర రాష్ట్రల నేతలు కూడా అనుసరిస్తున్నారు. తాజాగా ఏకంగా దేశ ప్రధాని మోదీ కూడా సీఎం జగన్ తరహాలోనే ఓ పథకం విషయంలో ముందుకెళ్తున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు. తనదైన పాలనతో ప్రజల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేద వారిపాలిట దేవుడిగా మారారు. ఇక అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకం అందేలా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే ప్రజల వద్దకే పాలను తీసుకొచ్చిన సీఎం జగన్..ప్రజల మనస్సులో మహారాజుగా నిలిచారు. ఇక ఆయన మానస పుత్రికలుగా పిలవబడే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలను అతి చేరువ చేశారు. వాలంటీర్ వ్యవస్థపై ప్రపంచంలోని పలు దేశాధినేతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఇలా సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి.. ఇతర రాష్ట్రాల సీఎంలకు ఆదర్శంగా నిలిచారు. అంతేకాక సీఎం జగన్ పాలను అనురించే ప్రయత్నాలు పలువురు ముఖ్యమంత్రులు చేస్తున్నారు.
అలానే ఇంటి వద్దకే రేషన్ తీసుకువచ్చే విషయంలో కూడా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై మొదట్లో పలువురు విమర్శించారు. వాహనం ద్వారా ఇంటి వద్దకే రేషన్ ను తీసుకొచ్చి ప్రజలకు అందించే కార్యక్రమం సీఎం జగన్ చేపట్టారు. దీని ద్వారా రేషన్ షాపులకు వెళ్లే బాధ తప్పి.. ఇంటి వద్దనే రేషన్ తీసుకునే అవకాశం కలిగింది. రేషన్ వాహనాలు సైరన్ చేస్తూ వీధుల్లోకి వస్తూ ప్రభుత్వం అందించే సరకులను ప్రజలకు అందిస్తుంది. దేశంలోనే ఇలాంటి కార్యక్రమంలో ఏపీలో మాత్రమే జరిగింది. ఈ విషయంలో సీఎం జగన్ తరహాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్లనున్నారని టాక్ వినిపిస్తోంది.
దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అందించే రేషన్ సరకుల విషయంలో సీఎం జగన్ లాగానే వాహనాలు ఏర్పాటు చేయాలని మోదీ సర్కార్ భావిస్తోందని టాక్. ప్రస్తుతం కేంద్రం ప్రవేశ పెట్టిన భారత్ రైస్ , అలానే జాతీయ స్థాయిలో గోధుమలు , పప్పులను వాహనాల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా 180 వాహనాలు ప్రస్తుతం ఏర్పాటు చేసింది. భవిష్యత్ లో మరిన్ని వాహనాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మొత్తంగా ఓ మిని భారత్ సూపర్ మార్కెట్ ను ఏర్పాటు చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఇలా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన రేషన్ వాహనం తరహాలో మోదీ సర్కార్ కు ముందుకు వెళ్తోంది. మరి.. సీఎం జగన్ తరహాలో మోదీ సర్కార్ వెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.