iDreamPost
android-app
ios-app

ఐఐఐటీ విద్యార్థిని స్వాతి మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వారిపై..

  • Published Nov 15, 2024 | 1:08 PM Updated Updated Nov 15, 2024 | 1:08 PM

Basar IIIT Campus: బాసర ట్రిపుల్ ఐటీలో స్వాతిప్రియ(17) అనే విద్యార్ధిని క్యాంపస్ లోని తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు స్వాతి ఆరు పేజీల సూసైడ్ నోట్ లో ఎన్నో కీల విషయాల గురించి రాసింది.

Basar IIIT Campus: బాసర ట్రిపుల్ ఐటీలో స్వాతిప్రియ(17) అనే విద్యార్ధిని క్యాంపస్ లోని తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు స్వాతి ఆరు పేజీల సూసైడ్ నోట్ లో ఎన్నో కీల విషయాల గురించి రాసింది.

ఐఐఐటీ విద్యార్థిని స్వాతి మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వారిపై..

ఈ మధ్య కాలంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఆ విద్యార్థు క్యాంపస్‌లోకి అడుగుపెట్టి.. అదే క్యాంపస్ లో బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో స్వాతిప్రియ(17) అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు స్వాతి ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసింది. అమ్మా, నాన్న మీరు నాపై ఉంచిన ఆశలు నిలబెట్టుకోలేకపోతున్నా నన్ను క్షమించండి అంటూ రాసిన లేఖ కంటతడి పెట్టిస్తుంది. తాను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నా అన్న విషయం లేటర్ లో రాసింది.  పూర్తి వివరాల్లోకి వెళితే..

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ప్రియు ఆత్మహత్య తీవ్ర సంచలనం రేపింది. ఆమె సూసైడ్ నోట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.   గత నెల 4న నన్ను సినియర్ విద్యార్థిని బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి బూతులు తిడుతూ వేధిస్తున్నాడు. నిన్ను కాలేజ్ లో అల్లరి పాలు చేస్తా అంటూ బెదిరిస్తున్నాడు. ఈ విషయం కాలేజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని నోట్ లో పేర్కొంది. విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా ట్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ప్రియ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ రణధీర్, డీన్‌లు పావని, నాగరాజ్, కేర్ టేకర్ స్రవంతి పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే స్వాతిప్రియపై వేధింపులకు కారణమైన ఇద్దరు విద్యార్థులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.గత కొన్నిరోజులుగా స్వాతి విషయంలో ఆ ఇద్దరు స్టూడెంట్స్ దారుణంగా ప్రవర్తిస్తున్నారని, వారి వేధింపుల వల్లే స్వాతి తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. స్వాతి సూసైడ్ లెటర్ లో మాత్రం ఎవరి పేర్లు లేకపోవడంతో.. వ్యక్తిగత కారణాలతోనే బలవన్మరణానికి పాల్పపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తనకు వరుసన కాని బంధువుని ప్రేమిస్తుందని, ఆ విషయం ఇంట్లో చెప్పడం.. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పపడి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వాతాి తన ఇబ్బందిని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదన్న ఆరోపణలతో అధికారులపై కేసు నమోదు చేయడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. మరోవైపు బుధవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ అవినాశ్ కుమార్ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి పరిస్థితి సమీక్షించారు. ట్రిపుల్ ఐటీ అధికారులపై కేసు నమోదు చేసిన విషయం వాస్తవమే అని బాసర ఎస్సై తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన స్వాతి ప్రియ.. బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతుంది. సోమవారం ఉదయం తోటి విద్యార్థులు టిఫిన్ చేయడానికి వెళ్లిన సమయంలో తన రూమ్ లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బంగారం లాంటి భవిష్యత్ ఉన్న తమ కూతురు అర్థాంతరంగా చనిపోవడానికి కారకులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.