Arjun Suravaram
Harish Rao Open Letter About LRS payments: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు..కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Harish Rao Open Letter About LRS payments: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు..కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Arjun Suravaram
తెలంగాణ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వివిధ అంశాలపై పరస్పర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ గురించి ప్రస్తావిస్తూ.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ ..కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ విషయంలో గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ తప్పిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు డబ్బులు వస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం.. ఎల్ఆర్ఎస్ ను పూర్తిగా ఫ్రీగా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. అలానే ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దన్నారు.
ఎల్ఆర్ఎస్ విషయంతో పాటు రైతు రుణమాఫీ, రైతు బంధు గురించి కూడా హరీష్ రావు ప్రస్తావించారు. రైతు బంధు రాక రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. మరోవైపు విష జర్వాలతో ప్రజలు ఆస్పత్రుల పాలై..చికిత్స విషయంలో ఖర్చులు భరించలేక అల్లాడిపోతున్నారని హరీష్ రావు అన్నారు. ఇలాంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించి సామాన్య ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం.. ఎల్ఎస్ఆర్ విషయంలో అధికారుల మీద ఒత్తడి చేస్తోందని మండిపడ్డారు. పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు రోజూ 3, 4 సార్లు ఫోన్లు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు ఆరోపించారు.
ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించకుంటే లేఅవుట్లు రద్దు చేస్తామంటూ అధికారులు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారంటూ ఫైరయ్యారు. గతంలో తాము అధికారంలో ఉన్నపుడు ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారో జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నాడు ఫ్రీ ఫ్రీ ఫ్రీ అని హామీలు ఇచ్చి.. ఇప్పుడు ఫీజు ఫీజు ఫీజు అంటున్నారని మండిపడ్డారు.
ఉచితంగా ఎల్ఆర్ఎస్‌ను అమలు చేయాలని.. బీఆర్ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు అన్నారు. మాట తప్పిన ఈ ప్రభుత్వానికి ప్రజలు ఎవ్వరూ ఒక్క రూపాయి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించవద్దని పిలుపునిచ్చారు. ఎల్ఆర్ఎస్‌ను ఉచితంగా అమలు చేయించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని హరీష్ రావు స్పష్టం చేశారు. మరి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.