Harish Rao Challenge to CM Revanth Reddy: రుణమాఫీ విషయంలో మరోసారి CM రేవంత్ రెడ్డికి హారీష్ రావు సవాల్!

రుణమాఫీ విషయంలో మరోసారి CM రేవంత్ రెడ్డికి హారీష్ రావు సవాల్!

Harish Rao Challenge to CM Revanth Reddy: తెలంగాణలో రుణమాఫీపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య రచ్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీశ్ రావు రాజీనామా చేయలంటూ సిద్ధి పేటలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి హారీశ్ రావు మరో సారి సవాల్ చేశారు.

Harish Rao Challenge to CM Revanth Reddy: తెలంగాణలో రుణమాఫీపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య రచ్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీశ్ రావు రాజీనామా చేయలంటూ సిద్ధి పేటలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి హారీశ్ రావు మరో సారి సవాల్ చేశారు.

తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవలే మాజీ మంత్రి కేటీఆర్ ఉచిత బస్సు ప్రయాణ విషయంలో చేసిన వ్యాఖ్యలపై పెద్ద రచ్చ జరిగింది. ఇదే సమయంలో రుణమాఫీ అంశంపై కూడా ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ముఖ్యంగా గతంలో మాజీ మంత్రి హారీష్ రావు చేసిన సవాల్ ను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. రుణమాపీ చేస్తే…తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాన్న హరీష్ రావు .. ఆ మాటను నిలుపుకోవాలని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఇలా రుణమాఫీగా పెద్ద రగడ జరుగుతున్న సమయంలో మరోసారి హారీష్ రావు..సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ పేరుతో రైతులను నిండా మోసం చేశారని ఆయన మండిపడ్డారు. పూర్తి స్థాయిలో అర్హత కలిగిన రైతన్నలకు రుణ మాఫీ జరగలేదని హారీశ్ రావు విమర్శించారు. మెుత్తం మూడు విడతల్లో రూ.31 వేల కోట్లు మాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని, కానీ రైతు రుణమాఫీకి రూ.17 వేల కోట్లు మాత్రమే కేటాయించారని ఆయన ఆరోపించారు. అలా రైతు రుణమాఫీ విషయంలో రూ. 14 వేల కోట్ల నిధులకు కోత పెట్టారని మండిపడ్డారు. రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలం అయ్యిందని హారీశ్ రావు దుయ్యబట్టారు.

ఇంకా హారీశ్ రావు మాట్లాడుతూ.. పంట రుణమాఫీపై తొలి నుంచి కాంగ్రెస్ అబద్దాలే చెబుతుందన్నారు. మొదట డిసెంబర్ 9వతేదీ నాడే రుణమాపీ చేస్తామని చెప్పారని, ఆ తరువాత ఆగష్టు 15లోపు అంటూ మాటమార్చారని తెలిపాడు. ఇక తీరా ఇప్పుడు చూస్తే.. పూర్తిగా రుణమాఫీ చేయకుండా అబద్దాలు ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి హారీశ్ రావు అన్నారు. ఇదే సమయంలో హారీశ్ రావు మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. తెలంగాణలో ఎక్కడికైనా వెళ్లి రైతులను అడుగుదామని, రుణమాఫీ పూర్తిగా అయ్యిందో లేదో రైతులే చెబుతారని హరీశ్ రావు అన్నారు. ఈ విషయంపై చర్చకు తాను సిద్ధమైని, ప్లేస్, డేట్, టైమ్ రేవంత్ రెడ్డి చెప్పాలని హారీశ్ రావు సవాల్ చేశారు.

మొత్తంగా మరోసారి..రుణమాఫీ అంశం తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని రాజేసింది. గతంలో గడువు లోపు కాంగ్రెస్ సర్కార్ రైతు రుణమాఫీ పూర్తిచేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు సవాల్ చేశారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సిద్ధిపేటలో అర్దరాత్రి ప్లెక్సీలు సైతం వెలిశాయి. ఈ నేపథ్యేంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మీడియాతో పై విధంగా మాట్లాడారు. మరి.. హారీశ్ రావు  చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments