Dharani
పేదల చదువంటే చంద్రబాబుకు ముందు నుంచి చిన్నచూపే. 21 ఏళ్ల క్రితం కూడా ఇలానే తన అక్కసు ప్రదర్శించాడు చంద్రబాబు. అసలేం చేశాడంటే..
పేదల చదువంటే చంద్రబాబుకు ముందు నుంచి చిన్నచూపే. 21 ఏళ్ల క్రితం కూడా ఇలానే తన అక్కసు ప్రదర్శించాడు చంద్రబాబు. అసలేం చేశాడంటే..
Dharani
పేదలంటేనే చంద్రబాబుకు ఎక్కడా లేని చిన్న చూపు. ఆయన అధికారంలోకి రావడానికి వారి ఓట్లు కావాలి.. ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం వారిని పట్టించుకోడు. ముందు నుంచి చంద్రబాబుది ఇదే వైఖరి. పేదలు బాగుపడకూడదు.. వారికి నాణ్యమైన విద్య అందకూడదు. అందుకే చంద్రబాబు తాను అధికారంలో ఉండగా.. కావాలని పనిగట్టుకుని ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి.. నారాయణ విద్యాసంస్థలకు ఎనలేని మేలు చేశాడు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విద్యా రంగంలో తీసుకువచ్చిన మార్పుల కారణంగా నేడు ప్రభుత్వ పాఠశాలల రూపరేఖలు మారడమే కాక.. అక్కడ చదువుకునే విద్యార్థులు అంతర్జాతీయ వేదికలు మీద సత్తా చాటుతున్నారు.
ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన సమయంలో చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు, ఆ పార్టీ అనకూల మీడియా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కావాలని పని గట్టుకుని దీనిపై దుష్ప్రచారం చేశారు. ఇంగ్లీష్ మీడియం వల్ల విద్యార్థులు వెనకబడతారని అసత్య ప్రచారం చేశారు. కానీ వాటన్నింటిని పటాపంచలు చేస్తూ.. నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అంతర్జాతీయ వేదికల మీద అనర్గళంగా ఆంగ్లం మాట్లాడుతూ సత్తా చాటుతున్నారు. అయితే పేదల చదువుపై చంద్రబాబు అక్కసు ఇప్పటిది కాదు. సుమారు 21 ఏళ్ల క్రితం కూడా ఆయన ఇలానే వ్యవహరించారు. ఆ నగ్న సత్యాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ వివరాలు..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇడుపులపాయ, బాసర, నూజివీడు ప్రాంతాల్లో ఐఐఐటీలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి.. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఇక్కడ ఇంటర్ ప్లస్, బీటెక్ పూర్తిగా ఉచితంగా చదువుకునే అవకాశం ఉంది. దీనికి శ్రీకారం చుట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజశేఖర్‌రెడ్డి. వీటిల్లో 2 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఆలోచన వెనక ఉన్న వ్యక్తి ప్రొఫెసర్ రాజ్ రెడ్డి. ఆయన ఎవరంటే.. లోకేష్‌కి అమెరికా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీటు ఇప్పించిన వ్యక్తి.
అయితే రాజ్‌రెడ్డి ముందుగా ఐఐఐటీల వ్యవస్థాపన గురించి చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు. తెలుగు వారిని సాంకేతిక విద్యలో గొప్ప విద్యార్థులుగా తీర్చుద్దాలని ప్రణాళికతో చంద్రబాబు దగ్గరికి వచ్చాడు రాజ్ రెడ్డి. పదో తరగతి పూర్తి కాగానే రాష్ట్రంలో ప్రతీ మండలం నుండి ఒకరు చొప్పున టాపర్‌లని తీసుకొచ్చి వాళ్లకి ఇంటర్+ఇంజనీరింగ్ ఒకేచోట చదువుకునే అవకాశం కల్పించడమే కాక.. ప్రతీ విద్యార్థికి సొంతగా ల్యాప్టాప్, క్లాస్‌లో రెండు ప్రొజెక్టర్లు, లెర్నింగ్ బై డూయింగ్ పద్దతిలో ఉచితంగా 6 ఏళ్ల కోర్సును ఇప్పించేందుకు ఒక యూనివర్సిటీని పెడితే బాగుంటుందని చెప్పాడు.
అయితే రాజ్ రెడ్డి దీని గురించి చెప్పడం పూర్తి కాకముందే చంద్రబాబు తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతమందికి కంప్యూటర్లు ఇచ్చి, 6 ఏళ్లు ఉచితంగా చదువు చెప్పాలా.. అసలు ఎలా సాధ్యం. పిచ్చి వాడి ఆలోచన.. ఇది సాధ్యం కాదని తేల్చి చెప్పాడు. దాంతో అది మూలన పడింది. ఆ తర్వాత వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక పేద విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ వంటి కోర్సులను ఉచితంగా చదవాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్‌మెంట్ తీసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న రాజ్ రెడ్డి.. వైఎస్ దగ్గరకి వచ్చి.. బాబుకు చెప్పిన ఆలోచనను చెప్పాడు.
రాజ్ రెడ్డి చెప్పిన పది నిమిషాల్లోనే రాజశేఖర్‌రెడ్డి ఆయన ఆలోచనకు ఆమోదం తెలిపారు. ఏడాది తిరిగేలోగా బాసర, నూజివీడు, ఇడుపులపాయలో ఐఐఐటీలు ఏర్పాటు చేయడమే కాక.. వాటికి ఛాన్స్లర్‌గా రాజ్ రెడ్డినే నియమించారు. నాడు సాహసించి వైఎస్సార్ తీసుకున్న నిర్ణయం నేడు వేలాది మంది పల్లెటూరి విద్యార్థుల అభివృద్ధికి కారణం అయ్యింది.
పేదవారికి నాణ్యమైన విద్య అందించడం కోసం నాడు వైఎస్సార్ ఒక అడుగు ముందుకు వేస్తే.. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ మరో పదడుగులు ముందుకు వేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా సరే.. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. నాడు నేడు కింద పాఠశాలల రూపు రేఖలు మార్చారు. విద్యార్థులకు అవసరం అయ్యే ప్రతీది ప్రభుత్వమే ఇవ్వడం కాక.. వారికి ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. ఈరోజు లక్షల్లో ఫీజు తీసుకునే కార్పోరేట్ బడుల్లో కూడా లేని అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించారు. మంత్రి రికమండేషన్ చేసినా కూడా సీటు ఇవ్వని ఆక్రిడ్జ్ స్కూల్ నుండి ఐక్యరాజ్యసమితి లో ప్రసంగించడానికి ఇప్పటి వరకు ఎంత మంది వెళ్లారు.. అంటే సమాధానంలేదు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద గ్రామీణ పిల్లలు అక్కడివరకూ వెళ్లగలిగారు అంటే అది జగన్ తీసుకున్న నిర్ణయం వల్లనే.