Volunteer System: జగన్ పథకాలు అద్భుతం.. వాలంటరీ వ్యవస్థ సూపర్: చంద్రబాబు నాయుడు!

అట్టు తిరగేసినంత ఈజీగా మాట మార్చడం చంద్రబాబు నైజం. ఇన్నాళ్లు వాలంటీర్‌ వ్యవస్థ మీద నానా ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు తాజాగా మాట మార్చి.. అద్భుతం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఆ వివరాలు..

అట్టు తిరగేసినంత ఈజీగా మాట మార్చడం చంద్రబాబు నైజం. ఇన్నాళ్లు వాలంటీర్‌ వ్యవస్థ మీద నానా ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు తాజాగా మాట మార్చి.. అద్భుతం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపుతూ.. ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు చేరేలా చేయడం.. ఎలాంటి అవినీతికి తావులేకుండా పాలన సాగాలనే ఉద్దేశంతో వాలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చారు సీఎం జగన్‌. దీని వల్ల యువతకు ఉన్న ఊరిలో ఉపాధి కల్పించడంతో పాటు.. ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల వద్దకే తీసుకెళ్లే అవకాశం కల్పించారు. ప్రతి నెల మొదటి తేదీన వాలంటీర్లు.. అవ్వాతాతల ఇళ్ల దగ్గరకు వెళ్లి వారికి పెన్షన్‌ అందిస్తూ.. ఆ వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఏపీలోని వాలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్నారు.

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ బలంగా పాతుకునిపోయింది అన్నది వాస్తవం. వారి ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్నా సరే.. విపక్షాలు మాత్రం.. వాలంటీర్ల మీద ఎన్నో ఆరోపణలు చేశారు. ఇది రాజ్యాంగేతర వ్యవస్థ అని నాలుగున్నరేళ్ల నుంచి టీడీపీ విమర్శించగా.. ఇక జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అయితే.. రాష్ట్రంలో మహిళల మిస్సింగ్‌కు వాలంటీర్లే కారణం అంటూ.. వారిపై అనేక ఆరోపణలు చేశాడు. వారిని ఇళ్ల వద్దకు కూడా రానీయవద్దు అని పేర్కొన్నారు విపక్ష నేతలు.

అంతేకాక వారిని సంంఘవ్యతిరేక శక్తులుగా పోల్చారు కూటమి నేతలు. ఇక గత నాలుగున్నరేళ్లుగా వాలంటీర్ల మీద నానా ఆరోపణలు చేసిన టీడీపీ అధ్యక్షుడు.. ఇప్పుడు మాత్రం సడెన్‌గా మాట మార్చి.. వాలంటీర్‌ వ్యవస్థ సూపర్‌ అంటూ ప్రశంసించి.. మరో సారి తన రెండు నాల్కల ధోరణిని బయటపెట్టుకున్నాడు.

సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో రా.. కదలిరా.. పేరిట బహిరంగసభను నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. జగన్‌ ప్రవేశపెట్టిన పథకాలు సూపర్‌ అంటూ ప్రశంసలు కురిపించాడు. అంతేకా వకాలంటీర్‌ వ్యవస్థ అద్భుతం అని.. ఒకవేళ తాము గెలిస్తే.. వాలంటీర్లను తొలగించమని.. కొనసాగిస్తామని చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లు వాలంటీర్లు అంటే సంఘ విద్రోహ శక్తులు.. జగన్‌ సర్కార్‌ అములు చేస్తోన్న పథకాలు పంచుడు పథకాలు అన్న చంద్రబాబు.. వాటిని కూడా ప్రశంసించడం.. ఆసక్తికరంగా మారింది.

ఇక బాబు మాటలు విన్న వారు.. ఇది కదా మీ అసలు నైజం.. ఇన్నాళ్లు వాలంటీర్లు, జగన్‌ పథకాలపై విమర్శలు చేశారు. కానీ జనాలు వాటికే జై కొడుతున్నారు. ఆ విషయం గ్రహించిన మీరు ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నారు. కానీ ప్రజలు మరి అంత అమాయకులు కాదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు.

Show comments