iDreamPost
android-app
ios-app

Janasena: 24 కాదు.. 21మాత్రమే.. మరో 3 సీట్లు కోల్పోయిన జనసేన!

  • Published Mar 12, 2024 | 10:50 AM Updated Updated Mar 12, 2024 | 10:52 AM

24 సీట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జనసేన నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు కోలుకోలేని షాక్‌ ఇచ్చాడు. సీట్లను మరింత తగ్గించాడు. ఆ వివరాలు..

24 సీట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జనసేన నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు కోలుకోలేని షాక్‌ ఇచ్చాడు. సీట్లను మరింత తగ్గించాడు. ఆ వివరాలు..

  • Published Mar 12, 2024 | 10:50 AMUpdated Mar 12, 2024 | 10:52 AM
Janasena: 24 కాదు.. 21మాత్రమే.. మరో 3 సీట్లు కోల్పోయిన జనసేన!

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది.. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కుతుంది. ఓవైపు అధికార పార్టీ ఒక్కటే ఒంటరిగా రంగంలోకి దిగుతుండగా.. మరో వైపు బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ మూడు పార్టీల మధ్య పొత్తు గురించి ఇప్పటికి ఓ స్పష్టత వచ్చింది. కూటమి మధ్య సీట్ల పంపకం కూడా ఫైనల్‌ అయ్యింది. బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు జరిగింది. బీజేపీ ఎక్కువ స్థానాలు కోరడంతో ఆ పార్టీకి సీట్ల సర్దుబాటు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన సీట్లలో కోత వేశారు.

ఇప్పటివరకు జనసేనకిచ్చే 24 అసెంబ్లీ స్థానాల్లో మూడు సీట్లు తగ్గించి 21 స్థానాలతో సరిపెట్టారు. ఫైనల్‌గా చూస్తే.. బీజేపీ, జనసేనకు కలిపి 31 ఎమ్మెల్యే, 8 ఎంపీ సీట్లను కేటాయించాడు చంద్రబాబు. ఇక టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు మూడు పార్టీల ఉమ్మడి ప్రకటనను చంద్రబాబు సోమవారం రాత్రి ట్విట్టర్‌లో విడుదల చేశారు. 31 ఎమ్మెల్యే సీట్లలో 21 స్థానాల్లో జనసేన, 10 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనన్నాయి.

అయితే అంతకు ముందు జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, మూడు ఎంపీ సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. కానీ ముందే ఎంపీ సీట్లలో ఒకటి తగ్గించడంతో జనసేన కేవలం 2 లోక్‌సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేయనుంది. అటు చూస్తే.. బీజేపీకి ఏకంగా 6 ఎంపీ స్థానాలు కేటాయించారు. ఇప్పటికే 24 అసెంబ్లీ స్థానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జనసేన నేతలు, కార్యకర్తలు.. తాజా పరిణమాలను ఎలా చూడాలో అర్థం కాక పిచ్చెక్కిపోతున్నారు.

తమ పార్టీకి మరి కొన్ని సీట్లు కేటాయిస్తారని భావిస్తోన్న వేళ.. అనూహ్యంగా ఇచ్చిన 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాల్లోంచి మరి కొన్నింటిని లాక్కోవడం చూసి వారు షాక్‌కు గురయ్యారు. తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌.. చంద్రబాబు నాయుడికి ఈ రేంజ్‌లో సరెండర్‌ అవుతాడని వారు ఏమాత్రం ఊహించలేదు. అసలు పవన్‌ నిర్ణయాలను ఎలా అర్థం చేసుకోవాలో వారికి పాలుపోవడం లేదు.

ఎంతోమంది కార్యకర్తలు నేతలు ఐదేళ్లుగా జనసేన పార్టీ కోసం పని చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఎక్స్‌పెక్ట్‌ చేయడమే కాక.. అందుకు తగ్గట్టుగా నియోజకవర్గాల్లో పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. అదుగో అలాంటి వారి ఆశల మీద పవన్‌ చల్లని నీళ్లు కుమ్మరించి.. అడియాసలు చేశాడు. పొత్తులో భాగంగా కనీసం 50-60 సీట్లు జనసేనకు వస్తాయని భావిస్తే.. అందులో సగం కూడా కేటాయింకపోవడం.. పైగా తొలి జాబితాలో ఇచ్చిన సీట్లకే కోత పెట్టడం చూసి వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

ఇక తాజా నిర్ణయం వల్ల మరో మూడు సీట్లు జనసేన ఖాతా నుంచి చేజారిపోతున్నాయి. ఇప్పటికే తీవ్ర అసంతృప్తిలో ఉన్న కేడర్‌.. తాజా పరిణామాలపై ఎలా స్పందించాలో అర్థం కాకుండా దిక్కులు చూసే పరిస్థితిలో ఉంది. ఇంత తక్కువ సీట్లతో ఇక మనమే రాజ్యాధికారం సాధిస్తాం.. అసలు పవన్‌ ఎందుకు ఇంతలా చంద్రబాబుకు లొంగిపోయారు.. జగన్‌ అంటే ఆయనకు ఇంత భయమా.. కనీసం 25 స్థానాల్లో కూడా పోటీ చేయకపోతే ప్రయోజనం ఏంటి అని కామెంట్స్‌ చేస్తున్నారు.