పవన్ కల్యాణ్ పై రోజా ఫైర్.. జగనన్న తెచ్చిన వాలంటీర్లు అంటే పవన్ కు వణుకు!

పవన్ కల్యాణ్ పై రోజా ఫైర్.. జగనన్న తెచ్చిన వాలంటీర్లు అంటే పవన్ కు వణుకు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వాలంటీర్లు అంతా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ తమకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు.. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అబద్ధపు ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మంత్రి రోజా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. వాలంటీర్ వ్యవస్థలపై పవన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

“పవన్ నీకు మిస్సింగ్ కావడం, అక్రమ రవాణా చేయడానికి తేడా తెలుసా? ఆడపిల్లలను వాలంటీర్లు అక్రమ రవాణా చేస్తున్నారు అనడం దుర్మార్గం. అసలు నీకు వాలంటీర్లు అంటే ఎవరో తెలుసా? మహిళలు, వాలంటీర్లు అంటే కించత్తు కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు. అసలు వార్డు మెంబర్ గా కూడా గెలవని నీకు.. ఆ వివరాలు ఎవరిచ్చారు? అసలు నువ్వు చెప్పే అబద్ధాల్లోనే కాల్రిటీ లేదు. నీకు జగనన్న అంటేనే వణుకు అనుకున్నాను. కానీ, జగనన్న తెచ్చిన వాలంటీర్లు అంటే కూడా వణుకు అని ఇప్పుడే తెలిసింది.

వాలంటీర్ వ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో మెచ్చుకున్నాయి. అలాంటి ఒక వ్యవస్థ గురించి చులక చేసి మాట్లాడటం నిజంగా దారుణం. నువ్వు వాలంటీర్ వ్యవస్థ నడ్డి విరవడం కాదు కదా.. ఆ వ్యవస్థ వెంట్రుక కూడా పీకలేవు. కరోనా సమయంలో పవన్, చంద్రబాబు హైదరాబాద్ లో దాక్కుంటే.. వాలంటీర్లు నిస్వార్థంగా సేవ చేశారు. ఎన్సీఆర్బీ లిస్టులో తెలంగాణ 6వ స్థానంలో ఉంది. ఆ రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడటం లేదు. కేసీఆర్ కి భయపడే కదా నువ్వు మాట్లాడటం లేదు.

మీ తల్లి- భార్యను తిట్టింది టీడీపీ వాళ్లు కాదా? చంద్రబాబు, లోకేష్ తిట్టారంటూ నువ్వు 2018లో ట్వీట్ చేయలేదా? మళ్లీ గెలిపించమని వాళ్లనే ప్రాథేయపడుతున్నావ్. అసలు మహిళల అక్రమ జరిగింది చంద్రబాబు హయాంలోనే. అప్పట్లో జరిగిన కాల్ మనీ అకృత్యాలపై ఎందుకు పెదవి విప్పలేదు. మీకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఇలాంటి తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు చేస్తున్నారు. జగన్ 46 ఏళ్లకే సీఎం అయ్యారు. పవన్ కల్యాణ్ 55 ఏళ్లు అయినా ఎమ్మెల్యే కాదు కదా.. కనీసం ఎంపీటీసీ, వార్డు మెంబర్ గా కూడా గెలవలేదు. జగన్ ని సింగ్లర్ గా పిలవడం కాదు.. దమ్ముంటే సీఎం జగన్ పై ఒంటరిగా పోటీ చేయ్” అంటూ మంత్రి రోజా వ్యాఖ్యానించారు.

Show comments