SNP
నక్సలైట్‌గా జీవితం ఆరంభించిన సీతక్క.. అలియాస్ అనసూయ. నేడు తెలంగాణ కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కరనా సమయంలో ఆమె చేసిన సేవలు చూసి జనం ఫిదా అయిపోయారు. ఆ అభిమానం ఆమె ప్రమాణ స్వీకారం సందర్భంగా బయటకొచ్చింది.
నక్సలైట్‌గా జీవితం ఆరంభించిన సీతక్క.. అలియాస్ అనసూయ. నేడు తెలంగాణ కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కరనా సమయంలో ఆమె చేసిన సేవలు చూసి జనం ఫిదా అయిపోయారు. ఆ అభిమానం ఆమె ప్రమాణ స్వీకారం సందర్భంగా బయటకొచ్చింది.
SNP
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క మల్లు, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలిరావడంతో ఎల్బీ స్టేడియం కిక్కిరిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం హాజరయ్యారు.
అభిమానుల కేరింతలు, సంబురాల మధ్య తొలుత రేవంత్ రెడ్డి చేత గవర్నర్ తమిళి సై.. ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా.. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వినిపించిన జనం అరుపుల కంటే సీతక్క మంత్రిగా ప్రమాణం చేస్తున్న సమయంలో భారీగా కేరింతలు వినిపించాయి. సీతక్క డయాస్‌పైకి రాగానే.. స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. సీతక్క క్రేజ్ చూసి.. గవర్నర్ తమిళి సై షాక్ అయ్యారు. సీతక్క కొద్దిసేపు అలాగే ఉండిపోవడంతో.. గవర్నర్ స్వయంగా సీతక్కను ప్రమాణ స్వీకారం కొనసాగించాల్సిందిగా కోరారు. తర్వాత సీతక్క ప్రమాణస్వీకారం పూర్తి చేశారు.
కాగా, ఈ సంఘటన చూసిన వారికి బాహుబలితో ఒక అద్భుతమైన సీన్ గుర్తుకు వచ్చిందని సోషల్ మీడియాలో రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ సినిమాలో రాణా చక్రవర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ప్రభాస్ సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రభాస్ వచ్చి.. అమరేంద్ర బాహుబలి అను నేను అనగానే.. సభలో ఉన్న జనం, సైనికులు.. బాహుబలి జైహో అంటూ నినాదాలు మారుమోగిస్తారు. ఆ సీన్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఇప్పుడు సేమ్ సీన్.. సీతక్క మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే.. రిపీట్ అయింది. మరి ఒక నక్సలైట్ నుంచి నేడు మంత్రి స్థాయికి సీతక్క ఎదిగిన తీరు, ఆమె ప్రమాణం చేస్తున్న సమయంలో జనం స్పందించిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
HUGE RESPONSE from crowd as Danasari Anasuya Seethakka takes oath as a minister in #Telangana state cabinet. pic.twitter.com/sPS3wwDKJX
— Gulte (@GulteOfficial) December 7, 2023