Dharani
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. గాజు గ్లాస్ గుర్తుపై ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. గాజు గ్లాస్ గుర్తుపై ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో నెలరోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే అటు వైసీపీ, ఇటు విపక్ష కూటమి ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతున్నాయి. ఇదిలా ఉండగా ఎన్నికలు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జనసేన పార్టీకి కేంద్ర ఎలక్షన్ కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. జనసేన గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఈసీ నిర్ణయంతో జనసేన నేతలు ఖంగు తిన్నారు. ఎన్నికల ముందు ఇలాంటి నిర్ణయం వెలువడటం ఆ పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని వాపోతున్నారు. జనసేన గుర్తుగా గాజు గ్లాస్ గుర్తింపు తెచ్చుకున్న తరుణంలో దాన్ని ఫ్రీ సింబల్స్ జాబితాలోకి చేర్చడం చర్చనీయాంశంగా మారింది.
దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది. దీనిలో ఏపీ నుంచి వైసీపీ, టీడీపీ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో నిలిచాయి. తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు దక్కించుకున్నాయి. ఇక ఈ పార్టీలకు గతంలో కేటాయించిన గుర్తులను రిజర్వ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
ఇదిలా ఉంటే జనసేన పార్టీని కేవలం రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో చేర్చింది ఈసీ. దాన్ని ప్రాంతీయ పార్టీగా గుర్తించలేదు. అంతేకాక ఆ పార్టీ గుర్తుగా గుర్తింపు పొందిన గాజు గ్లాస్ గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఇది జనసేన పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది సీఈసీ. అంతేకాక గత సార్వత్రిక ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జనసేన పార్టీకి చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం ‘గాజు’ గ్లాసును ఫ్రీ సింబల్‌గా ప్రకటించింది. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా ముందుకెళ్తారో చూడాలి.
ఎన్నికల సంఘం.. ఎలక్షన్స్ లో పోటీ చేయబోయే పార్టీల కోసం కొన్ని గుర్తులను రిజర్వ్ చేసి ఉంచుతుంది. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు వాటి గుర్తులను కేటాయిస్తుంది. ఇక మిగతా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల కోసం ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గుర్తులను కేటాయిస్తుంది. ఇక గతంలో వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికల్లో జనసేన గుర్తు అయిన గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది ఈసీ. నవతరం పార్టీ అభ్యర్థికి ఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించిన సంగతి తెలిసిందే.
ఇక ఒక పార్టీకి గుర్తింపు ఉండాలన్నా, ఓ గుర్తు ఉండాలన్నా.. ఎన్నికల్లో పోటీ చేయాలి, ఈసీ నియమావళి ప్రకారం ఓటింగ్ శాతం ఉండాలి. కానీ జనసేన మాత్రం ఓటమి భయంతో.. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం త్యాగాల పేరుతో ప్రతి సారి పోటీ నుంచి తప్పుకుంటుంది. పోనీ పోటీ చేసిన చోట అయినా గెలిచిందా అంటే.. అదీ లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ సీటు గెల్చుకుంది. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే కూడా చేజారారు. దాంతో గ్లాస్ గుర్తు పదే పదే ఫ్రీ సింబల్స్ జాబితాలో చేరుతుంది.