iDreamPost
android-app
ios-app

జనసేన ఎదగకపోవడానికి కారణం చంద్రబాబా..? పవన్‌ కళ్యాణా?: హరి రామయ్య జోగయ్య

  • Published Jan 27, 2024 | 5:00 PM Updated Updated Jan 27, 2024 | 5:23 PM

Pawan Kalyan: సీట్ల పంపకం అంశంపై మాజీ మంత్రి హరిరామజోగయ్య పవన్‌కు లేఖ రాశారు. దానిలో ఆయన సంధించిన ప్రశ్న నిజమే అంటున్నారు జనసేన నేతలు. ఇంతకు ఆయన దేనిపై ప్రశ్నించారు అంటే..

Pawan Kalyan: సీట్ల పంపకం అంశంపై మాజీ మంత్రి హరిరామజోగయ్య పవన్‌కు లేఖ రాశారు. దానిలో ఆయన సంధించిన ప్రశ్న నిజమే అంటున్నారు జనసేన నేతలు. ఇంతకు ఆయన దేనిపై ప్రశ్నించారు అంటే..

  • Published Jan 27, 2024 | 5:00 PMUpdated Jan 27, 2024 | 5:23 PM
జనసేన ఎదగకపోవడానికి కారణం చంద్రబాబా..? పవన్‌ కళ్యాణా?: హరి రామయ్య జోగయ్య

రానున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని కూటమిగా కలిసి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. పొత్తు గురించి అయితే ప్రకటించాయి కానీ.. సీట్ల పంపిణీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇదిలా ఉండగా.. ఇరు పార్టీలు ఎవరికి వారే తమ పార్టీ పోటీ చేయబోయే నియోజకవర్గాల పేర్లు ప్రకటిస్తున్నాయి. ఇవన్నీ చూస్తేంటే.. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు కూడా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగడం కష్టమే అంటున్నారు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ ధోరణిపై జనసేన పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీలో ఎంత అవమానం జరిగినా.. సర్దుకుపోవాల‍ంటూ పవన్‌ సూచించడం జనసేన కేడర్‌కు రుచించడం లేదు. ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి హరిరామయ్య జోగయ్య శాస్త్రి సీట్ల అంశానికి సంబంధించి పవన్‌ కళ్యాణ్‌కు లేఖ రాశారు.

ఈ లేఖలో జనసేన ఎన్ని సీట్లు అడగాలో తెలిపిన హరిరామ జోగయ్య.. జనసేన పార్టీ ఎదగకపోవడానికి చంద్రబాబు నాయడు కారణమా.. లేక పవన్‌ కళ్యాణ్‌ సర్దుకుపోయే ధోరణి కారణమా అని ప్రశ్నించారు. అంతేకాక జనసేన కేవలం 25-30 సీట్లు అడగటం విఫల ప్రయోగం అవుతుంది అన్నారు. రానున్న ఏపీ ఎన్నికల కోసం జనసేన 50 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలు అడగాలని సూచించారు. పొత్తు ధర్మానికి తూట్లు పొడిచి.. టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాక జనసేన ఎదుగుదలకు టీడీపీ అడ్డమా.. లేక పవన్‌ కళ్యాణ్‌ సర్దుకుపోయే ధోరణే కారణమా అని ప్రశ్నించారు.

అయితే ఈ లేఖలో హరిరామ జోగయ్య సంధించిన ప్రశ్న నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, జనసేన కేడర్‌. తమ పార్టీ ఎదగకపోవడానికి కారణం చంద్రబాబు మాత్రమే కాదని.. పవన్‌ కళ్యాణ్‌ ధోరణి కూడా ప్రధాన కారణం అంటున్నారు జనసేన నేతలు, కార్యకర్తలు. కేవలం తన స్వార్థం కోసమే చంద్రబాబు.. జనసేనతో పోత్తు పెట్టుకున్నారు అన్నది జగమెరిగిన సత్యం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవినీతి నిర్మూలనే తమ లక్ష్యమని చెప్పిన.. పవన్‌ కళ్యాణ్‌.. తీరా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న రోజునే.. జనసేన పార్టీ విశ్వసనీయతపై చాలామందికి అనుమానాలు వచ్చాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సరే అధికారంలోకి రావడం కోసమే పొత్తు పెట్టుకున్నారు అనుకుందాం.. మరి అందులో పవన్‌ కళ్యాణ్‌కు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు.. ఒకవేళ గెలిస్తే.. పవన్‌ను సీఎం చేస్తారా అంటే.. లేదని ఇప్పటికే లోకేష్‌ కుండబద్దలు కొట్టారు. సీట్ల విషయంలో ఏమైనా న్యాయం చేస్తారా అంటే.. జనసేనకు 20 లోపు సీట్లు ఇవ్వడమే ఎక్కువ అంటున్నారట టీడీపీ నేతలు. ఇటు మర్యాద లేక.. అటు సీట్ల విషయంలో అన్యాయం జరుగుతున్నా పట్టించుకోని పవన్‌ ధోరణి చూసి కేడర్‌ నిరాశనిస్పృహలో కూరుకుపోయారని అంటున్నారు.

టీడీపీ వాళ్లు ఎన్ని అవమానాలు చేస్తున్నా.. సర్దుకుపోవాలని చెప్తోన్న పవన్‌ ధోరణి జనసేన నేతలకు నచ్చడం లేదట. పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేసిన వారిని కూడా ఆయన పట్టించుకోవడం లేదని.. దాంతో కీలక నేతలంతా సైలెంట్‌ అయ్యారు.. కొందరు పార్టీ నుంచి బయటకు వెళ్లి పోతున్నారని.. దాంతో పార్టీ మరింత బలహీనపడుతుందని అంటున్నారు. పార్టీ ఎదగకపోవడానికి చంద్రబాబుతో పాటు.. పవన్‌ కళ్యాణ్‌ వైఖరి కూడా కారణమే అంటున్నారు జనసేన నేతలు, రాజకీయ విశ్లేషకులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.