iDreamPost
android-app
ios-app

ఎమ్మెల్యేల జీతాలు పెంచుతూ సీఎం ప్రకటన.. ఎంత పెంచారంటే?

వేతనంతో పాటు సకల సౌకర్యాలను పొందుతారు ఎమ్మెల్యేలు, మంత్రులు. ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రజలకు జవాబుదారిగా ఉంటూ సుపరిపాలన అందించడంలో నాయకులు కీలక పాత్ర పోషిస్తుంటారు. అయితే తాజాగా ఓ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే, మంత్రుల జీతాలను భారీగా పెంచుతూ అసెంబ్లీలో ప్రకటించారు.

ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులకు కూడా వేతనం అందిస్తుంటుంది ప్రభుత్వం. ఈ వేతనాలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటుంది. వేతనంతో పాటు సకల సౌకర్యాలను పొందుతారు ఎమ్మెల్యేలు, మంత్రులు. ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రజలకు జవాబుదారిగా ఉంటూ సుపరిపాలన అందించడంలో నాయకులు కీలక పాత్ర పోషిస్తుంటారు. అయితే తాజాగా ఓ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే, మంత్రుల జీతాలను భారీగా పెంచుతూ అసెంబ్లీలో ప్రకటించారు. సీఎం నిర్ణయంతో వారి జీతాలు భారీగా పెరగనున్నాయి. మిగతా రాష్ట్రాల కంటే ఆ రాష్ట్రంలో జీతాలు తక్కువగా ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలు పెంచుతూ ప్రకటన చేశారు. నెలకు రూ.40వేలు చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఎమ్మెల్యేల జీతాలు ప్రస్తుతం ఉన్న రూ.10 వేల నుంచి రూ.50 వేలకు, మంత్రుల జీతాలు రూ.10,900 నుంచి రూ.50,900కు, కేబినెట్‌ మంత్రుల జీతాలు రూ.11 వేల నుంచి రూ.51 వేలకు పెరగనున్నాయి. ఇక వారికి అందించే అలవెన్సులు అన్నీ కలుపుకుని ఎమ్మెల్యేలకు ఇకపై రూ.1.21 లక్షలు, మంత్రులకు రూ.1.50 లక్షల వేతనాన్ని అందుకోనున్నారు. ఇదిలా ఉంటే సీఎం వేతనంలో మాత్రం ఏ విధమైన మార్పు చేయలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను చాలా కాలంగా జీతం తీసుకోనందున వేతనాన్ని సవరించడం లేదని ఆమె తెలిపారు.