అభిమానులకు ముద్రగడ బహిరంగ లేఖ.. ‘నేను ఎప్పుడు తప్పు చేయలేదు’

Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరబోతున్న సందర్భంగా ఆయన అభిమానులను ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ రాశారు. ఆ వివరాలు..

Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరబోతున్న సందర్భంగా ఆయన అభిమానులను ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ రాశారు. ఆ వివరాలు..

ఎన్నికల వేళ జనసేనకు భారీ షాక్‌ తగిలింది. తాను కులమతాలకతీతుడుని అని ప్రచారం చేసుకోనే పవన్‌ కళ్యాణ్‌.. తీరా ఎన్నికల్లో విజయం సాధించడానికి మాత్రం కులం కార్డునే వాడుకుంటున్నారు. అసలు ఆయన ఏ ఉద్దేశంతో అయితే పార్టీ స్థాపించాడో.. ఇప్పుడు వాటికి ఆమడ దూరంలో ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాపు ఓట్లను తన ఓటు బ్యాంకుగా భావిస్తూ వస్తోన్న పవన్‌ కళ్యాణ్‌.. కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ పవన్‌ స్వార్థ రాజకీయాలు అర్థం చేసుకున్న ముద్రగడ.. ఆఖరు నిమిషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయన అధికార వైసీపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో చేరికపై తన అభిమానులకు లేఖ రాశారు ముద్రగడ. ఆ వివరాలు..

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈనెల 14వ తేదీన వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీలో చేరికపై తన అభిమానులకు తాజాగా లేఖ రాశారు. దీనిలో ఆయన ఇలా రాసుకొచ్చారు..‘ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మీడియా ద్వారా మీకందరికి తెలుసు అనుకుంటున్నాను. సీఎం జగన్ పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీలోకి వెళ్ళాలని భావించి.. మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నాను. మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద వైఎస్ జగన్‌ను కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పని చేస్తాను. పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు.. అభివృద్ధిని సీఎం జగన్‌తో చేయించాలని ఆశతో ఉన్నాను’’ అని తెలిపారు.

‘‘మీ బిడ్డ అయిన నేను ఎప్పుడు తప్పు చేయలేదు.. చేయను. ఈనెల 14న కిర్లంపూడి నుండి తాడేపల్లికి బయలుదేరుతున్నాను. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు పాలపంచుకొని తాడేపల్లికి రావాలని కోరుతూ’’ లేఖను ముగించారు. ప్రస్తుతం ఆయన రాసిన లేఖ ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

అంతకు ముందు ముంద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. తనకు కానీ, తన కుమారుడు గిరిబాబుకు కానీ ఎలాంటి పదవులూ ఆశించకుండానే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నామని, పార్టీ విజయం సాధించిన తరువాత వారు ఏ పదవి ఇచ్చినా తీసుకోవడానికి సుముఖంగా ఉన్నానని తెలిపారు. ఈ నెల 14న ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య కిర్లంపూడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరతానని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ముద్రగడ చెప్పారు.

Show comments