Idream media
Idream media
అందుకే ఆలోచించాలి. ఆలోచించా కే స్పందించాలి అంటారు. రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని ఎక్కడ ఏ ఘటన జరిగినా ప్రభుత్వం పై బురద జల్లుధామని ప్రయత్నిస్తే అది మన మీదే పడుతుందని చంద్ర బాబుకు గతంలో కూడా అనుభవమే. ఇప్పుడు చిత్తూరు జిల్లా ఘటనలో మరో సారి రుజువైంది. బి. కొత్తపేటలో రామచంద్ర అనే వ్యక్తిపై కొందరు దాడి చేశారు. ఈ రామచంద్ర సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ సోదరుడు. రామకృష్ణ సోదరుడిపై దాడి జరగగానే చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు అప్పటికప్పుడు డీజీపీకి లేఖ రాసేశారు. రామచంద్రపై దాడి వెనుక వైసీపీ ఉందని ఆ లేఖలో ఆరోపించారు.
అసలు విషయాలు వెలుగులోకి..
నిందితులను 24 గంటల్లోగా అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళావెంకట్రావ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాలను బయటపెట్టారు. ఈ దాడి చేసింది టీడీపీ నాయకుడేనని దర్యాప్తులో తేలింది. టీడీపీ నాయకుడు ప్రతాప్ తన కారులో వెళ్తున్న సమయంలో ఒక ఇరుకు గల్లీలో తోపుడు బండి ఉండడం చూసి కారుకు దారి ఇవ్వాలని కోరాడు. అందుకు తోపుడి బండి అతడు సానుకూలంగా స్పందించలేదు. దాంతో కారు దిగిన ప్రతాప్… తోపుడు బండి వ్యక్తితో వాగ్వాదానికి దిగగా అక్కడే ఉన్న ఈ రామచంద్ర జోక్యం చేసుకున్నాడు. దాంతో ప్రతాప్‌తో పాటు కారులో ఉన్న మరో ముగ్గురు కలిసి రామచంద్రను కొట్టారు. దాడి చేసిన ప్రతాప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు రామచంద్ర అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని, వాగ్వాదానికి దిగడంతో ఆ సమయంలో గొడవ జరిగిందని పోలీసులకు వివరించాడు. దాంతో చంద్రబాబునాయుడు చేసిన ప్రచారం తుస్సుమంది.
వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయకండి : బాబుకు డీజీపీ కౌంటర్ లెటర్
రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడి విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాసిన లేఖకు డీజీపీ సమాధానంగా ప్రతి లేఖ రాశారు. చంద్రబాబు చేసిన ఆరోపణలు అవాస్తవమని వివరిస్తూ వాస్తవాలను లేఖలో వెల్లడించారు. రామచంద్రపై దాడి కేసు దర్యాప్తు వేగంగా సాగుతోందని వివరించారు. దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. కారులో వెళ్తున్న ప్రతాప్ రెడ్డికి, రామచంద్రకు మధ్య తోపుడు బండి వద్ద గొడవ జరిగిందని డీజీపీ వివరించారు. గొడవ జరిగిన సమయంలో రామచంద్ర మద్యం మత్తులో ఉన్నట్టు వైద్యులు నిర్దారించారని డీజీపీ స్పష్టం చేశారు. దాడి చేసిన ప్రతాప్ రెడ్డి టీడీపీ కార్యకర్త అని వివరించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదని చంద్రబాబుకు సూచించారు. ఏవైనా ఆధారాలుంటే ఇవ్వాలని వాటి ఆధారంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారు.