iDreamPost
android-app
ios-app

సమన్వయం సంగతి తర్వాత.. తణుకులో తన్నుకుంటున్న టీడీపీ, జనసేన

  • Published Oct 21, 2023 | 1:47 PM Updated Updated Oct 21, 2023 | 1:47 PM

ఆలు లేదు చూలు లేదు.. కొడుకు పేరు అమితాబ్‌ బచ్చన్‌ అన్నట్లుగా ఉంది ఏపీలో టీడీపీ, జనసేనల పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని ప్రకటించారు. అయితే ఏ పార్టీ ఎక్కడ.. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనే దాని గురించి క్లారిటీ ఇ‍వ్వలేదు. కానీ నేతలు మాత్రం అప్పుడే తన్నుకుంటున్నారు. ప్రస్తుతం తణుకులో టీడీపీ, జనసేనల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. ఆ వివరాలు..

ఆలు లేదు చూలు లేదు.. కొడుకు పేరు అమితాబ్‌ బచ్చన్‌ అన్నట్లుగా ఉంది ఏపీలో టీడీపీ, జనసేనల పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని ప్రకటించారు. అయితే ఏ పార్టీ ఎక్కడ.. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనే దాని గురించి క్లారిటీ ఇ‍వ్వలేదు. కానీ నేతలు మాత్రం అప్పుడే తన్నుకుంటున్నారు. ప్రస్తుతం తణుకులో టీడీపీ, జనసేనల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. ఆ వివరాలు..

  • Published Oct 21, 2023 | 1:47 PMUpdated Oct 21, 2023 | 1:47 PM
సమన్వయం సంగతి తర్వాత.. తణుకులో తన్నుకుంటున్న టీడీపీ, జనసేన

ఏపీ స్కిల్ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత నానా హంగామా చేసిన జనసేన పార్టీ, దాని అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌.. ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. దాంతో రెండు పార్టీల నడుమ సంబంధాలు చెడాయని.. టీడీపీతో పొత్తుని జనాలు వ్యతిరేకిస్తున్నారనే వార్తల నేపథ్యంలో.. పవన్‌ తన మనసు మార్చుకున్నారనే టాక్‌ కూడా వినిపించింది. అందుకే ఆయన టీడీపీకి దూరంగా ఉన్నారని.. ఇక పొత్తు మీద కూడా పునరాలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. టీడీపీ, జనేసన మధ్య పొత్తు పొడవక ముందే బెడిసికొట్టిందనే ప్రచారం సాగుతోంది.

అయితే దీనికి చెక్‌ పెట్టడం కోసం త్వరలోనే టీడీపీ-జనసేన తొలి సమన్వయ కమిటీ భేటీ మొదటిసారి సమావేశం కానున్నారు. ఈ నెల 23న అనగా సోమవారం రాజమండ్రిలో టీడీపీ-జనసేన తొలి సమావేశం జరుగుతుందని తెలుస్తోంది. అయితే రెండు పార్టీల మధ్య సమన్వయం సంగతి దేవుడురెగు కానీ.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోకవర్గాల్లో​ టీడీపీ-జనసేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని అంటున్నారు రాజకీయ పండితులు. ఈ క్రమంలోనే తణకులో టీడీపీ-జనసేన మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది అని అంటున్నారు.

ఢీ అంటే ఢీ అంటున్న ఆశావాహులు..

టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. పొత్తు ఉంటుందని చెప్పారు కానీ.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. ఏ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేస్తుంది అనే దాని గురించి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అనేక కీలక నియోజకవర్గాల్లో మాత్రం ఇరు పార్టీల నేతలు సీట్ల మీద ఆశలు పెట్టుకోవడమే కాక.. ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్నికల్లో తమకే సీటు కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఒక వేళ పొత్తులు ఖరారు అయితే.. టికెట్ తమకే ఇవ్వాలని ఇప్పటికే పార్టీ పెద్దలకు విన్నవించుకుంటున్నారు ఇరు పార్టీలకు చెందిన ఆశావాహులు. అంతేకాక ఎన్నికల లోపు స్థానికంగా కూడా తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

జనసేన తరఫున విడివాడ..

2019 ఎన్నికల్లో తణుకు నియోజవర్గంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష‍్ణ ప్రాతినిధ్యం వహించారు. అటు జనసేన నుంచి పసుపులేటి వెంకటరామరావు పోటీ చేశారు. ఫలితాల్లో జనసేన అభ్యర్థి 30 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత నెమ్మదిగా పార్టీ నుంచి దూరమయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో జనసేన సీటు ఆశించి.. టికెట్‌ దక్కకపోయినా సరే.. విడివాడ రామచంద్రరావు మాత్రం.. పార్టీనే అంటి పెట్టుకుని ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికల్లో విడివాడకు న్యాయం చేస్తానని పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా ప్రకటించారు. దాంతో ఆయనకు టికెట్‌ కన్ఫామ్‌ అయ్యింది అనుకున్నారు అంతా. అయితే అనూహ్యంగా టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందని ప్రకటన వెలువడిన నేపథ్యంలో.. తణుకు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. విడివాడ, ఆరిమిల్లిలో ఎవరో ఒక్కరే పోటీ చేసే అవకాశం ఉండటంతో.. దీనిపై చర్చలు ఊపందుకున్నాయి.

పోటీ చేసేది నేనే: ఆరిమిల్లి

అయితే ఆరిమిల్లి మాత్రం.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున తానే పోటీ చేస్తానని.. దీనిపై నాయకులతో మాట్లాడతాను.. పోటీ చేసేది నేనే అని ఆరిమిల్లి ప్రకటించుకున్నారు. అటు విడివాడ కూడా ఇదే మాట చెబుతున్నారంట. వచ్చే ఎన్నికల్లో టీడీపీని కలుపుకుని పోయి.. ఎన్నికల్లో విజయం సాధిస్తానని విడివాడ కార్యకర్తలకు చెప్తున్నారట. ఇద్దరు నేతలు కూడా.. పోటీ చేసేది నేనంటే నేను అని ప్రకటించుకుంటున్నారు.

అయితే ఇక్కడ వైసీపీకి కలిసి వచ్చే అంశం ఒకటి ఉంటుంది అంటున్నారు రాజకీయ పండితులు. విడివాడ, ఆరిమిల్లి ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో.. ఇది ఇప్పుడు అధికార వైసీపీకి కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచాన వేస్తున్నారు. తణుకు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు 60 వేల వరకు ఉండగా.. తర్వాత స్థానాల్లో బీసీ, ఇతర ఓట్లు ఉన్నాయి.

కుల సమీకరణాల ప్రకారం చూసుకుంటే.. టీడీపీ-జనసేనల మధ్య సఖ్యత లోపించడం.. వైసీపీకి కలిసి వస్తుంది అంటున్నారు రాజకీయ పండితులు. ఇక ఇదే నియోజవర్గంలో వైసీపీ తరఫున ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేస్తోన్న కారుమూరి నాగేశ్వరరావు కొనసాగుతున్నారు. ఆయనది బీసీ సామాజిక వర్గం. దాంతో జనసేన-టీడీపీల మధ్య విబేధాలు వైసీపీకి కలసి వస్తాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.