iDreamPost
android-app
ios-app

షీనా బోరా కేసుపై వెబ్ సిరీస్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

ఇప్పుడు ఓటీటీలదే హవా. అందులోనూ క్రైమ్, హార్రర్ జోనర్ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు మూవీ లవర్స్. కర్రీ అండ్ సెనైడ్, కిల్లర్ సూప్ బాగా అలరించాయి. ఇప్పుడు మరో థ్రిల్లర్ క్రైమ్ రాబోతుంది. ఎక్కడ, ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అంటే..?

ఇప్పుడు ఓటీటీలదే హవా. అందులోనూ క్రైమ్, హార్రర్ జోనర్ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు మూవీ లవర్స్. కర్రీ అండ్ సెనైడ్, కిల్లర్ సూప్ బాగా అలరించాయి. ఇప్పుడు మరో థ్రిల్లర్ క్రైమ్ రాబోతుంది. ఎక్కడ, ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అంటే..?

షీనా బోరా కేసుపై వెబ్ సిరీస్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

థియేటర్లలో సినిమా ఎంజాయ్ చేసేవాళ్ల కన్నా ఓటీటీలో చూసే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. కేవలం తెలుగు చిత్రాలే కాదూ.. డబ్బింగ్ వర్షన్లతో వస్తోన్న పర భాష సినిమాలను ఆదరిస్తున్నారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, కొరియన్ డ్రామాలను కూడా వాచ్ చేస్తున్నారు. సినిమాలే కాదూ సిరీస్‌లు కూడా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఓటీటీ కోసమే సినిమాలు/ డాక్యుమెంటరీస్ తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఇటీవల ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు సినీ లవర్స్. కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో పాటు.. చివరకు థ్రిల్ మిస్ కాకుండా చూపిస్తుండటంతో బాగా కనెక్ట్ అవుతున్నారు. పాత క్రైమ్ స్టోరీలను కొత్త సీసాలో వేసి.. ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఇటీవల వచ్చిన కర్రీ అండ్ సెనైడ్, కిల్లర్ సూప్..ఓ రియాలిటీ స్టోరీస్. కేరళలో ఓ మహిళ.. ఆరుగురు కుటుంబ సభ్యులను సెనైడ్‌తో చంపి.. కట్టుకథ అల్లుతుంది. ఇదే కర్రీ అండ్ సెనైడ్. తెలంగాణలోని నాగర్ కర్నూల్ స్వాతి రెడ్డి.. హత్య కేసు ఆధారంగా కిల్లర్ సూప్ తెరకెక్కించింది బాలీవుడ్. ఇప్పుడు మరో క్రైమ్ కథ..రాబోతుంది. అదే షీనా బోరా హత్య ఉదంతం. ఈ సంఘటన ఎంతటి సంచలనం కలిగించిందో తెలుసు. ఇప్పుడు ఈ హత్య కేసును డాక్యుమెంటరీగా రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో వచ్చే నెలలో ప్రసారం కానుంది. ఫిబ్రవరి 23 నుండి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని సంస్థ వెల్లడించిందది. ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ : బరీడ్ ట్రూత్’ పేరుతో త్వరలో స్ట్రీమింగ్ కానుంది.  హిందీతో పాటు ఇంగ్లీష్, తెలుగు, కన్నడలో కూడా ప్రసారం కానుంది.

ఇక కథ విషయానికి వస్తే.. 2012లో షీనా బోరా హత్య జరుగుతుంది. తల్లి ఇంద్రాణీ ముఖర్జీ ఆమెను హత్య చేసి.. ఏమి ఎరుగన్నట్లు ఉండిపోయింది. అయితే 2015లో ఇంద్రాణీ కారు డ్రైవర్ శ్యాంవర్ పింటూరామ్ రాయ్ ఓ కేసులో పట్టుబడగా.. అప్పుడు ఈ ఘటన బయటకు వచ్చింది. రెండు పెళ్లిళ్లు చేసుకుని, వారి నుండి విడిపోయిన ఇంద్రాణీ.. మరొక వ్యక్తిని మనువాడింది. కుమార్తె షీనాను అతడికి, ఈ లోకానికి చెల్లెలిగా పరిచయం చేసిన ఇంద్రాణీ.. ఆ తర్వాత సవితి తండ్రి, కారు డ్రైవర్ సాయంతో షీనాను చంపిన తల్లి.. మృతదేహాన్ని మటుమాయం చేసింది. అనంతరం ఈ ముగ్గుర్ని అరెస్టు చేయగా.. ఇంద్రాణి ముఖర్జీకి జైలు శిక్ష విధించింది కోర్టు. ఆరున్నరేళ్ల జైలు జీవితం తర్వాత.. 2022 మే నెలలో జైలు నుండి విడుదలయ్యింది. ఇప్పుడు ఈ కేసు ఇప్పుడు ఓటీటీలోకి వెబ్ సిరీస్ రూపంలో రాబోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)