iDreamPost
android-app
ios-app

9 ఏళ్లుగా నువ్వు MLA అని గుర్తులేదా బాలయ్య? బావ భక్తి అదుర్స్!

  • Published Sep 21, 2023 | 12:15 PM Updated Updated Sep 21, 2023 | 12:15 PM
  • Published Sep 21, 2023 | 12:15 PMUpdated Sep 21, 2023 | 12:15 PM
9 ఏళ్లుగా నువ్వు MLA అని గుర్తులేదా బాలయ్య? బావ భక్తి అదుర్స్!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. కొద్ది సేపటికే సభలో తీవ్ర ఉద్రిక్త​ వాతావరణం నెలకొంది. సభ ప్రారంభం నుంచి టీడీపీ సభ్యులు ఒవర్‌యాక్షన్‌ మొదలు పెట్టారు. స్పీకర్‌ పోడియంను చుట్టు ముట్టడమే కాక.. కాగితాలు, పేపర్లు విసుర్తూ.. తీవ్ర గందరగోళం సృష్టించారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అయితే మరో అడుగు ముందుకేసి.. సినిమాలో మాదిరి.. అసెంబ్లీలో మీసం తిప్పుతూ.. అధికార పార్టీ నేతలకు వార్నింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. బాలయ్య ప్రవర్తనతో సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక బాలయ్య చర్యలకు.. వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ధీటుగా కౌంటర్‌ ఇచ్చారు. మీసం తిప్పడం వంటి పనులు సినిమాలో చేయ్‌.. ఇక్కడ కాదంటూ.. మండి పడ్డారు.

ఇక అసెం‍బ్లీలో బాలయ్య ప్రవర్తన చూసి సామాన్య ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రజా సమస్యల గురించి చర్చించాల్సిన పవిత్ర వేదిక అయిన అసెం‍బ్లీలో అలా మీసం తిప్పడం ఏంటి.. ఇదేమైనా సినిమా షూటింగ్‌ అనుకుంటున్నారా అంటూ మండి పడతున్నారు. పైగా గత 9 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పని చేస్తున్న బాలయ్య.. కనీసం ఒక్క రోజైనా ప్రజా సమస్యల మీద అసెంబ్లీ వేదికగా తన గొంతు వినిపించాడా… లేదు కదా.

గతంలో ఎన్నడూ సరిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని బాలయ్య.. నేడు మాత్రం.. ఇలా రెచ్చి పోవడం ఏంటి.. అంటే మీ కుటుంబ సభ్యలకు సమస్య వస్తే.. అందరికన్నా ముందుండి ప్రశ్నిస్తారు.. అదే ప్రజా సమస్యల గురించి మాత్రం మీకు పట్టదా.. ఇదే పద్దతి బాలయ్య అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. నీ బావకు సమస్య వస్తేనే స్పందిస్తావా.. జనాల బాధలు నీకు పట్టవా అంటూ మండి పడుతున్నారు.

చంద్రబాబు జైల్లో ఉన్నాడు.. ఆయన అరెస్ట్‌ తర్వాత బాలయ్యే.. బావ చైర్‌లో కూర్చొని మరి.. రివ్యూ సమావేశాలు నిర్వహించారు. ఇక టీడీపీ పగ్గాలు పూర్తిగా బాలయ్యకే అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బాలయ్య తీరు చూస్తే.. పార్టీ పగ్గాలు పూర్తిగా తన చేతిలోనే ఉన్నాయి అని బటయకు తెలిసేలా చేయడం కోసమే ఇలా దూకుడుగా వ్యవహరించారా.. ఈ చర్యలతో టీడీపీకి నెక్ట్స్‌ బాస్‌ నేనే అని బాలయ్య ఇండైరెక్ట్‌గా హింట్‌ ఇస్తున్నాడా ఏంటి అని చర్చించుకుంటున్నారు జనాలు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabet