నాడు తండ్రి.. నేడు కుమారుడు.. బాలయ్యకు తప్పని వెన్నుపోటు

తెలుగు రాజకీయాల్లో వెన్నుపోటు అనగానే.. పిల్లనిచ్చిన మామ నందమూరి తారక రామరావుకి.. అల్లుడు చంద్రబాబు నాయుడు పొడిచిన వెన్నుపోటు సీనే గుర్తుకు వస్తుంది అని వైసీపీ నేతలు, దర్శకుడు ఆర్జీవీ బల్ల గుద్ది చెబుతారు. మామ దగ్గర నుంచి పార్టీని లాక్కున్నాడు. తాను తప్ప.. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను ఎవరిని పార్టీ దరిదాపుల్లోకి రానియలేదు అని వైసీపీ వర్గాలు విమర్శలు చేస్తాయి. బాలకృష్ణ మాత్రం తన వియ్యంకుడు కావడంతో.. ఆయన వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని భావించి.. ఆయనను ఒక్కడినే చేరదీశాడని చెబుతుంటారు. తన తర్వాత వారసుడిగా కుమారుడు లోకేష్‌ మాత్రమే ఉండాలని భావించాడు కనుకే.. జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఎంతటి ప్రజాదరణ ఉన్నా.. కనీసం పార్టీ దరిదాపుల్లోకి రాకుండా చేశాడంటూ.. ఇతర పార్టీల నేతలు అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు. టీడీపీ అంటే.. తాను లేదంటే తన కొడుకు లోకేష్‌ అన్నట్లు వ్యవహరించాడు చంద్రబాబు అనే విమర్శ కూడా ఉంది.

అయితే తాజాగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన తర్వాత చంద్రబాబుకి తాను చేసిన తప్పు ఏంటో అర్థం అయ్యింది. లోకేష్‌ బలమైన నేతగా ఎదగలేకపోయాడు.. క్యాడర్‌ను ముందుండి నడిపించగల మరో నేత పార్టీలో లేదు. ఇదుగో ఇలాంటి సమయంలో.. బాలకృష్ణ కాస్త దూకుడుగా కనిపించాడు. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత బాలకృష్ణ.. తన బావ చంద్రబాబు సీట్లో కూర్చుని.. టీడీపీ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ తొలి సమావేశాం నిర్వహించారు. ఇక బాబు అరెస్ట్‌కు నిరసనగా.. అసెంబ్లీలో బాలయ్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దాంతో ఇక టీడీపీకి తదుపరి అధ్యక్షుడు బాలయ్యే అనే ప్రచారం ఊపందుకుంది.

ఈ ప్రచారం ఇలా సాగుతుండగానే.. తాజాగా బాలయ్యకు భారీ షాక్‌ తగిలింది. నాడు తండ్రికి తన బావ చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే.. నేడు బాలయ్యకు వెన్నుపోటు పొడిచారు. ఇక తాజాగా నిర్వహించిన రెండో సమావేశం నాటికే.. బాలయ్యను పక్కకు పెట్టారు. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో.. బాలకృష్ణ.. తన బావ చంద్రబాబు నాయుడు సీట్లో కూర్చోలేదు.

దాంతో.. టీడీపీ పగ్గాలు బాలయ్య చేతికి వెళ్తాయనే భయంతోనే.. ఇలా చేస్తున్నారని.. ఇదంతా చంద్రబాబు ఆదేశాలతోనే జరిగి ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతుంది. నాడు మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఇప్పుడు బాలయ్యను ఇలా అవమానించారా అనే కోణంలో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు జనాలు. ఒక రకంగా చెప్పాలంటే.. ఇది బాలయ్యకు వెన్నుపోటు లాంటిదే అని అభిమానులు బాధపడుతున్నారంట.

Show comments