ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతం సవాంగ్

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్‌ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో గౌతమ్‌ సవాంగ్‌ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించాక ఆయన ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ ఉద్యోగులు, సిబ్బంది గౌతమ్‌ సవాంగ్‌కు అభినందనలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే 2019 జూన్‌ 1న రాష్ట్ర డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌ బాధ్యతలు చేపట్టారు.

అప్పటి నుంచి ఈనెల 15 వరకూ డీజీపీ పోస్టులో కొనసాగారు. రెండేళ్ల 8 నెలల 15 రోజుల పాటు ఆయన డీజీపీ పదవిలో ఉన్నారు. 2023 జులై నెలాఖరు వరకూ ఆయనకు సర్వీసు ఉండగా ఆయనను ఏపీపీఎస్సీ ఛైర్మన్​గా నియమించటం చర్చనీయాంశమైంది. ఇంకేముంది వైయస్ జగన్, లేదా ప్రభుత్వానికి ఎప్పుడు టార్గెట్ చేయాలా అని చూస్తూ ఉండే టీడీపీ అనుకూల మీడియా ఈ విషయంలో కూడా రాద్ధాంతం మొదలుపెట్టింది. ఇండియన్ పోలీస్ సర్వీసులో ఉన్న ఒక అధికారిని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోకి ఎలా మారుస్తారు? అంటూ కామెంట్లు మొదలయ్యాయి. రాజ్యంగబద్ధమైన ఆ పదవిని స్వీకరించాలంటే విశ్రాంత ఐఏఎస్‎లు, ఐపీఎస్ లు, ఇతర ప్రభుత్వ సెక్టర్ లోని ఉన్నత పదవుల్లో విధులు నిర్వర్తించిన వ్యక్తులకు కట్టబెడతారు. ఒక ఐపీఎస్ ను ఈ పదవిలో తెచ్చి కూర్చోపెట్టడం సబబే కాదంటూ ప్రచారం చేశారు.

కానీ అదేదీ నిజం కాదని ఆయన బాధ్యతల స్వీకరణ రుజువు అయింది. నిజానికి రాష్ట్రానికి కేటాయించిన అధికారులను ఏ విధంగా అయినా వాడుకొనే అధికారం రాష్ట్రానికి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలు నచ్చకపోతే అప్పుడు తమ తమ అధికార సంఘాల ద్వారా ఆ బాధ్యతలు నచ్చలేదు కాబట్టి వేరే పదవి కోసం వారు దరఖాస్తు చేసుకునే హక్కు కూడా ఉంది. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను ఎందుకు ఈ పదవిలో కూర్చోబెట్టారనే విషయం మీద పూర్తి అవగాహన ఉన్న గౌతమ్ సవాంగ్ తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. అనవసరంగా నోరు పారేసుకున్న వారు ఇప్పుడు నోళ్ళు వెళ్ళబెట్టల్సి వచ్చింది.

Show comments