iDreamPost
android-app
ios-app

కౌంటింగ్ వేళ ఈ తప్పులు చేయకండి.. ఏకంగా రౌడీ షీట్లు ఓపెన్ అయ్యే అవకాశం

ఎన్నికలు ముగిశాయి. ఫలితాలకు కూడా సమయం ఆసన్నమైంది. ఇప్పటి ఎగ్జిట్ పోల్స్ వచ్చి గందరగోళ పరిస్థితులను నెలకొల్పాయి. ఇదిలా ఉంటే.. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా జూన్ 4 రాబోతున్నాయి. అయితే ఈ తప్పులు చేయొద్దు.

ఎన్నికలు ముగిశాయి. ఫలితాలకు కూడా సమయం ఆసన్నమైంది. ఇప్పటి ఎగ్జిట్ పోల్స్ వచ్చి గందరగోళ పరిస్థితులను నెలకొల్పాయి. ఇదిలా ఉంటే.. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా జూన్ 4 రాబోతున్నాయి. అయితే ఈ తప్పులు చేయొద్దు.

కౌంటింగ్ వేళ  ఈ తప్పులు చేయకండి.. ఏకంగా రౌడీ షీట్లు ఓపెన్ అయ్యే అవకాశం

దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి ముగిసింది. ఫలితాల సమయం వచ్చేసింది. అటు పార్లమెంట్ ఫలితాలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ కూడా ఈ నెల 4న తేలనున్నాయి. అందరి చూపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పడింది. తమదే గెలుపంటే తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.. ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ, అలాగే ప్రతి పక్ష కూటమి. ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. ఏపీలో అదనపు బలగాలు కూడా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరికలు జారీ చేశారు.

మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కొంత మంది అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. కావున ఇటువంటి తప్పులు చేస్తే ఊచలు లెక్కపెట్టే అవకాశాలు ఉన్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్లకూడదు. బహిరంగ ప్రదేశంలో గుంపులు గుంపులుగా నిలబడకూడదు. అనుమతి ఉన్న వారు మాత్రమే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉండాలి. ఇక అధికారుల అనుమతి లేనిదే లోపలికి ఎంటర్ కాకూడదు. ఎలాంటి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయకూడదు. అలాగే భారీ స్థాయిలో ఫంక్షన్స్, పార్టీలు చేయరాదు. అలాగే ప్రయాణాలు కూడా మానుకోవడం మంచిది. ఎలాంటి రాజకీయ దూషణలు చేయకూడదు. ఒక పార్టీని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. కవ్వింపు చర్యలకు పాల్పడకూడదు.. ఫలితాల విషయంలో బయట వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదు.

అలాగే సామాజిక మాధ్యమాల్లో కూడా ఎలాంటి విద్వేషపూరిత పోస్టులు చేయరాదు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు ఏపీ డీజీపీ హరీష్ గుప్తా. సోషల్ మీడియాలో స్పెషల్ ఫోకస్ పెట్టారు. పోస్టులపై నిరంతర నిఘా పెట్టేందుకు స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దించారు. రెచ్చగొట్టే పోస్టులు, ఫోటోలు, వీడియోలు ఎలాంటి సోషల్ మీడియా వేదికల్లో పెట్టరాదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా వాట్సప్‌లో వివాదాస్పద పోస్టులు పెడితే.. వారిపై ఐటి యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటున్నారు పోలీసులు. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని, గ్రూప్ అడ్మిన్లు జాగ్రత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు మే 13న ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఇటు తెలంగాణలో కూడా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలు కూడా రేపే రానున్నాయి.